Fitness : సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నారా... తప్పనిసరిగా ఇది చదవండి

సిక్స్ ప్యాక్ బాడీ కసరత్తులు చేసేముందు డాక్టర్ల సలహా తీసుకోవడం తప్పనిసరి

Krishna Kumar N | news18
Updated: August 17, 2019, 1:08 PM IST
Fitness : సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నారా... తప్పనిసరిగా ఇది చదవండి
Varun dhawan
Krishna Kumar N | news18
Updated: August 17, 2019, 1:08 PM IST
అమ్మాయిలకు అందంగా, ఆకర్షనీయంగా కనిపించడం అంటే ఎంత ఇష్టమో... నేటితరం యువకుల్లో ‘సిక్స్ ప్యాక్’ బాడీలో కనిపించాలనే తాపత్రయమూ అదే స్థాయిలో ఉంది. హాలీవుడ్ నుంచి, బాలీవుడ్, టాలీవుడ్ హీరోల పలకల శరీరాన్ని చూసి, తాము కూడా అలా కనిపించాలనే కసి పెరిగిపోతోంది కుర్రాళ్లలో. అయితే అందుకోసం వారు ఎంచుకుంటున్న మార్గాలు ఏ మాత్రం మంచివి కావని తాజాగా ఓ సర్వేలో తేలింది. ‘రాఖీ’ సినిమాలో ముద్దుగా బొద్దుగా కనిపించిన యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ ఆ తర్వాత చాలా సన్నబడ్డాడు. ‘టెంపర్’ సినిమాలో అయితే ఆరు పలకల శరీరాన్ని అందంగా ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నాడు. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కోసం భారీగా బరువుతగ్గాడు తారక్. నెల రోజుల్లో ఏకంగా 12 కిలోలు తగ్గాడు. దీని కోసం ఆయన విపరీతంగా కష్టపడ్డాడు.

ఇలా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడం కోసం, ఆకర్షణీయమైన లుక్ కోసం శరీరాన్ని కష్టపెట్టిన హీరోలు ఎంతో మంది. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. సిక్స్ ప్యాక్ శరీరం కోసం అతిగా వ్యాయామాలు చేయడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు చాలామంది మంచి శరీరం రావడం కోసం ఫుడ్ సప్లిమెంట్స్, బాడీని పెంచే మందులు వాడడం వంటివి చేస్తున్నారు. ఇది కూడా ప్రమాదమే.

అమెరికాలో దాదాపు 90 శాతం మంది కుర్రాళ్లు సిక్స్ ప్యాక్ బాడీ సాధించడం కోసం తమ డైట్ మార్చుకున్నారు. అంతేకాదు డాక్టర్ల సలహా లేకుండానే మందులు వాడేస్తున్నారు. మనదేశంలోనూ ఈ సంఖ్య తక్కువేం లేదు.

ఫుడ్ సప్లిమెంట్స్, జిమ్ వర్కవుట్స్ చేసేటప్పుడు డాక్టర్లను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించాలి. వాటి ఆధారంగా మన శరీరం ఎంత బరువు ఎత్తగలదు, ఎంత బరువు ఎత్తిత్తే ప్రయోజనకరం... బాడీని పెంచే సప్లిమెంట్స్ ఎలా వాడాలి? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. కానీ యువతలో చాలామంది దీన్ని పాటించడం లేదు.




మనదేశంలో వాడుతున్న, తాగుతున్న సప్లిమెంట్స్, షేక్స్‌లో చాలావరకూ నకిలీవేనని వాటిని తాగడం వల్ల ప్రయోజనాలు కలగకపోగా, త్వరగా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సో... సిక్స్ ప్యాక్ చేయాలనుకునేవారు వెంటనే ముందు ఓ మంచి డాక్టర్ని సంప్రదించండి.
First published: August 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...