లవ్ విత్ సెక్స్.. ప్రేమ, అనురాగంతో మరింత ఆనందంగా శృంగారం..

అన్నింటి కన్నా ముఖ్యంగా లవ్ మేకింగ్‌లో, శృంగారం చేయడంలో చాలా వ్యత్యాసం ఉందట. ఒక వ్యక్తితో సెక్స్ చేస్తే ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు కాదట. అదే ప్రేమలో ఉన్న వ్యక్తితో సెక్స్ చేస్తే లభించే సంతృప్తి వేల రెట్లు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.

news18-telugu
Updated: August 14, 2019, 8:09 PM IST
లవ్ విత్ సెక్స్.. ప్రేమ, అనురాగంతో మరింత ఆనందంగా శృంగారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శృంగారం అనేది ఒక కళ.. స్త్రీ, పురుషుల మధ్య అన్యోన్య బంధానికి ప్రతిరూపం.. మానసిక ఉల్లాసానికి, శారీరక విశ్రాంతికి సెక్స్ చాలా అవసరం. స్త్రీ, పురుషుల మధ్య జరిగే ఈ సృష్టి కార్యం వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. అయితే, శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి? తృప్తి, సంతృప్తి, భావప్రాప్తి ఎలా పొందాలి? తదితర కీలక అంశాలు కచ్చితంగా తెలుసుకోవాలని అంటున్నారు సెక్సాలజిస్టులు. ఇరువురు పంచుకొనే ప్రేమ, ఒకరిపై మరొకరు చూపించే ఆప్యాయత, అనురాగం కీలకమని చెబుతున్నారు. శరీరంలోని అన్ని నాడులు స్పందిస్తూ భాగస్వామి నాడులను ప్రతిస్పందించేలా చేయడం అన్నింటి కన్నా ముఖ్యమని, శృంగార రసాన్ని జుర్రు కోవడం తెలిస్తే అంతకన్నా ఆనందం మరోటి ఉండదని సూచిస్తున్నారు. అన్నింటి కన్నా ముఖ్యంగా లవ్ మేకింగ్‌లో, శృంగారం చేయడంలో చాలా వ్యత్యాసం ఉందట. ఒక వ్యక్తితో సెక్స్ చేస్తే ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు కాదట. అదే ప్రేమలో ఉన్న వ్యక్తితో సెక్స్ చేస్తే లభించే సంతృప్తి వేల రెట్లు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.

భాగస్వామితో సెక్స్ సంబంధం కొనసాగిస్తే ప్రేమను పంచాలని, వారి ప్రేమను స్వీకరించాలని సెక్స్ రిసెర్చర్ ఆల్ఫ్రెడ్ కిన్సే తెలిపారు. ఒత్తిడి, రిలేషన్‌షిప్ సమస్యలను దూరం చేసేందుకు, వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ కోసం ప్రేమతో కూడిన శృంగారం కీలకమని ఆయన వెల్లడించారు. అపరిచితులతో చేసే సెక్స్.. భావప్రాప్తిని మాత్రమే అందజేస్తుందని, ప్రేమలో ఉన్న వ్యక్తితో చేస్తే ఆనందానికి అవధులే ఉండవని వివరించారు. ఆ సమయంలో భాగస్వామి చెప్పే ‘లవ్ యూ’ పదం మరింత ఆనందాన్ని కలిగిస్తుందని, ఇరువురి బాండింగ్ మరింత బలపడుతుందని వెల్లడించారు. అపరిచిత వ్యక్తులతో చేస్తే అలాంటి కమ్యూనికేషన్ ఏర్పడదని పేర్కొన్నారు.

సెక్స్ చేసే సమయంలో భాగస్వామికి సుఖాన్ని కలిగించే పదాలు, టచ్‌లు, ముద్దులు, లవ్ బైట్స్ లవ్‌ మేకింగ్‌లో భాగమేనని కిన్సే తెలిపారు. వాటి వల్ల కాన్ఫిడెన్స్ పెరిగి, కొత్త శక్తిని, ఉత్తేజాన్ని కలిగిస్తాయని, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుందని వివరించారు. ఏవైనా చికాకులు ఉన్నా వాటిని ‘లవ్ విత్ సెక్స్’ పటాపంచలు చేస్తుందని పేర్కొన్నారు.
First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading