ప్రస్తుతం వాతావరణం కాలుష్యపూరితం అయిపోయింది. దీంతో దుమ్ము, ధూళి లాంటి చిన్న రేణువులు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి వ్యాధులకు కారణమవుతున్నాయి. అందులోనూ ఈ శీతాకాలంలో (Winter Season) మంచుతో కూడిన పొల్యూషన్.. డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఊపిరితిత్తుల వ్యాధులకు(Lung Disease) ఈ కాలుష్యంతో పాటు ఇతర అనారోగ్యాలు కారణమవుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో లంగ్ డిసీజెస్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ఊపిరితిత్తుల్లో ఇబ్బంది తలెత్తిందని గుర్తించడానికి ముందు కొన్ని సంకేతాలను, లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకుంటే వెంటనే చికిత్సలు(Treatment) చేయించుకోవడం ద్వారా పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. కానీ చిన్న ఇబ్బందే కదా అని అశ్రద్ధ చేస్తే అదే ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగానే ఊపిరితిత్తులు ఇచ్చే సిగ్నల్స్‌ను అర్థం చేసుకోవాలి. ఇలాంటి కొన్ని లక్షణాలను అమెరికన్ లంగ్ అసోసియేషన్ పేర్కొంది. వీటిలో ఏం కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అవేంటంటే..
* దగ్గు
చలికాలంలో సాధారణంగా దగ్గు చాలా మందికి ఉంటుంది. అయితే అది అనేక వారాల పాటు దీర్ఘకాలికంగా ఉంటే ఆలోచించాల్సిన విషయం. వేరే రకాల వ్యాధులకు అది సంకేతం కావచ్చు. ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులకు ఇది సంకేతం కావచ్చు. అందుకే సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే టెస్టులు చేయించి, జాగ్రత్తలు తీసుకోవాలి.
* గురకలాంటి శబ్దం
కొందరు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు గురక మాదిరిగా ఓ రకమైన శబ్దం వస్తుంది. ఇది సాధారణంగా ఊపిరిని బయటకు వదులుతున్నప్పుడు ఎక్కువగా వస్తుంటుంది. ఊపిరితిత్తుల్లో వాపు వల్ల ఇలా రావచ్చు. లేదా వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో వాయుమార్గాలు సంకోచించడం వల్ల కూడా రావచ్చు. COPD (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), ఉబ్బసం వ్యాధుల ప్రారంభ లక్షణం ఇది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం అయి వైద్యుల్ని సంప్రదించాలి.
* ఊపిరి ఆడకపోవడం
ఊపిరి అందకపోవడం అనేది ఏదో ఒక లంగ్ డిసీజ్ ఉందని గ్రహించడానికి సూచన. చాలా మంది వ్యక్తులు వృద్ధాప్యం, అధిక బరువు, లేదా అన్ ఫిట్‌గా ఉండటం వల్ల దీన్ని ఎదుర్కోవడం సాధారణమే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో శ్వాస ఆడకపోవడాన్ని చవి చూస్తారు. రన్నింగ్ చేయడం, వర్కవుట్ చేయడం లాంటి ఎక్సర్‌సైజ్‌లు చేసినప్పుడు శరీరానికి అదనంగా ఆక్సిజన్ అవసరం అవుతుంది. అప్పుడు ఊపిరిని ఎక్కువ తీసుకోవడానికి ఆయాసపడతారు.
Strawberry Benefits : స్ట్రాబెర్రీ బరువు తగ్గించడంతోపాటు ఎముకలను కూడా బలపరుస్తుంది!
Healthy Heart: చలికాలంలో వీక్ అయ్యే హార్ట్ హెల్త్.. ఈ జాగ్రత్తలతో సమస్యలకు చెక్..
ఎక్కువగా గాలి తీసుకోవడానికి శరీరం జరిపే ప్రతి చర్య అది. కానీ ఎలాంటి కారణం లేకుండా మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే అది మీ ఊపిరితిత్తులు సరిగా పని చేయకపోవడాన్ని సూచిస్తోందని అర్థం చేసుకోవాలి. శ్వాస ఆడకపోవడం అనేది ఆస్తమా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)కి సంకేతం. దీన్ని గుర్తించి వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benefits