World Sleep Day: కరోనా ఎఫెక్ట్.. ఫుల్లుగా నిద్రపోయారు సరే.. 80 శాతం మందికి ఆ సమస్య కూడా పెరుగుతోందట..!

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ లంగర్ హౌజ్ ప్రాంతంలో నివసిస్తున్న హసీబ్ (38) హస్రత్‌లకు గత ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా వారికి రెండు సంవత్సరాల ఇస్మాయిల్ తోపాటు 8 నెలల రెహాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు.(ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ సమయంలో దేశ ప్రజలు నిద్ర సంబంధ సమస్యల బారిన పడ్డారని తాజా సర్వే చెబుతోంది. వరల్డ్ స్లీప్ డే 2021 సందర్భంగా రాయల్ ఫిలిప్స్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఫిలిప్స్ గ్లోబల్ స్లీప్ సర్వే 2021 అనే పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో..

  • Share this:
కరోనా తరువాత ప్రజల జీవన శైలి ఎంతగానో మారిపోయింది. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక చాలామంది ఇబ్బందులు పడ్డారు. పనులు లేకపోవడంతో ఇతర వ్యాపకాలకు సమయం కేటాయించారు. కోవిడ్ సమయంలో దేశ ప్రజలు నిద్ర సంబంధ సమస్యల బారిన పడ్డారని తాజా సర్వే చెబుతోంది. వరల్డ్ స్లీప్ డే 2021 సందర్భంగా రాయల్ ఫిలిప్స్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఫిలిప్స్ గ్లోబల్ స్లీప్ సర్వే 2021 అనే పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని సర్వేలో పాల్గొన్న 37 శాతం మంది చెప్పారు. 27 శాతం మంది మాత్రం బాగా నిద్రపోయామని చెప్పారు. రాత్రి వేళల్లో నిద్ర లేచేవాళ్లమని 39 శాతం మంది చెప్పారు.

కరోనా వ్యాప్తి పెరిగినప్పుడు కూడా నిద్ర విషయంలో సంతృప్తి చెందామని 67 శాతం మంది చెప్పగా.. 25 శాతం మంది మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేశారు. మహమ్మారి సమయ౦లో నిద్రకు కేటాయించే సమయం పెరిగిందని 54 శాత౦ మ౦ది చెప్పడం విశేషం. 18 నుంచి 34 ఏళ్ల వయసు ఉన్నవారిలో 61 శాతం మంది ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. 50-64 ఏళ్ల వయసు ఉన్నవారిలో 41 శాతం మంది... 65, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో 35 శాతం మంది తాము నిద్రపోయే సమయం పెరిగిందని చెప్పారు.

ఆ సమస్యే కారణమా?
నిద్ర సంబంధ సమస్య స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస తీసుకోలేకపోవడం) ప్రభావాన్ని కూడా సర్వేలో విశ్లేషించారు. తమకు పగటి పూట మగతగా అనిపిస్తుందని స్లీప్ అప్నియాతో బాధపడుతున్న వారిలో 80 శాతం మంది చెప్పారు. ఈ సమస్య లేని 52 శాతం మందికి కూడా ఇలాంటి అనుభూతి ఎదురైందని నివేదిక వెల్లడించింది. కరోనా సమయంలో ప్రతి ఐదుగురు భారతీయుల్లో ఒకరు స్లీప్ అప్నియాను అనుభూతి చెందారని సర్వే పేర్కొంది. నిద్ర సంబంధ సమస్యలను పరిష్కరించడానికి టెలీ హెల్త్ సేవలను, ఆన్ లైన్ వైద్య సేవలను వినియోగించుకున్నామని 60 శాతం మంది చెప్పారు.

అవగాహన అవసరం
నిద్రపై ప్రజలకు అవగాహన కల్పించడం, నిద్ర సంబంధ సమస్యలను నిర్ధారించడం, వాటికి సరైన చికిత్స అందించడం.. వంటివి భారతీయుల్లో స్లీప్ హెల్త్‌ను మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి సమయంలో హెల్త్ కేర్ వర్కర్లు, డాక్టర్లు అందించిన సేవలు ప్రశంసనీయమని రాయల్ ఫిలిప్స్ సంస్థ భారత విభాగం ప్రతినిధి చితిజ్ కుమార్ చెప్పారు. ‘కోవిడ్-19 వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. లాక్‌డౌన్ సమయంలో నిద్ర సంబంధ సమస్యల పరిష్కారానికి టెలీహెల్త్ వంటి డిజిటల్ టెక్నాలజీ వాడటం మంచి విషయం. దేశంలో ప్రజల నిద్ర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇలాంటి చర్యలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అని చితిజ్ వివరించారు.
Published by:Krishna Adithya
First published: