HEALTH NATIONAL YOUTH DAY 2022 DATE HISTORY AND WHY IS RASHTRIYA YUVA DIWAS CELEBRATED ON SWAMI VIVEKANANDA BIRTH ANNIVERSARY GH VB
National Youth Day:స్వామి వివేకానంద జయంతిని ఎందుకు ‘జాతీయ యువజన దినోత్సవం’గా నిర్వహిస్తారో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
మహోన్నత తత్వవేత్త, మేధావి అయిన స్వామి వివేకానంద(Swami Vivekananda) జయంతి నేడు. స్వామి గౌరవార్థం ఆయన జన్మించిన తేదీ అయిన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించాలని 1985లో భారత ప్రభుత్వం(Indian Government) ప్రకటించింది.
మహోన్నత తత్వవేత్త, మేధావి అయిన స్వామి వివేకానంద(Swami Vivekananda) జయంతి నేడు. స్వామి గౌరవార్థం ఆయన జన్మించిన తేదీ అయిన జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించాలని 1985లో భారత ప్రభుత్వం(Indian Government) ప్రకటించింది. ‘ప్రకృతిని జయించేందుకు మనిషి పుట్టాడు తప్ప దాన్ని అనుసరించడానికి కాదు’ అని చెప్పిన గొప్ప తత్వవేత్త స్వామి వివేకానంద. ఈ మాటలు ఎటువంటి భయం లేకుండా సమస్యలు(Problems) అధిగమించాలని భావించే ప్రతి వ్యక్తి చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. స్వామి వివేకానంద జీవితం, ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేశాయి. 1985 నుంచి భారతదేశ వ్యాప్తంగా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తున్నారు.
జనవరి 12, 1863లో పశ్చిమ బెంగాల్లోని(West Bengal) కోల్కతా నగరంలో నరేంద్రనాథ్ దత్తాగా స్వామి వివేకానంద జన్మించారు. చిన్ననాటి నుంచే ఆయన ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపారు. చాలా చిన్న వయస్సులోనే ఆయనే ధ్యానాన్ని అభ్యసించారు. కొన్నాళ్ల పాటు ఆయన బ్రహ్మ సమాజ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. గొప్ప దేశభక్తుల్లో ఒకరిగా నిలిచి, భారతీయ వేదాంతాలు, యోగా శాస్త్రాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు.
Image Credit : Shutters stock
తన తండ్రి రామకృష్ణ మరణంతో కుంగిపోయినప్పటికీ భారతదేశంలోని ప్రతి భాగాన్ని తెలుసుకునేందుకు, అన్వేషించేందుకు సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టారు వివేకానంద స్వామీజీ. నిజమైన కర్మయోగి అయిన స్వామికి దేశ యువతపై అపార విశ్వాసం ఉండేది. తమ కఠిన శ్రమ, అంకితభావం, ఆధ్యాత్మిక శక్తితో భారతదేశ తలరాతను మార్చే శక్తి యువతకు ఉందని ఆయన బలంగా నమ్మారు. పిడుగులో ఉండే శక్తిమంతమైన పదార్థంలాంటిది మనస్సుల్లో కలిగిన ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినవారు కావాలని ఆయన యువతకు సందేశమిచ్చారు. ఈ తరహా సందేశాల ద్వారా ఆయన యువతకు ప్రాథమిక విలువలు నేర్పాలని భావించారు.
ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తిత్వం
సదా ఆత్మవిశ్వాస ధోరణి కలిగి ఉండేలా ఆయన యువతలో స్ఫూర్తి నింపారు. తమపై తమకు విశ్వాసం లేకపోతే జీవితంలో తలెత్తే సవాళ్లను చూసి జనం ఎప్పుడూ భయపడతారని ఆయన అనేవారు.
ఆశాజనక ధోరణి
మనల్ని ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా బలహీనపరిచే దేనినైనా విషతుల్యంగా భావించి తిరస్కరించాలని స్వామి వివేకానంద నమ్మేవారు. యోగా, ధ్యానం ద్వారా బలహీనమైన ఆలోచనల స్థానంలో ఆశావాదాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.