హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Menstrual cups: శానిటరీ ప్యాడ్స్‌, టాంపాన్లతో పోలిస్తే మెన్‌స్ట్రువల్ కప్స్ మంచివి.. వీటి వాడకంపై నిపుణుల సూచనలు..

Menstrual cups: శానిటరీ ప్యాడ్స్‌, టాంపాన్లతో పోలిస్తే మెన్‌స్ట్రువల్ కప్స్ మంచివి.. వీటి వాడకంపై నిపుణుల సూచనలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెన్‌స్ట్రువల్‌ కప్ అనేది పీరియడ్స్ సమయంలో ఉపయోగించే ఒక పరికరం. దీనిని థర్మోప్లాస్టిక్ ఐసోమర్, సిలికాన్ లేదా రబ్బరు పాల (Latex) వంటి పదార్థంతో తయారు చేస్తారు. అందువల్ల దీనిని ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Menstrual cups: నెలసరి (Periods) సమయంలో ఆడవారికి రక్తస్రావం జరగడం సహజమే. శానిటరీ న్యాప్‌కిన్స్ వాడటం ద్వారా ఈ సమస్య నుంచి మహిళలు ఉపశమనం పొందుతారు. అయితే న్యాప్‌కిన్స్ వాడుతున్నప్పుడు వారికి ఒక్కోసారి రక్తం లీకయ్యే సమస్యలు ఎదురవుతుంటాయి. దీనివల్ల వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి లీకేజీ సమస్యలకు మెన్‌స్ట్రువల్‌ కప్స్‌ (Menstrual cups) చెక్ పెడతాయని నిపుణులు అంటున్నారు.

మెన్‌స్ట్రువల్‌ కప్ అనేది పీరియడ్స్ సమయంలో ఉపయోగించే ఒక పరికరం. దీనిని థర్మోప్లాస్టిక్ ఐసోమర్, సిలికాన్ లేదా రబ్బరు పాల (Latex) వంటి పదార్థంతో తయారు చేస్తారు. అందువల్ల దీనిని ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు, వీటివల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు.

డాక్టర్ తేజి

* ఎలా ఉపయోగించాలి?

మెన్‌స్ట్రువల్‌ కప్ ఒక గంట ఆకారంలో ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఇది ఒక గంట, దానికి అటాచ్ చేసిన ఒక పుల్లలాగా కనిపిస్తుంది. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు గర్భాశయం నుంచి బయటకు వచ్చే రక్తం, ఇతర ద్రవాలను సేకరించేందుకు మెన్‌స్ట్రువల్‌ కప్‌ను యోనిలో అమర్చుకోవాలి. ఆ కప్ గర్భాశయం కింద ఉంటూ, ఆ స్థానంలో ఉండటానికి కాస్త స్పేస్‌ను సృష్టిస్తుంది. ఇబ్బందిగా అనిపించినప్పుడు దీనిని మడిచి లూబ్రికెంట్ రాసి వెజైనాలో పెట్టుకోవాలి. గంట షేప్‌లో ఉన్న ఈ కప్పును లోపలికి పెట్టుకునే ముందు పుల్లలా కనిపించే భాగాన్ని కాస్త బయటకు ఉండేలా చూసుకోవాలి. ఈ పుల్లలాంటి భాగంతోనే కప్పును అమర్చుకోవడం, బయటికి తీయడం సాధ్యమవుతుంది.

* శానిటరీ ప్యాడ్స్‌ లేదా టాంపాన్లను ఎందుకు ఉపయోగించకూడదు?

శానిటరీ ప్యాడ్స్‌, టాంపాన్లు చెక్క గుజ్జు, పాలిమర్లు, సువాసనల వంటి పదార్థాలతో తయారవుతాయి. నెలసరి సమయంలో రక్తాన్ని సమర్థవంతంగా పీల్చుకునేలా వీటికి కెమికల్స్‌ను జోడిస్తారు. ఈ కెమికల్స్ వాడటం వల్ల ప్యాడ్ లేదా టాంపాన్‌పై పేస్ట్ లేదా జెల్లీ లాంటి పదార్థం తయారవుతుంది. అప్పుడు అక్కడ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఫలితంగా దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్, అసౌకర్యం, దద్దుర్లు, యోని ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్యాడ్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల తీవ్రమైన పెల్విక్ ఇన్‌ఫెక్షన్లు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. రకరకాల బ్యాక్టీరియా కూడా పెరిగిపోయి అనారోగ్యాలకు కారణం అవుతుంది.

మెన్‌స్ట్రువల్‌ కప్పులు పీరియడ్స్ రక్తాన్ని అసలు మార్చవు. ముఖ్యంగా వాటి సహజ ద్రవ రూపాన్ని మార్చవు. దీనివల్ల యోనికి చిన్న అసౌకర్యం కూడా కలగదు. శానిటరీ ప్యాడ్లు లేదా టాంపాన్ల మాదిరిగా కాకుండా, మెన్‌స్ట్రువల్ కప్పుల తయారీలో ఎలాంటి కృత్రిమ రసాయనాలు ఉపయోగించరు. అందుకే ఇవి మహిళలకు సేఫ్ ఆప్షన్. మెన్‌స్ట్రువల్ కప్‌లను వాడటం వల్ల ఇప్పటివరకు ఏ ఒక్క అనారోగ్య సమస్య కూడా తలెత్తలేదు.

FTD: ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా అంటే ఏంటి? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది?డాక్టర్లు చెబుతుందిదే

* మెన్‌స్ట్రువల్ కప్‌లనే ఎందుకు వాడాలి?

న్యాప్‌కిన్స్, టాంపాన్లతో పోలిస్తే మెన్‌స్ట్రువల్ కప్‌ల వల్ల చాలా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రీయూజబుల్. ఒకే మెన్‌స్ట్రువల్ కప్‌ను 10 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. పీరియడ్స్ బ్లీడింగ్‌ను బట్టి ప్రతి 4-12 గంటలకు వీటిని తీసివేయాలి. ఆ తర్వాత కడిగి, మళ్లీ అమర్చుకోవచ్చు.

ప్యాడ్‌లు, టాంపాన్లు అనేవి సింగిల్ యూజ్‌ ప్రొడక్ట్స్. వీటిని ఒక్కసారి వాడేసి పడేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఘన వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. ఈ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి సంవత్సరాలు పట్టవచ్చు. ఆ విధంగా వీటి వాడకం పర్యావరణంపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోవైపు మెన్‌స్ట్రువల్ కప్‌లు పర్యావరణహితమైనవిగా ఉంటున్నాయి. మార్కెట్‌లో అనేక రకాల, సైజుల మెన్‌స్ట్రువల్ కప్పులు అందుబాటులో ఉన్నాయి, కాబట్టి మీకు ఎలాంటివి సరిపోతాయని అనేది తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్‌తో మాట్లాడటం మంచిది.

First published:

Tags: Health, Lifestyle

ఉత్తమ కథలు