బరువు తగ్గాలని, అందంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. అయితే కష్టపడి ఎక్సర్సైజ్లు చేయాలన్నా, నోరు కట్టుకుని డైటింగ్లు చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే బరువు తగ్గే ప్రయత్నాలు ఎక్కువ కాలం కొనసాగవు. అయితే ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. తిండిని కంట్రోల్ చేసుకోకుండా, వర్కవుట్(Workout)లు చేయకుండా, ఇతర మార్గాలలో కొంత బరువు తగ్గవచ్చని తెలిపారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* నెమ్మదిగా తినాలి
తక్కువ ఆహార భాగాన్ని నమిలేందుకు ఎక్కువ సమయం తీసుకోవాలి. ఇలా తక్కువ ఆహారం తీసుకున్నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. 15 నుంచి 20 నిమిషాల పాటు కొంచెం కొంచెం తింటుంటే కడుపు నిండి పోయిందనే సంకేతం మెదడుకు చేరుతుంది. ఎవరికైనా నెమ్మదిగా తినండి అని చెబితే చాలా చిన్న చూపు చూస్తారు. కానీ బరువు తగ్గడంలో ఈ చిట్కా అద్భుతంగా పని చేస్తుంది.
* ప్రొటీన్ డైట్ ఉండాల్సిందే
ప్రొటీన్ ఫుడ్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. రోజువారీ తినే ఆహారంలో గుడ్లు, చికెన్, పోర్క్ రిబ్స్, గ్రీక్ యోగర్ట్ లాంటి ప్రొటీన్(Protein) సోర్స్ ఉన్న ఆహారం భాగం చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రొటీన్‌తోపాటు ఫైబర్ కలిపి తినడం వల్ల ఇంకా ప్రయోజనం ఉంటుంది. కడుపును నిండుగా ఉంచుకునేందుకు ఇది ఒక అద్భుతమైన మార్గం.
* తినేటప్పుడు తిండి మీదే దృష్టి పెట్టాలి
ఎక్కువ మంది టీవీ, స్మార్ట్ఫోన్లు చూస్తూ భోజనం చేస్తుంటారు. దీనివల్ల అవసరమైన దానికంటే ఎక్కువగా తినేస్తారు. అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అందుకే తినే సమయంలో దృష్టి అంతా ప్లేట్లోని ఆహార పదార్థాలపై ఉండాలి.
* చక్కని నిద్ర అవసరం
మంచి నిద్ర ప్రాముఖ్యత అందరికీ తెలుసు. బెడ్ టైంకి అరగంట ముందు స్క్రీన్లను చూడటం ఆపేయాలి. బదులుగా పుస్తకాలు చదవడం, రాయడం చేయాలి. నిద్రకు తగినంత సమయం కేటాయించాలి.
* భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు
భోజనానికి 20 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి. ఇది బాగా పని చేసే చిట్కా. భోజనానికి ముందు నీరు తాగితే తక్కువగా తింటారు. ప్రయత్నించినా కూడా ఎక్కువ ఆహారం తినలేరు.
Winter Eye Care : చలితో కళ్లకు సమస్యలు .. ఈ పండ్లతో పరిష్కరించండి
డిసెంబర్లో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా..అయితే మీ భాగస్వామితో కలిసి ప్రదేశాలకు వెళ్లండి
* షుగర్ డ్రింక్స్‌కి నో
నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్ల లాంటి వాటిని తాగేందుకు ప్రయత్నించాలి. మార్కెట్లో దొరికే షుగర్ డ్రింక్‌లు(Sugar Drinks) అనారోగ్యకరం.
* చెడు చిరుతిళ్లు వద్దు
చిరుతిళ్లు ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఫ్రిజ్, స్నాక్స్ డబ్బాలో ప్రతి రెండు రోజులకు తాజా పదార్థాలను తెచ్చి పెట్టుకోవాలి. జంక్ ఫుడ్ లాంటివి కాకుండా సలాడ్లు, మొలకలలాంటి వాటిని ఎక్కువగా తినాలి. క్యారెట్, బీట్రూట్, కీరదోస లాంటి వాటితో చిరుతిళ్లను తయారు చేసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Weight loss