హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Basil Benefits: షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు తులసితో చెక్.. ఈ ఆయుర్వేద ఔషధం ఉపయోగాలు తెలుసుకోండి..

Basil Benefits: షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్‌కు తులసితో చెక్.. ఈ ఆయుర్వేద ఔషధం ఉపయోగాలు తెలుసుకోండి..

తులసి మొక్కతో జరిగే మేలు ఇదే..!

తులసి మొక్కతో జరిగే మేలు ఇదే..!

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా హిందువులు ఈ మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయుర్వేదం ప్రకారం తులసి మొక్క వైద్యానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో తులసిని ఉపయోగిస్తారు.

భారతీయ సంస్కృతిలో తులసి (Bail) మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా హిందువులు ఈ మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయుర్వేదం (Ayurveda) ప్రకారం తులసి మొక్క వైద్యానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. దీర్ఘకాలిక వ్యాధుల (Deceases) చికిత్సలో తులసిని ఉపయోగిస్తారు. దీంతో దీన్ని ‘మదర్ మెడిసిన్ ఆఫ్ నేచర్’ అని కూడా పిలుస్తారు. మధుమేహాన్ని నియంత్రించడం నుంచి మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స చేయడం వరకు తులసి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. ప్రధానంగా ఎలాంటి రోగాలకు చికిత్సలో భాగంగా తులసి ఔషధంగా వాడుతారో తెలుసుకుందాం.

కిడ్నీల్లో రాళ్లు

కిడ్నీలో స్టోన్స్ ఏర్పడితే చాలా నొప్పి ఉంటుంది. దీంతో తులసి ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. తులసి ఆకులు కిడ్నీలో ఉండే ద్రవం, మినరల్, యూరిక్ యాసిడ్ సరైన సమతుల్యతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తాగాలని లేదా ఒక చెంచా తులసి పొడిని తేనెతో కలుపుకొని రోజు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

జలుబు- దగ్గు

మీరు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే ఒక కప్పు వెచ్చని తులసి టీని తాగండి. భారీ ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులు యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తద్వారా శరీరం ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాదు. దగ్గు ద్వారా గొంతులో అంటుకునే శ్లేష్మాన్ని తొలగించేందుకు తులసి మెడిసిన్‌లా పనిచేస్తుంది.

ఇదీ చదవండి: మానవత్వం పరిమళించింది.. కుక్క కోసం ఏకమైన ఓ గ్రామం.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!


మధుమేహం

తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, సంబంధిత రుగ్మతలు, ఊబకాయం వంటి సమస్యలకు తులసి ద్వారా ఉపశమనం పొందవచ్చు. పలు అధ్యయనాల ప్రకారం.. తులసి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా తులసి ఆకుల కషాయం తీసుకోవడం వల్ల శరీరంలో ప్యాంక్రియాటిక్ బీటా-సెల్ పనితీరు మెరుగవుతుంది.

హైబీపీ

హైబీపీ అనేది చాలా సాధారణ అనారోగ్య సమస్య. గణాంకాల ప్రకారం కనీసం ప్రతి10 మందిలో ఒకరు హై బీపీతో బాధపడుతున్నారు. అయితే తులసి ఆకుల ద్వారా హైబీపీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆయుర్వేదం ప్రకారం... వేప, తులసి ఆకులను కలిపి తీసుకుంటే, వాటి క్రియాశీల సమ్మేళనాల కారణంగా బ్లెడ్ ప్రెజర్ లెవల్స్ క్రమంగా తగ్గుకుంటూ సాధారణ స్థాయికి వస్తాయి.

గుండె ఆరోగ్యానికి..

తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి మీ గుండెకు కూడా మేలు చేస్తాయి. ఈ ఆకులు రక్తంలో లిపిడ్ కంటెంట్‌ను తగ్గించడంలో ముఖ్య పాత్రను పొషిస్తాయి. ఇస్కీమియా, స్ట్రోక్‌లను నివారించడం, అలాగే హృదయ సంబంధ వ్యాధుల చికిత్స, నివారణలోనూ కీలకంగా వ్యవహరిస్తాయి. అలాగే హైపర్‌టెన్షన్‌ నుంచి ఉపశమనం పొందడానికి తులసి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి.

తులసి ఆకుల కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కషాయంతో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇది మధుమేహం నియంత్రణకు దోహదపడుతుంది. తులసి ఆకుల కషాయాన్ని రోజూ తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. గ్యాస్, అజీర్తీ, మలబద్ధకం వంటి ఉదర సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యల నుంచి కూడా త్వరగా ఉపశమనం పొందవచ్చు.

First published:

Tags: Ayurveda health tips, Health, Health benifits

ఉత్తమ కథలు