నెలలు నిండకుండానే పుట్టే శిశువుల శరీర భాగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవు. దీంతో వారికి వైద్యుల పర్యవేక్షణలో వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. ఈ కారణంగా వారి పెరుగుదలపై ప్రభావం పడుతుందని, పిల్లల్లో నొప్పులు(Pains), బాధ కూడా అధికంగా ఉంటుందని గత పరిశోధనలు వెల్లడించాయి. అయితే ఇలాంటి సమయంలో తల్లిని పిల్లలకు దగ్గరగా ఉంచి, ఆమె గొంతును వినిపించడం వల్ల ఆ బాధ, నొప్పి కొంతమేర తగ్గుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. ఈ పరిశోధనను సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్ (Journals)లో ప్రచురించారు.
సాధారణంగా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలను వారి తల్లులకు దూరంగా తీసుకెళ్లి ఇంటెన్సివ్ కేర్(Intensive Care) యూనిట్‌లో ప్రత్యేక ఇంక్యుబేటర్ (Incubator)లో ఉంచి చికిత్స అందిస్తారు. క్రమం తప్పకుండా మందులు ఇస్తూ వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్నిసార్లు ఈ వైద్య పరిస్థితులు వారి ఎదుగుదలకు ప్రమాదకరంగా మారుతాయి. గర్భం దాల్చిన తర్వాత 37 వారాల కంటే ముందే శిశువు (Baby) జన్మించినప్పుడు, వారిని ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. బ్లడ్ శాంపిల్, ట్యూబ్ ద్వారా ఆహారం ఇవ్వడం లాంటి ఇతర సాధారణ వైద్య చికిత్సలు అందిస్తారు. అయితే ఇది వారి ఎదుగుదల, నొప్పి నిర్వహణపై ప్రభావం చూపుతుంది.
పరిశోధన ఎవరు చేశారు?
శిశువు ఆరోగ్యాన్ని(Health) మెరుగుపరచాలనే ఉద్దేశంతో జెనీవా వర్సిటీ (UNIGE) పరిశోధకులు.. ఇటలీ(Italy)లోని పరిణి హాస్పిటల్, వల్లే డీఓస్టా విశ్వవిద్యాలయం (University)తో కలిసి ఈ పరిశోధన చేపట్టారు. తల్లి శిశువుతో మాట్లాడినప్పుడు పిల్లల్లో ఆక్సిటోసిన్ స్థాయిలను అంచనా వేశారు. దీని ద్వారా నెలలు నిండక ముందే జన్మించిన శిశువుల్లో నొప్పి తగ్గుతుందని గుర్తించారు. ఈ పరిశోధన తల్లితో బిడ్డ సాన్నిహిత్యాన్ని హైలెట్ చేస్తుంది.
పిల్లల నొప్పిపై అధ్యయనం ఎలా చేశారు?
ఇటలీలోని పరిణి ఆసుపత్రిలోని 20 మంది నెలలు నిండకముందే జన్మించిన శిశువులపై (Premature Babies) ఈ పరిశోధన చేశారు. వీరి మడమ నుంచి కొన్ని చుక్కల రక్తం సేకరించడం ద్వారా రోజువారీ రక్తపరీక్ష చేశారు. మూడు రోజుల పాటు 3 దశల్లో ఈ ప్రయోగం జరిగింది. తల్లి లేకుండానే మొదటి ఇంజెక్షన్ ఇచ్చారు. రెండోది శిశువుతో తల్లి మాట్లాడుతుండగా ఇచ్చారు. మూడో ఇంజెక్షన్.. శిశువు దగ్గర తల్లి పాడుతుండగా ఇచ్చారు.
అధ్యయనం ఫలితం..
ముందుగా, తల్లి ఉన్నప్పుడు శిశువు అసౌకర్యం తగ్గిపోయిందా లేదా అని పరిశోధకులు చూశారు. ఈ ప్రక్రియను అంచనా వేయడానికి పరిశోధకులు ప్రీటర్మ్ ఇన్ఫాంట్ పెయిన్(PIPP) అనే విధానాన్ని ఉపయోగించారు. ఇది ముఖ సంకేతాలు, శిశువు హృదయ స్పందన, ఆక్సిజనేషన్ (Oxytocin) లాంటి ఫిజియోలాజికల్ డేటాను సేకరిస్తుంది. ఇది 0 నుంచి 21 మధ్య కోడింగ్ ను సూచిస్తుంది.
ఇది చదవండి: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..
తల్లి దూరంగా ఉన్నప్పుడు పీఐపీపీ రీడింగ్ 4.5 వచ్చింది. తల్లి తన బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు ఇది 3, తల్లి పాడినప్పుడు 3.8గా ఉన్నట్లు పీఐపీపీ ఫలితాలు వచ్చాయి. తల్లి స్వర శబ్దం ప్రకారం ఈ వ్యత్యాసాలు గమనించవచ్చు. ‘శిశువుల ప్రవర్తనను కోడ్ చేయడానికి మేము బ్లడ్ శాంపిల్ ను చిత్రీకరించాం. అంతేకాకుండా శిక్షణ పొందిన సిబ్బంది ద్వారా, శబ్దం లేకుండా, తల్లి ఉందో లేదో తెలియకుండా ఉండటానికి వీడియోలు బ్లైండ్ చేశాం’ అని అధ్యయన బృంద సభ్యులు డీడియర్ గ్రాండ్ జీన్ (Jean)పేర్కొన్నారు.
ఇది చదవండి: అక్టోబర్ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..
శిశువుల పక్కనే తల్లి ఉండాలి
నవజాత శిశువులకు వైద్య ప్రక్రియల సమయంలో తల్లి పక్కనే ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ లాంటి సున్నితమైన వాతావరణంలో తల్లిదండ్రులు(Parents), పిల్లలను కలిపే ప్రాముఖ్యతను అధ్యయనం గుర్తిస్తోందని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు మాన్యూలా ఫిలిప్పా(Manuala Philippa) తెలిపారు. "తల్లిదండ్రులు(Parents) ఇక్కడ రక్షణాత్మక పాత్ర పోషిస్తారు. తమ బిడ్డకు సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండటానికి ఈ రిసెర్చ్ సహాయపడుతుంది. ఇది పూర్తిగా తల్లి, బిడ్డల బంధాలను బలపరుస్తుంది" అని డీడియర్ గ్రాండ్ జీన్ స్పష్టం చేశారు.
ఇది చదవండి: వృద్ధురాళ్లపై లైంగిక దాడి.. నిందితుల్లో ఒకరికి 22 ఏళ్లు.. మరొకరికి 32 ఏళ్లు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.