హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Holi Festival: హోలీకి ముందు 8 రోజుల పాటు శుభకార్యాలు ఎందుకు నిర్వహించరు..? అశుభంగా ఎందుకు పరిగణిస్తారు..? తెలుసుకోండి.. 

Holi Festival: హోలీకి ముందు 8 రోజుల పాటు శుభకార్యాలు ఎందుకు నిర్వహించరు..? అశుభంగా ఎందుకు పరిగణిస్తారు..? తెలుసుకోండి.. 

సిటీ (Hyderabad)లో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు. ఈ ఆంక్షలు నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో అమలులోకి రానున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)

సిటీ (Hyderabad)లో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదని పేర్కొన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు. ఈ ఆంక్షలు నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో అమలులోకి రానున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)

భారతీయ సంప్రదాయ పండుగల్లో హోలీ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో రంగులు నింపే పండుగా హోలీని అభివర్ణిస్తారు. ఈ రంగుల పండుగకి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

భారతీయ సంప్రదాయ పండుగల్లో హోలీ పండుగకు(Holi Festival) అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో రంగులు నింపే పండుగా హోలీని(Holi) అభివర్ణిస్తారు. ఈ రంగుల పండుగకి ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. హోలీని ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. చైత్ర మాసం రెండవ రోజు(Second Day) హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం హోలికా దహన్ మార్చి 17న ధులెండి మార్చి 18, 2022న వస్తుంది. హోలీకి 8 రోజుల ముందు హోలాష్టక్ జరుగుతుంది. ఇది మార్చి 10 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి నుండి ప్రారంభమవుతుంది. మార్చి 10, 2022 నుండి మార్చి 17, 2022 మధ్య హోలాష్టక్​ వ్యవధిలో ఎటువంటి వేడుకలు జరుపుకోరాదని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే, హోలాష్టక్ రోజుల్లో, వాతావరణంలో ప్రతికూల ప్రభావం ఉంటుంది. అన్ని గ్రహాల ప్రభావం ప్రతికూలంగా మారుతుంది.

Safety Apps for Women: మహిళలకు అండగా నిలిచే బెస్ట్ సేఫ్టీ యాప్స్‌.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..


అటువంటి పరిస్థితిలో, అష్టమి తిథిలో చంద్రుడు, నవమిలో సూర్యుడు, దశమిలో శని, ఏకాదశిలో శుక్రుడు, ద్వాదశిలో గురువు, త్రయోదశిలో బుధుడు, చతుర్దశిలో కుజుడు, పౌర్ణమిలో రాహువు చాలా ప్రతికూలంగా ఉంటారు. ఇది వ్యక్తి ఆలోచనా సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో ఏదైనా శుభ కార్యం జరిగినా గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల వారికి చెడు జరిగే అవకాశం ఉంది. వారు ఏ పని చేపట్టినా ఫలితం లభించకపోవచ్చు.

ఈ పరిస్థితుల ప్రభావాల నుండి తనను తాను రక్షించుకోవడానికి అందరూ భగవంతున్ని ప్రార్థిస్తారు. అందువల్ల, హోలాష్టక్​లో భగవంతుని నామం జపం చేయడం, పూజలు చేయడం చాలా శ్రేయస్కరం. అయితే, హోలాష్టక్‌ రోజుల్లో వేడుకలు చేసుకోవడం ఎందుకు మంచిది కాదు? అనే విషయంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

విష్ణు భక్త ప్రహ్లాదుని కథ

ఫాల్గుణ శుక్ల పక్ష అష్టమి తిథి నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బంధీగా చేసుకున్నాడు. దీని తరువాత, భక్త ప్రహ్లాదుడు పౌర్ణమి వరకు చాలా హింసకు గురయ్యాడు. భక్తుడైన ప్రహ్లాదుడు విష్ణువు అనుగ్రహంతో ప్రాణాలతో బయటపడినప్పటికీ, అప్పటి నుండి ఆ ఎనిమిది రోజుల చిత్రహింసలకు గురైనందున.. ఈ 8 రోజులు అశుభమైనవిగా పరిగణిస్తారు.

వంట నూనెల ధరలు పెరుగుతున్నాయనే టెన్షన్ వద్దు.. వాడకాన్ని ఇలా తగ్గించుకోండి

శివుడు, కామదేవ్‌లకు సంబంధించిన పురాణం

ప్రేమ దేవుడైన కామదేవుడు శివుని తపస్సుకు భంగం కలిగించాడు. దాని కారణంగా శివుడు కోపంతో కామదేవున్ని సంహరిస్తాడు. ఈ సంఘటన ఫాల్గుణ శుక్ల అష్టమి నాడు జరిగింది. అప్పుడు కామదేవుని భార్య రతి కామదేవుని తిరిగి బ్రతికించమని శివుడిని ప్రార్థిస్తుంది. శివుని అనుగ్రహం కోసం ఎనిమిది రోజుల పాటు కఠిన తపస్సు చేస్తుంది. దీంతో, శివుడు రతీ ప్రార్థనను అంగీకరించి, కామదేవుడిన్ని తిరిగి బ్రతికిస్తాడు. ప్రేమ, భౌతిక ఆనందానికి కారకుడైన కామదేవుని దహనం చేయడం వల్ల ఈ 8 రోజులు వివాహానికి, అన్ని రకాల శుభకార్యాలకు అశుభమైనవిగా పరిగణిస్తారు.

హోలాష్టక్ సమయం

హోలాష్టక్​ ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి మార్చి10 ఉదయం 2:56 సమయానికి ప్రారంభమవుతుంది. ఇది​- ఫాల్గుణ మాసం పౌర్ణమి తేదీ మార్చి 17న ముగుస్తుంది.

First published:

Tags: Hindu festivals, Holi, Holi 2022

ఉత్తమ కథలు