బట్ట తలతో బాధపడుతున్నారా.. ఇది మీకు గొప్ప శుభవార్తే..

నమూనా చిత్రం

Hair Regrowth Treatment: జుట్టు రాలిపోయినా సరే.. మళ్లీ మొలిపించే సరికొత్త ఇంజక్షన్‌ను తయారు చేశామని వెల్లడించారు దేబబ్రత ఆరో ఫౌండేషన్‌ పరిశోధకులు.

  • Share this:
బట్ట తల, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీకోసం గొప్ప శుభవార్త చెప్పారు శాస్త్రవేత్తలు. జుట్టు రాలిపోయినా సరే.. మళ్లీ మొలిపించే సరికొత్త ఇంజక్షన్‌ను తయారు చేశామని వెల్లడించారు దేబబ్రత ఆరో ఫౌండేషన్‌ పరిశోధకులు. జుట్టు మళ్లీ పెరగడంలో కీలకపాత్ర పోషించే వివిధ అంశాలపై పరిశోధనలు చేసి.. సరికొత్త ఇంజక్షన్‌ను అభివృద్ధి చేశామని సంస్థ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ కాస్మెటిక్‌ సర్జన్‌ డేబ్‌రాజ్‌ షోమ్‌ వెల్లడించారు. హార్మోన్ల మార్పు వల్ల బట్ట తల రావడం, జుట్టు రాలిపోవడం లాంటివి జరుగుతుంటాయని, అందుకే తాము జన్యువులపై దృష్టి సారించామని వివరించారు. తాము 2007లో ఒక ఎలుకకు కీమోథెరపీ డ్రగ్స్‌ను ఇంజెక్ట్ చేయగా వాటి జట్టు రాలిపోయిందని.. దానికి విరుగుడుగా తాము కొన్ని రసాయన ఫార్ములాలను కనుగొన్నామని తెలిపారు.

ఆ ఫార్ములేషన్‌కు ‘క్యూఆర్‌ 678’ అని నామకరం చేశామని, దీనికి సంబంధించిన అన్ని పరీక్షలను పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పటికే వెయ్యి మందిపై ఈ ఇంజక్షన్‌ను పరీక్షించి విజయం సాధించామన్నారు. ఈ ఫార్ములేషన్‌లో ఉన్నవన్నీ సహజ ఉత్ర్పేరకాలేనని, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని చెప్పారు. ఈ ఇంజక్షన్‌ను మూడు వారాలకొకసారి చొప్పున మొత్తం ఎనిమిదిసార్లు మాడుపై చేయించుకోవాలని తెలిపారు. ఒక్కో ఇంజక్షన్‌ ధర రూ.6 వేలు ఉంటుందని, మొత్తం చికిత్సకు రూ. 48 వేలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2017లోనే అమెరికా పేటెంట్ తీసుకున్నామని.. ఈ ఏడాది ఇండియా పేటెంట్, ఎఫ్‌డీఏ అనుమతి పొందామని తెలిపారు.

ఇప్పటికే తాము అందించిన చికిత్సతో 10వేల మంది వరకు లబ్ధి పొందారని, త్వరలోనే చెన్నైలో ‘ఏథ్తెటిక్ క్లినిక్’ పేరుతో కొత్త బ్రాంచీ ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. తమ బ్రాంచీలు ఇప్పటికే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో ఉన్నాయని తెలిపారు.
Published by:Shravan Kumar Bommakanti
First published: