శృంగార సమయంలో మహిళలు అలా ఎందుకు చేస్తారంటే..

పడకగదిలోకి వెళ్లింది మొదలు.. సంభోగం ప్రారంభమయ్యే వరకు ప్రతి క్షణాన్ని ఎంతో ఆత్రుతతో, ఉద్వేగంతో, ఉత్సాహంతో అనుభవిస్తారు.

news18-telugu
Updated: June 28, 2019, 11:00 PM IST
శృంగార సమయంలో మహిళలు అలా ఎందుకు చేస్తారంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శృంగారం అనేది స్త్రీ, పురుషుల మధ్య అన్యోన్యతను పటిష్ఠం చేస్తుంది.. ఆనందాన్ని పెంచుతుంది.. ఆరోగ్యాన్ని పంచుతుంది.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అద్భుతమైన మార్గం ఇది. ఫోర్‌ప్లే నుంచి రతి క్రీడ వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తే జీవితంలో మరిచిపోలేని మధురానుభూతులు మిగిలిపోతాయి. పడకగదిలోకి వెళ్లింది మొదలు.. సంభోగం ప్రారంభమయ్యే వరకు ప్రతి క్షణాన్ని ఎంతో ఆత్రుతతో, ఉద్వేగంతో, ఉత్సాహంతో అనుభవిస్తారు. అయితే, కొందరు మహిళలు సంభోగ సమయంలో ఏడుస్తారు. ఆ ప్రక్రియ ఆనందాన్ని కలిగించినా ఏడుపు ఆపుకోలేరు. అలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణాలేంటి? అని ఓ వైద్య బృందం పరిశోధనలు చేపట్టగా.. ఇలా ఏడవడం సాధారణమేనని తేలింది. ‘మనం ఊహించిన దానికన్నా ఇది అతి సాధారణమే’ అని ఇమ్లీ మోర్స్ అనే వైద్యురాలు తెలిపారు. దీన్ని ‘క్రైగాజం’ అని అంటారని వెల్లడించారు.

ఎందుకు ఇలా అవుతోందంటే..

1. అనుకున్న దానికంటే సెక్స్ ఎక్కువ ఆనందాన్ని కలిగించడం.. ఫీలింగ్స్ ఎక్కువగా ఉండటం.. అధికమైన ప్రేమ, ఇష్టపడి బందీ అయిపోవడం మూలంగా, ఆక్సిటోసిన్ అత్యాతురత వల్ల ఇలా కలుగుతుందని నిపుణులు తేల్చారు.
2. గతంలో ఎప్పుడైనా ప్రతికూల సెక్స్ అనుభవమైతే మెదడులో, శరీరంలో ఆ జ్ఞాపకాలు రగిలి రోదించే అవకాశాలున్నాయట.
3. భాగస్వామి పట్ల కోపం, బెంగ ఉన్నా సెక్స్ చేసే సమయంలో కన్నీళ్లు వస్తాయని వివరిచారు.
4. ఇక, అన్నింటి కంటే ముఖ్యంగా శారీరక హింస వల్ల ఏడుస్తారని, సంభోగ సమయంలో యోగి భాగం పొడిబారినట్లు ఉన్నా, మంటగా ఉన్నా ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఒకటి, రెండు సందర్భాల్లో ఏడిస్తే పెద్ద సమస్యేమీ కాదని, కానీ, సెక్స్ చేసే ప్రతీ సారి ఏడిస్తే సదరు మహిళ భాగోద్వేగానికి సంబంధించినదై ఉంటుందని, దాన్ని సున్నితంగా డీల్ చేయాలని తెలిపారు. అదే, ఇష్టమైన ఏడుపైతే భాగస్వామికి ముందే చెప్పాలని, బాధతోనో, నొప్పితోనో ఏడవటం లేదని అర్థమయ్యేలా చెబితేనే మంచిదని, ఇలాంటప్పుడు ఎలాంటి మొహమాటానికి పోకూడదని సూచిస్తున్నారు.
First published: June 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading