Home /News /life-style /

HEALTH ONLINE CLASSES INCREASE LONG SCREEN HOURS LEAD TO MYOPIA AND SQUINT EYE IN KIDS SU GH

Eye problems in kids: పిల్లల్లో పెరుగుతున్న మియోపియా సమస్య.. కారణమేంటంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిల్లల్లో మియోపియా (Myopia) సమస్య ఎక్కువవుతోందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించినా.. దూరంగా ఉన్నవి బ్లర్​ (అస్పష్టంగా) కనిపంచడాన్నే మియోపియా అంటారు.

కరోనా వైరస్(Coronavirus).. పిల్లలపై చాలా విధాలుగా ప్రభావం చూపుతోంది. విద్యా సంస్థలు మూతపడడంతో మొత్తం విద్య ఆన్​లైన్ క్లాసులకు మారిపోయింది. దీంతో పిల్లలు మొబైళ్లు, ట్యాబ్​లు, కంప్యూటర్ల ముందు గంటల పాటు ఉంటున్నారు. దీంతో వారి స్క్రీన్ సమయంచాలా పెరిగిపోయింది. ఈ కారణంగా పిల్లల్లో కంటి సమస్యలు అధికమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పిల్లల్లో మియోపియా (Myopia) సమస్య ఎక్కువవుతోందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించినా.. దూరంగా ఉన్నవి బ్లర్​ (అస్పష్టంగా) కనిపంచడాన్నే మియోపియా అంటారు. అలాగే పిల్లల్లో స్కింట్ ఐ(మెల్లకన్ను) ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయని అంటున్నారు.

8-16 సంవత్సరాల మధ్య పిల్లల్లో మియోపియా సమస్య రెట్టింపు అయిందని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ నిర్వహించిన మీడియా సమావేశంలో కంటి వైద్యులు చెప్పారు. గతంతో పోలిస్తే మహమ్మారి కాలంలో స్కూల్​ పిల్లల్లో మియోపియా కేసులు రెండు రెట్లు పెరిగాయని వెల్లడించారు. అలాగే మిగిలిన కంటి సమస్యలు కూడా అధికమయ్యాయని చెప్పారు. కరోనా ప్రభాకం కంటే ముందు 10 నుంచి 15 శాతం మంది పిల్లలు వివిధ కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వస్తుంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 30 నుంచి 40 శాతానికి పెరిగిందని వైద్యులు చెప్పారు. ముఖ్యంగా కళ్లు పొడిబారడం, స్కింట్​ ఐ, పొడి కళ్లు, మియోపియా, కండ్ల కలక తదితర సమస్యలు పిల్లల్లో ఎక్కువగా వస్తున్నాయని వెల్లడించారు.

Almonds: రోజు బాదం తింటున్నారా?.. ఈ ఐదు లక్షణాలు ఉన్నవారు మాత్రం బాదం తినకండి.. తింటే ప్రమాదాన్ని ఆహాన్వించినట్టే..

“ఎక్కువ సేపు డిజిటల్ స్క్రీన్లను(Digital Screens) చూస్తూ ఉండడం వల్ల కళ్లు పొడిగా మారతాయి. అలాగే దూరంగా ఉన్నవస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం, మెల్లకళ్లు, అలర్జీలు వచ్చే రిస్క్ ఉంటుంది. త్వరగా కళ్లలో నుంచి నీళ్లు రావడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. కళ్లు పొడిగా మారవడం వల్ల అలర్జీలు(eye allergies) వస్తాయి. దీని ద్వారా పిల్లలు ఎక్కువ కళ్లను నులుముకుంటారు. దీంతో చిన్నవయసులోనే మియోపియా అధికమయ్యే ప్రమాదం ఉంటుంది” అని వైద్యులు పేర్కొన్నారు.

Nail: ఆ సమయంలో గోళ్లు కత్తిరించకూడదా..? ఈ విషయాలు మీకు తెలుసా..?

అలాగే విరామం లేకుండా గంటల పాటు డిజిటల్ స్క్రీన్ల ముందు ఎక్కువ మంది పిల్లలు కూర్చుంటున్నారని, అందులోనూ స్క్రీన్లకు చాలా దగ్గరగా కూర్చుంటుండడం వల్ల సమస్య ఎక్కువవుతోందని అన్నారు. “రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువగా బ్రైట్ స్క్రీన్ ముందు కూర్చునే పిల్లలకు మియోపియా, స్కింట్ ఐ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్రేక్​ లేకుండా ఎక్కువ సమయం కూర్చుంటే ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా స్క్రీన్ల నుంచి పిల్లలు(Children) కనీసం 33 సెంటీమీటర్ల దూరం ఉంటాలి. అలాగే ప్రతీ 20 నిమిషాలకు ఓసారి బ్రేక్ తీసుకోవాలి. వీలైనప్పుడల్లా బయటికి వెళ్లాలి.” అని వైద్యులు చెబుతున్నారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Children, Coronavirus, Lifestyle, Online classes

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు