బెల్లం రుచిలోనే కాదు ఆరోగ్యాన్ని(Health) అందించడంలోనూ మేటి. అందుకే, చక్కెర(Sugar)కు బదులు ఎక్కువ మంది బెల్లం ఉపయోగిస్తుంటారు. అయితే, మనకు తెలిసిన సాధారణ బెల్లంలే కాకుండా చాక్లెట్‌తో సమానమైన రుచినిచ్చే ఒక రకమైన బెల్లం కూడా అందుబాటులో ఉంది. ఇదేమిటని ఆశ్చర్యపోతున్నారా?.. మీరు విన్నది నిజమే!.. ఈ చాక్లెట్ రుచినిచ్చే బెల్లాన్ని తమిళనాడులోని రకరకాల తీపి వంటకాలతో పాటు ఫిల్టర్ కాఫీని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీన్ని తాటి బెల్లం, ఖర్జూర రసం నుంచి తయారు చేస్తారు. దీన్ని అక్కడ కరుపట్టి బెల్లంగా పిలుస్తారు.
ఈ బెల్లం ప్రత్యేకమైన చాక్లెట్ రుచిని కలిగి ఉండటమే కాదు పెద్ద మొత్తంలో పోషకాలతో నిండి ఉంటుంది. దీనిలో పుష్కలంగా విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఖర్జూర రసంతో తయారు చేసిన ఇలాంటి చాక్లెట్ బెల్లం బెంగాల్లోనూ ప్రసిద్ధి చెందింది. అక్కడ ‘సొండేష్’గా దీన్ని పిలుస్తారు. ఈ బెల్లంతో చేసే ‘నోరూన్ గుర్’ స్వీట్ అత్యంత రుచికంగా ఉంటుంది. అందుకే ఈ స్వీట్ బెంగాల్లో చాలా ఫేమస్.
శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే, తాటి బెల్లంలోనే ఎక్కువ పోషకాలుంటాయి. ఇది మినరల్స్‌తో నిండి ఉంటుంది. ఈ చాక్లెట్ బెల్లంను భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో స్వీట్లు, ఇతర వంటకాల్లో బెల్లంను విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే సాధారణంగా మనం ఉపయోగించే బెల్లం చక్కెర మాదిరిగా తీపిగా ఉంటుంది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన బెల్లం మాత్రం చాక్లెట్ రుచిని అందిస్తుంది. ఈ చాక్లెట్ బెల్లంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
ఇందులో ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో సహకరిస్తాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందుకే, సాధారణ బెల్లంతో పోలిస్తే తాటి బెల్లం మీ రక్తహీనతకు చక్కటి పరిష్కారం చూపగలవు. అయితే, తమిళనాడులో కరుపట్టిగా పిలిచే ఈ బెల్లం చక్కెర మాదిరిగా పాలిష్ చేసి ఉండదు. ఇది గుజ్జుగా, గట్టిగా ఉంటుంది. అందుకే, దీన్ని ముక్కలుగా చేసి ఫిల్టర్ కాఫీ తయారీలో ఉపయోగిస్తారు. ఇతర శుద్ధి చేసిన బెల్లం కంటే ఇది ఆరోగ్యకరమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health benefits, Jaggery, Sugar