హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Black Coffee: బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటున్నారా..? అయితే బ్లాక్ కాఫీ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి

Black Coffee: బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటున్నారా..? అయితే బ్లాక్ కాఫీ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి

ఉపవాసం చేసే సమయాల్లో బ్లాక్ కాఫీ తీసుకోవడంపై సూచనలు.  (Image: Shutterstock)

ఉపవాసం చేసే సమయాల్లో బ్లాక్ కాఫీ తీసుకోవడంపై సూచనలు. (Image: Shutterstock)

కొందరు బరువు తగ్గే ప్రయత్నాల్లో భాగంగా ఉపవాసం (Fating) ఉంటుంటారు. ఆ సమయాల్లో శరీరానికి శక్తిని అందించడం కోసం కాఫీ (Coffee) ఎక్కువగా తాగుతుంటారు. వాస్తవానికి ఫాస్టింగ్‌ సమయాల్లో బ్లాక్‌ కాఫీ శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రకం కాఫీ వినియోగంలో కొన్ని ?

ఇంకా చదవండి ...

కొందరు బరువు తగ్గే ప్రయత్నాల్లో భాగంగా ఉపవాసం ఉంటుంటారు. ఆ సమయాల్లో శరీరానికి శక్తిని అందించడం కోసం కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. వాస్తవానికి ఫాస్టింగ్‌ సమయాల్లో బ్లాక్‌ కాఫీ శరీరానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రకం కాఫీ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఫాస్టింగ్‌ (Fasting) ఉండటం వల్ల బరువు తగ్గుతారని, వెయిట్‌ లాస్‌(Weight Loss) కావడానికి ఇది మోస్ట్‌ ఎఫెక్టివ్‌ మార్గమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ బరువు తగ్గే ప్రక్రియలో ఒక వ్యక్తి 8 గంటలు లేదా 16 గంటల పాటు ఫాస్టింగ్‌ ఉంటే తినే విషయంలో కచ్చితమైన వేళలను పాటించాలి. వెయిట్‌ లాస్‌ డైట్‌తో బరువు సులువుగా తగ్గుతారు. ఫాస్టింగ్‌ సమయంలో, ఒక వ్యక్తి ఎక్కువ కేలరీలను తీసుకోకుండా ఉండటం కోసం, నీరసం రాకుండా శరీరానికి అవసరమైన శక్తిని అందించడం కోసం ద్రవ పదార్థాలు తీసుకోవడం మేలు. ఫాస్టింగ్‌ సమయంలో శరీరానికి అధిక కేలరీలు అందించకుండా తీసుకోవాల్సిన ద్రవ పదార్థాలలో బ్లాక్ కాఫీ ఒకటి. శరీరానికి శక్తిని అందించడంలో బ్లాక్ కాఫీ చాలా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెబుతారు.

ఇదీ చదవండి: భారతీయ మహిళలకు గొప్ప అవకాశం.. ఐరాస మహిళా విభాగంతో లింక్డ్ ఇన్ ఒప్పందం


ఫాస్టింగ్‌ అనేది మెరుగైన జీర్ణక్రియ, జీవక్రియ, కణాల పనితీరు వంటి ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. కానీ ఆకలిని అణిచివేసేందుకు, శక్తిని పెంచే ప్రయత్నంలో చాలా మంది ఫాస్టింగ్‌ సమయాల్లో కెఫిన్‌ను అధిక మోతాదులో తీసుకుంటారు. బరువు తగ్గాలనుకుంటున్న వారు ఫాస్టింగ్‌ సమయంలో తక్కువ మొత్తంలో బ్లాక్‌ కాఫీ తాగడం మేలు చేస్తుంది. కానీ కాఫీ ద్వారా ఎక్కువ కెఫిన్‌(Caffeine)ను శరీరానికి అందించడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణులు చేసిన సూచనలు ఇవే..


  1. పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల మేరకు.. ఇప్పటికే ఎసిడిటీకి గురవుతుంటే కెఫిన్‌ కడుపులో ఆమ్ల స్థాయిని పెంచుతుంది. శరీరంలో 'GRED లక్షణాలను' పెంచే కొన్ని అంశాలు కాఫీలో ఉన్నాయి.

  2. కాఫీ ఆందోళన లక్షణాలను పెంచుతుందని, మనల్ని భయాందోళనలకు గురిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

  3. ముందుగా గుండెకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నవారు, అధిక రక్తపోటు లేదా అధిక హృదయ స్పందన రేటు ఉన్నవారు, ఫాస్టింగ్‌ సమయంలో తప్పనిసరిగా కాఫీకి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

  4. హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్న మహిళలు కూడా కాఫీకి దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ నిష్పత్తిని అసమతుల్యం చేయడం ద్వారా ఈస్ట్రోజెన్ మెటాబోలైట్స్‌లో అసమతుల్యతకు కారణమవుతుంది.

  5. థైరాయిడ్ ఔషధాలలో ఉపయోగించే లెవోథైరాక్సిన్ శోషణను కాఫీ ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  6. అధిక కెఫిన్ జీర్ణ సమస్యలను సృష్టిస్తుందని, పేగు కదలికను వేగవంతం చేస్తుందని కూడా నిపుణులు వివరిస్తున్నారు.

First published:

Tags: Coffee, Fasting, Health benefits, Health care

ఉత్తమ కథలు