Lungs: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా ? అయితే మీ ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉన్నట్టే.. జాగ్రత్తగా ఉండండి

ప్రతీకాత్మక చిత్రం

Lung Health: ఊపిరితిత్తుల్లో తలెత్తే సమస్యలకు సంబంధించి కనిపించే లక్షణాలను మనం చాలా సందర్భాల్లో గుర్తించలేం. అవి తీవ్రమైన తర్వాత ఆందోళనకు గురవుతుంటాం.

  • Share this:
ఆరోగ్యపరంగా మన శరీరం పంపించే చాలా సంకేతాలను మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. అవి చిన్న విషయాలేనని తేలిగ్గా తీసుకుంటాం. కాని అలాంటి వాటిని ముందే గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే చాలా సమస్యలను ముందుగానే చక్కదిద్దవచ్చు. ఊపిరితిత్తులకు సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊపిరితిత్తుల్లో తలెత్తే సమస్యలకు సంబంధించి కనిపించే లక్షణాలను మనం చాలా సందర్భాల్లో గుర్తించలేం. అవి తీవ్రమైన తర్వాత ఆందోళనకు గురవుతుంటాం. అలాంటి పరిస్థితులు రాకుండా చూసేందుకు వ్యాధులకు సంబంధించిన లక్షణాల గురించి మనం తెలుసుకుంటే మంచిది. మన శరీరమే వాటిని మనకు తెలియజేస్తుంది. అవేంటో తెలుసుకుందాం:

* తీవ్రమైన శ్లేష్మం
కఫం, శ్లేష్మం లేదా తెమడను మన వాయు మార్గాలు ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఒక వేళ ఈ తెమడ లేదా కఫం అన్నది నెల కంటే ఎక్కువ కాలం ఉంటే అది ఏదైనా ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతం.

* ఆగకుండా దగ్గు/ దగ్గినప్పుడు రక్తం రావడం
ఎనిమిది వారాలు లేదా అంత కంటే ఎక్కువ కాలం నుంచి మీరు దగ్గుతో బాధపడుతున్నట్టు అయితే అది ఊపిరితిత్తులకు సంబంధించి ఏదైనా తీవ్రమైన రుగ్మతకు సంకేతంగా భావించాలి. మన శ్వాస వ్యవస్థలో ఏదో లోపం ఉందని తెలియజేసే ముందస్తు సంకేతం అది.

* శ్వాస తీసుకోవడంలో మార్పు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ అలసిపోవడమన్నది ఊపిరితిత్తుల వ్యాధికి ఒక సంకేతం వంటిది. ఊపిరితిత్తుల్లో కణితి ఏర్పడటం లేదా వాయుమార్గం మూసుకుపోయేలా ద్రవాలు ఉండటం వంటి వాటి వలన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

* హఠాత్తుగా బరువు తగ్గడం
ఎటువంటి డైటింగ్‌ పాటించకపోయినా, ఎటువంటి వ్యాయామాలు చేపట్టకపోయినా హఠాత్తుగా బరువు తగ్గుతున్నారంటే అది ఒక ప్రమాదానికి గుర్తు. శరీరంలో ఏదో కణితి ఏర్పడుతోందని తెలియజేసే సంకేతం అది.

* ఛాతీలో నొప్పి
ఛాతీలో ఏదో తెలియని నొప్పి నెల రోజులు లేదా అంత కంటే ఎక్కువ కాలం నుంచి ఉండటం, గాలి పీల్చినప్పుడు లేదా దగ్గువచ్చినప్పుడు ఆ నొప్పి తీవ్రమవుతుందంటే దాన్ని ఒక హెచ్చరిక సంకేతంగా తీసుకోవాలి.

Weight Loss: బరువు తగ్గించుకుంటున్నారా ? లేక కొవ్వు తగ్గించుకుంటున్నారా ?.. రెండింటి మధ్య తేడా ఇదే..

Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘టీడీపీ’ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా ?


ఇలాంటి లక్షణాలను మీలో లేదా మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు, బంధువుల్లో గుర్తించినట్టు అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించండి. వాటిని తేలిగ్గా తీసుకోకండి. పరిస్థితి చేజారకుండా చూసుకోండి.
Published by:Kishore Akkaladevi
First published: