మగాళ్లలో కుంగుబాటు అనేది చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. ఆడవాళ్లు, మగవాళ్లనే తేడా లేకుండా అందరూ ఏదో ఒక సమయంలో కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉంది. దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్, క్యాంపెయిన్ అగైనెస్ట్ లివింగ్ మిసరబ్లీ ( CALM) సంస్థలు. మగవాళ్లలో మానసిక ఆరోగ్యం, కుంగుబాటుకు సంబంధించిన సమస్యలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇందులో పురుషులు తమ శరీరంతో గురించి పడుతున్న ఇబ్బందులు, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తూ, వాటి గురించి చర్చిస్తున్నారు. CALM అనేది ఒక ఆత్మహత్యల నివారణ సంస్థ లాంటిది. మనుషుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను చెరిపేయడం దాని పని.
ఇన్స్టాగ్రామ్, CALM ఇటీవల సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు బయటికొచ్చాయి. బ్రిటన్లోని 16 నుంచి 40 ఏళ్ల వయసు గల పురుషుల్లో సగం మంది శరీర సమస్యల వల్ల తమ మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పారు. బీబీసీ పరిశోధనలో ఈ విషయం తేలింది. కరోనా మహమ్మారి సమయంలోనే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామని 58 శాతం మంది పురుషులు చెప్పారు. సుమారు రెండు వేల మంది మగవాళ్లపై ఈ సర్వేను నిర్వహించారు.
సర్వేలో పాల్గొన్నవాళ్లలో 21 శాతం మంది ఈ విషయాల్ని ఎవరితోనూ చర్చించడానికి ఇష్టపడలేదు. 26 శాతం మంది మాత్రమే తమ శరీరం ఉన్న విధానం పట్ల సంతోషంగా ఉన్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్, CALM కలసి ‘కామ్ బాడీ టాక్స్’ పేరుతో కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసింది. ఇందులో పురుషుల శరీర సమస్యలు, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు, సానుకూల దృక్పథం పెంచేలా చూస్తున్నారు. జేమీ లేంగ్, లియాన్ మెక్కెంజీ, రసెల్ కేన్, స్టీవ్ బ్లేన్ లాంటి బాడీ ఇమేజ్ క్యాంపెయినర్స్ ఈ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.
ఇంటర్వ్యూల్లో భాగంగా క్యాంపెయినర్స్ తమ జీవితంలో జరిగిన విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. 20 ఏళ్ల వయసులో బరువు ఎక్కువగా ఉండటం వల్ల తనను తాను ద్వేషించుకునేవాడిని అని బ్లేన్ చెప్పారు. మరోవైపు లేంగ్ మాట్లాడుతూ బరువు పెరగడం, జట్టు రాలిపోవడం లాంటి సమస్యలతో బాధపడినట్లు చెప్పాడు. గత కొన్నేళ్లుగా మహిళలు బాడీ ఛేంజస్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పురుషుల వంతు వచ్చింది అని లేంగ్ అన్నారు. ఇన్స్టాగ్రామ్, CALM నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందని ఇన్స్టాగ్రామ్ సీఈవో సైమన్ గన్నింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.