డయాబెటిస్‌పై విటమిన్ ‘ఢీ’.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు..

Health Benefits: విటమిన్ ‘డీ’తో మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చని, రోగ పురోగతిని అది అడ్డుకుంటుందని వెల్లడించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 29, 2019, 11:12 AM IST
డయాబెటిస్‌పై విటమిన్ ‘ఢీ’.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 29, 2019, 11:12 AM IST
డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల బాధలు వర్ణణాతీతం. ఏది తినాలన్నా నోరు కట్టేసుకోవాల్సిందే. తీపి పదార్థాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఇష్టాన్ని ఎందుకు కట్టేసుకోవాలని లాగించేస్తే ఆపసోపాలు పడాల్సిందే. మధుమేహాన్ని అదుపులో ఉంచే మందులు వాడుతూనే, ఆహార నియమావళిని పాటించాలి. ఈ వ్యాధిని అదుపులో ఉంచడం ఒక్కటే సరైన మార్గం. అయితే, తాజాగా శాస్త్రవేత్తలు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఒక శుభవార్త చెప్పారు. విటమిన్ ‘డీ’తో మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చని, రోగ పురోగతిని అది అడ్డుకుంటుందని వెల్లడించారు. ఎక్కువ డోస్ ఉన్న విటమిన్ డీ సప్లిమెంట్లతో టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్ చేయవచ్చని కెనడాలోని లావల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుత చాలా మంది ప్రజల ఆహార నియమావళి అస్తవ్యస్తంగా ఉండటం వల్ల చిన్న పిల్లలకు కూడా ఈ వ్యాధి వస్తోందని, ఫలితంగా నరాలు దెబ్బతినడం, అంధత్వం, కిడ్నీ వైఫల్యం.. తదితర సమస్యలు వస్తున్నాయని వివరించారు.

ఇక, శాస్త్రవేత్తల పరిశోధనలో.. తక్కువ విటమిన్ డీ ఉన్నవారిలో మధుమేహం వచ్చే రేటు ఎక్కువగా ఉంటుందని వెల్లడైందట. కొంత మంది రోగులకు ఎక్కువ మోతాదులో విటమిన్ డీ సప్లిమెంట్లు అందజేసి, వారిని పరీక్షించగా గ్లూకోజ్ మెటబాలిజమ్ బాగా పనిచేసిందని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన పరిశోధన యురోపియన్ జర్నల్ ఎండోక్రినాలజీలో ప్రచురితం అయ్యింది.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...