వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే వ్యాధుల్లో కీళ్లవాపు ఒక సాధారణ అనారోగ్యం. దీన్ని ఆర్థరైటిస్ అంటారు. కీళ్ల వాపుతో పాటు కీళ్ల నొప్పి.. ఆర్థరైటిస్ లక్షణాలు. బరువు ఎక్కువగా ఉన్నవారు, వృద్ధులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కీళ్ల నొప్పి వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. అందుకే ఈ సమస్యపై అవగాహన అవసరం. దీని బారిన పడకుండా ఉండేందుకు ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న రోగులు తగిన బరువు తగ్గించే పద్ధతులను అనుసరించాలి. అయితే నాన్ సర్జికల్ పద్ధతుల్లో మోకాలి కీళ్ల వాపును ఎలా తగ్గించుకోవచ్చో వివరిస్తున్నారు డాక్టర్ సమర్థ్.
** కన్జర్వేటివ్ ట్రీట్‌మెంట్స్
* ఫిజికల్ ఏజెంట్స్
మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్స కోసం ఫిజికల్ ఏజెంట్స్ పరిగణించాలి. ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీ, లేజర్ థెరపీ, మాగ్నెటోథెరపీ, వైబ్రేషనల్ ఎనర్జీ అప్లికేషన్ అత్యంత ప్రభావవంతమైన ఫిజికల్ ఏజంట్స్‌గా ఉన్నాయి.
* శారీరక వ్యాయామం
మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులు ఇంట్లోనే కొన్ని రకాల వ్యాయామాలు చేస్తూ సమస్యను తగ్గించుకోవచ్చు.
* మైండ్-బాడీ ఎక్సెర్‌సైజ్
మోకాలి కీళ్ల వాపు ఉన్న రోగులకు మైండ్- బాడీ ఎక్సెర్‌సైజ్‌లు(హఠ యోగా వంటివి) చికిత్సా విధానంగా పరిగణిస్తారు.
* కండరాలను బలపరిచే వ్యాయామాలు
ఈ సమస్యకు కండరాలను బలపరిచే వ్యాయామాలు (ఇతర రకాల చికిత్సా వ్యాయామాలతో పాటు లేదా లేకుండా) చికిత్స మార్గాలుగా ఉన్నాయి. నిర్దిష్ట లక్షణాలు (రెసిస్టెన్స్ రకం, కాంట్రాక్షన్స్ రకం, పర్యవేక్షణ పద్ధతి, వ్యాయామ కార్యక్రమం తీవ్రత, వ్యవధి) ఉన్నప్పుడు, దానికి తగ్గట్లు పరిష్కారాలు సూచించవచ్చు.
* ఏరోబిక్ ఎక్సెర్‌సైజ్
నొప్పిని తగ్గించడానికి, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వ్యక్తుల శారీరక పనితీరు, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఏరోబిక్ ఎక్సెర్‌సైజ్(కండరాల-బలపరిచే వ్యాయామాలతో పాటు లేదా లేకుండా) షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ సూచించవచ్చు.
* హైడ్రోకినిసిథెరపి
దీన్ని మోకాలి కీళ్ల వాపు, నొప్పులు ఉన్న రోగులకు ఉపయోగించవచ్చు.
* బాల్నోథెరపీ
మోకాలి వాపు, నొప్పి ఉన్న రోగులలో నొప్పి ఉపశమనం, కీళ్ల పనితీరు పరంగా బాల్నోథెరపీ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ విధానాన్ని అనుసరించవచ్చు. షార్మాలాజికల్ ట్రీట్‌మెంట్ కోసం కోమోర్బిడిటీలు లేదా వ్యతిరేకత ఉన్న రోగులకు ఇది అన్నింటికంటే ఎక్కువగా సూచిస్తారు.
* ఆక్యుపంక్చర్
ప్రస్తుతం ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగుల నిర్వహణలో ఆక్యుపంక్చర్ వాడకంపై చాలా తక్కువ విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయి.
* పటేల్లార్ టేపింగ్
కీళ్లవాపుతో బాధపడుతున్న రోగుల నిర్వహణలో పాటెల్లార్ ట్యాపింగ్ వాడకంగా కూడా తక్కువగా ఉంది.
* ఇంట్రా-ఆర్టిక్యులర్ ఇంజెక్షన్లు
- హైలురోనిక్ యాసిడ్
- కార్టికోస్టెరాయిడ్స్
- ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా
* మృదులాస్థిపై ప్రభావం తగ్గించడానికి మందులు
గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్ ఉపయోగిస్తారు.
* ఫార్మాలాజికల్ ట్రీట్‌మెంట్
ఓరల్ నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్
ఓపియాయిడ్స్
పారాసెటమాల్
టోపికల్ ప్రిపరేషన్స్
* మెకానికల్ ఎయిడ్స్
వాకింగ్ ఎయిడ్స్ (వాకింగ్ స్టిక్స్, క్రచెస్, వాకింగ్ ఫ్రేమ్‌లు మొదలైనవి)
బ్రేసెస్
ఫుట్ ఆర్థోసెస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Health Tips, Knee pain