హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Magnesium Rich Foods: మెగ్నీషియం ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే.. వీటితో చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు..

Magnesium Rich Foods: మెగ్నీషియం ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే.. వీటితో చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు..

Magnesium Rich Foods: మెగ్నీషియం ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే.. వీటితో చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు

Magnesium Rich Foods: మెగ్నీషియం ఎక్కువగా లభించే ఫుడ్స్ ఇవే.. వీటితో చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు

మెగ్నీషియం మన మెదడు, శరీరానికి అవసరమైన మూలకం. బ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు ఏవో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

మీరు టైమ్‌కు(Time) తింటున్నా బలహీనంగా ఉన్నారా? మంచి లైఫ్‌స్టైల్ పాటిస్తున్నా, వీక్‌గా ఉన్నట్లు అనిపిస్తోందా..? ఆరోగ్య సమస్యలు లేకపోయినా వికారంగా అనిపిస్తోందా..? అయితే మీ శరీరంలో మెగ్నీషియం లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మెగ్నీషియం(Magnesium) సమృద్ధిగా ఉండే ఫుడ్స్‌ను తీసుకోవాలి. మెగ్నీషియం మన మెదడు, శరీరానికి అవసరమైన మూలకం. బ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషక లోపం వల్ల మూర్ఛ, కండరాల తిమ్మిరి, జలదరింపు సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యల బారిన పడకుండా ఉంటే ప్రతి ఒక్కరూ మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అవేంటో చూద్దాం.

* ఆకుకూరలు

ఆకుకూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. బచ్చలికూర, పాలకూర, తోటకూర, ఇతర ఆకుకూరల్లో మెగ్నీషియంతో పాటు ఐరన్, మాంగనీస్, ఇతర విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని మీ డైట్‌లో తీసుకుంటే అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్‌కు ఆకుకూరలు చెక్ పెడతాయి.

JRF 2022: పీజీ పూర్తి చేశారా.. అయితే రెండేళ్ల పాటు నెలకు రూ.31వేలు పొందే అవకాశం..

* అరటిపండ్లు

అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును నివారించడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాల్లో తేలింది. రక్తపోటును తగ్గించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని అరటి పండ్లు తగ్గిస్తాయి. ఇందులో పొటాషియంతో పాటు మెగ్నీషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

* గుమ్మడి గింజలు

అవిసె, చియా, గుమ్మడి గింజల్లో మెగ్నీషియంతో పాటు మరిన్ని పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్, ఫైబర్‌తో ‌పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మనకు అవసరమైన సూక్ష్మ పోషకాలు. ఇవి మన శరీరంలోని కొవ్వును కరిగించి, చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తాయి.

Indian Railway: పెరిగిన 500 రైళ్ల వేగం.. ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్‌ గా.. ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫాస్ట్‌ గా మారిన రైళ్లు..

* బాదం పప్పు

బాదం, జీడి పప్పు, ఇతర నట్స్‌లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. వీటిలో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్, ఫైబర్ రక్తంలో చక్కెర నిల్వలు, కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. వీటిని చిరుతిండిగా తీసుకోవడం మంచిది. అల్పాహారంలోనో లేదా డెజర్ట్స్‌లో భాగంగా తీసుకున్నా చక్కటి ప్రయోజనాలుంటాయి.

* డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్‌లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. మాంగనీస్, కాపర్, ఐరన్, హెల్దీగా ఉండటానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి డార్క్ చాక్లెట్లలో ఉంటాయి. వీటిలో ఉండే కొకోవా నుంచి శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు అందుతాయి. అందుకే కనీసం 70 శాతం కంటే ఎక్కువ కొకోవా కంటెంట్ ఉండే చాక్లెట్లనే, అది కూడా మితంగానే తినాలి.

Published by:Veera Babu
First published:

Tags: Almonds Health Benefits, Health alert, Health benefits

ఉత్తమ కథలు