ఒక్క కణం.. మరో కణాన్ని ఛిన్నాభిన్నం చేసేస్తుంది. ఆ కణం మరో కణాన్ని.. అలా శరీర వ్యవస్థనే పాడు చేసే అత్యంత ప్రమాదకర వ్యాధి కేన్సర్. గొంతు, రొమ్ము, ప్రొస్టేట్, కాలేయం.. ఇలా శరీరంలోని కీలక భాగాలను టార్గెట్ చేసుకొని ఆరోగ్య కణాలను చంపేసే ఈ మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. అయితే.. ఈ వ్యాధి భారత్ చాప కింద నీరులా ఊహించనంత వేగంగా విస్తరిస్తోందట. ఎంతలా అంటే.. ప్రతి 10 మంది భారతీయుల్లో ఒకరికి కేన్సర్ వచ్చేంత ప్రమాదకరంగా. కేవలం 2018లోనే భారత్లో 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదయ్యాయి. దీని ప్రకారం ప్రతి 15 మందిలో ఒకరు మృత్యువాతపడతారట. ఈ సంచలన నిజాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ బయటపెట్టింది. ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
దేశంలో రొమ్ము, ఓరల్, గర్భాశయ, పొట్ట, పేగు కేన్సర్లే ఎక్కువగా వస్తున్నట్లు తెలిపింది. మొత్తం కేన్సర్లలో 45 శాతం ఇవే కేన్సర్లు వస్తున్నట్లు వెల్లడించింది. 1,62,500 రొమ్ము కేన్సర్ కేసులు, 1,20,000 ఓరల్ కేన్సర్ కేసులు, 97 వేల గర్భాశయ కేన్సర్ కేసులు, 68 వేల ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు, 57 వేల పొట్ట కేన్సర్ కేసులు నమోదైనట్లు వివరించింది. పొగాకు సంబంధిత ఉత్పత్తులను తినడం వల్ల ఓరల్ కేన్సర్ కేసులు ఎక్కువైనట్లు వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cancer, Health Tips, Tips For Women, Women health