షాక్: భార్యాభర్తల మధ్య తగ్గుతున్న సెక్స్.. కారణం అదే..

35-44 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు 2001లో నెలకు కనీసం నాలుగు సార్లు సెక్స్‌లో పాల్గొనగా, 2012లో ఒకేసారి పాల్గొన్నారట.

news18-telugu
Updated: May 13, 2019, 10:42 AM IST
షాక్: భార్యాభర్తల మధ్య తగ్గుతున్న సెక్స్.. కారణం అదే..
ఈ విషయంలో దక్షిణ అస్ట్రేలియాలో 28 శాతం, క్వీన్స్‌ల్యాండ్, పశ్చిమ ఆస్ట్రేలియా 27 శాతం, విక్టోరియాలో 21 శాతం శృంగారం వైపు ఆసక్తి చూపారు.
  • Share this:
భార్యభర్తల మధ్య పటిష్ఠ బంధానికి పునాది వేసేది.. సెక్స్. మానసిక ఉల్లాసానికి, శారీరక విశ్రాంతికి సెక్స్ చాలా అవసరం. స్త్రీ, పురుషుల మధ్య జరిగే ఈ సృష్టి కార్యం వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. అయితే, గత రెండు దశాబ్దాల్లో స్త్రీ, పురుషుల మధ్య శృంగార కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని తాజా అధ్యయనం షాక్ ఇచ్చింది. అందుకు కారణం తెలిస్తే మరింత షాక్‌కు గురి కావాల్సిందే. భార్యాభర్తల మధ్య సెక్స్ తగ్గడానికి వాతావరణ మార్పులో లేక మరో ఇతర పరిస్థితో కారణం కాదు. సోషల్ మీడియా వల్లే ఈ దీన పరిస్థతి వచ్చిందట. ఇంట్లో ఉన్నంత సేపు ముద్దు పెట్టుకోవడానికి కూడా భార్యాభర్తలు సమయం కేటాయించడం లేదని తాజా సర్వేలో వెల్లడైంది. ఫేస్‌బుక్ పోస్టులు చదవడం, ట్విట్టర్‌లో ట్వీట్లు చేయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టడం, వాట్సాప్‌లో స్టేటస్‌లు, కామెంట్లు చేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది. భార్యాభర్తలు బెడ్‌రూంకి వెళ్లాక ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా లోకంలో విహరిస్తున్నారని, అది స్త్రీ, పురుషుల మధ్య సెక్స్ తగ్గడానికి కారణమవుతోందని ది నేషనల్ సర్వే ఆఫ్ సెక్సువల్ ఆటిట్యూడ్స్ అండ్ లైఫ్‌స్టైల్స్ నివేదిక స్పష్టం చేసింది. 44 ఏళ్లలోపు జంటలు కేవలం వారానికి ఒక్క రోజు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటున్నారట. 35-44 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు 2001లో నెలకు కనీసం నాలుగు సార్లు సెక్స్‌లో పాల్గొనగా, 2012లో ఒకేసారి పాల్గొన్నారట. పురుషుల్లోనూ అదే పరిస్థితి ఉందట. గతంలో నెలకు నాలుగు సార్లు సెక్స్ చేయగా, ఇప్పుడు మూడు సార్ల కంటే ఎక్కువ శృంగారం చేయడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కొన్ని జంటలైతే ఏకంగా సెక్స్ చేస్తూనే సోషల్ మీడియాలో గడిపేస్తున్నారని తెలిపారు. టెక్నాలజీ పెరిగాక, స్మార్ట్‌ఫోన్లు మన జీవితాలను ఆక్రమించాక సుఖం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థతి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భార్యాభర్తల మధ్య బంధం చెడిపోతుందని హెచ్చరించారు. అమెరికాలో 1991లో 62 సార్లు శృంగారం పాల్గొనగా, అది 2017కు 54 సార్లకు చేరిందని వెల్లడించారు. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. సెక్స్ చేయాలనుకునేవారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటోదట. జంటలు కాకుండా వ్యక్తిగతంగా పరిశీలిస్తే.. సెక్స్ ఎక్కువగా కావాలని కోరుకునే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోందని నిపుణులు పేర్కొన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 13, 2019, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading