Benefits Of Eggs: గుడ్లను ఆ రకంగా కూడా ఉపయోగించవచ్చు.. తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

Benefits Of Eggs:మానవ శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల ప్రోటీన్స్ గుడ్డు ద్వారా లభిస్తాయి. కాబట్టే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. గుడ్డులో వివిధ రాకాల పోషకాలు ఉంటాయి. అవి మనిషికి కావాల్సిన బలాన్ని, శక్తిని సమకూరుస్తాయి. గుడ్డు వల్ల ఉపయోగాలు.. వారానికి ఎన్ని తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

 • Share this:
  రోజూ ఓ గుడ్డు తినండి.. డాక్టర్ కు దూరంగా ఉండండి అంటూ ఉంటారు చాలామంది. డాక్లర్లు కూడా గుడ్లను ఎక్కువగా తినాలనే చెబుతుంటారు. గుడ్లంటే దాదాపు అందరికీ ఇష్టం ఉంటుంది. గుడ్డు తినే సమయంలో లోపలి భాగాన్ని తింటే కొలెక్టరాల్ వస్తుంది అంటుంటారు. కానీ అది ఎంత వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే లిమిట్ గా తింటే ఇలాంటి కొవ్వులు శరీరానికి దరి చేరదు. ఇక పచ్చసొన విషయం పక్కన పెడివతే తెల్లసొన చాలామంది తింటుంటారు.దీని ద్వరా ఎలాంటి హాని కలగదు. ఎంచక్కా దీనిని తినేయవచ్చు. గర్భిణీలకు, పిల్లలకు కూడా ఎక్కువగా గుడ్లు తినాలనే చెబుతుంటారు డాక్టర్లు. రైతులు అయితే రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిందని నిపుణులు అంటున్నారు.

  Brown Spots: ముఖంపై గోధుమ రంగు మచ్చలతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలను వాడండి..


  మరోవైపు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా గుడ్ల మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి. గుడ్లు ఆరోగ్యానికి ప్రమాదకరమని.. గుడ్లు తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ అవి అన్నీ పుకార్లు అని.. దాని వల్ల ఎలాంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక గుడ్డు అయినా తినొచ్చు ఏం కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. గుడ్డును తీసుకోవడం ద్వారా శరీరానికి పొటాషియం, నియాసిన్, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం, సోడియం వంటి ధాతువులు అందుతాయి. అంతేకాదు, విటమిన్ ఏ, పాస్పరస్, ఐరన్, జింక్, విటమిన్ డి, విటమిన్స్ బి6, విటమిన్ బి12, ఫాలిక్ యాసిడ్, థియామిన్ వంటి ధాతువులు కూడా గుడ్డు ద్వారా శరీరానికి అందుతాయి.

  Remove Lizards From Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..


  అయితే గుడ్డులో కొవ్వు పదార్థం ఉంటుంది కాబట్టి.. డైట్‌లో ఎన్ని గుడ్లను తీసుకోవాలి అన్న సందేహం ప్రతీ ఒక్కరికి కలుగుతుంది. నిపుణుల సూచన ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు లేదా వారంలో 3-4 గుడ్లు తీసుకోవడం మంచిది. అయితే గుడ్లను రీఫైన్డ్ ఫ్లోర్, హై సుగర్ ఫుడ్స్, మాంసంతో కలిపి తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలా తీసుకుంటే.. అవి ఫ్యాటీ యాసిడ్స్‌గా మారి గుండె జబ్బులు, డయాబెటీస్‌కు దారితీసే ప్రమాదం ఉంది. హై కొలెస్ట్రాల్,గుండె జబ్బులతో బాధపడేవారు వారానికి 3 గుడ్లకు మించకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  Ants Problems: ఇంట్లో చీమలతో చిరాకు వేస్తోందా.. ఈ చిట్కాలను వాడి చీమలను తరిమికొట్టేయండి..


  గుడ్డులోని పచ్చసొనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్ D, బి12, సెలీనియం ఉండటం వలన వారంలో 3 సార్లు, 2 గుడ్ల చొప్పున ఉదయం అల్పహారం లాగా తీసుకుంటే ఊబకాయం తగ్గవచ్చని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రోటీన్లు పాంక్రి యాస్ గ్రంధిని నిర్మించి, జింక్, క్రోమియం ద్వారా ఇన్స్ లిన్ కు జీవక్రియ కలుగజేస్తాయి.

  ఇన్సులిన్ అడ్డంకిని తొలిగించడానికి ఉపయోగపడే ఇ విటమిన్, దానిని మెరుగుపరచడానికి అవసరమైన మెగ్నీషియం, బయాటిన్, నియోసిన్, గుడ్డు పచ్చ సొనలో అపారంగా ఉంటాయి. అందుకే మధుమేహులు తప్పకుండా గుడ్డు తినాలి. పచ్చి గుడ్డు తినడం వలన ఎనరోగ్జియ, ఎనీమియ, డెర్మటైటిస్, హైపర్ థీషియ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలామందికి తెలియదు. దీనిని అందరూ తెలుసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
  Published by:Veera Babu
  First published: