Monsoon Pet Care: వర్షాకాలంలో పెంపుడు జంతువులకు అనారోగ్య సమస్యలు.. ఇలా చెక్​ పెట్టండి

ప్రతీకాత్మక చిత్రం

వర్షాకాలంలో పెంపుడు జంతువులు అనేక అంటువ్యాధులకు లోనవుతాయి. జలుబు, దగ్గు, న్యుమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

  • Share this:
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ కాలంలో ఎన్నో సీజనల్​ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అంతేకాదు ఇంట్లో ఈగలు, దోమలు, చీమలు, బొద్దింకలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. ఇవి పరోక్షంగా వివిధ వ్యాధులకు కారణమవుతాయి. అందుకే వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు మాత్రమే కాదు, మీ ఇంట్లో పెంచుకునే జంతువులకు కూడా కీలకం. వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి.

వర్షాకాలంలో పెంపుడు జంతువులు అనేక అంటువ్యాధులకు లోనవుతాయి. జలుబు, దగ్గు, న్యుమోనియా వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెంపుడు కుక్కలు సాధారణంగా మలాసెజియాతో బాధపడుతుంటాయి. ఇది పరోక్షంగా చర్మంపై దద్దుర్లు, కాలిన గాయాలకు కారణమవుతుంది. అయితే, పిల్లిలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురవుతాయి. అందుకే, వర్షంలో మీ పెంపుడు జంతువులను తడవకుండా చూసుకోండి. వీలైనంత పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి.

వర్షాకాలంలో పెంపుడు జంతువులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున, మీ పశువైద్యుడిని సంప్రదించండి. వార్మ్ ఇన్ఫెక్షన్ జంతువుల్లో రక్తహీనతకు దారితీస్తుంది. సాధారణ బలహీనత అనోరెక్సియా, కోటు మందబుద్ధికి దారితీస్తుంది.

వర్షాకాలంలో పెంపుడు జంతువుల ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రమైన, గోరు వెచ్చని నీటినే తాగించండి. ఎందుకంటే, మురికి నీరు తాగడం వల్ల కామెర్లు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మాంసం, చికెన్, ఆయిల్ ఫుడ్ అధికంగా ఉండటం వల్ల పెంపుడు జంతువులు అనారోగ్యం భారీన పడే అవకాశం ఉంది. అందువల్ల, అరటి వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్నే తినిపించండి.

యాంటిసెప్టిక్ షాంపూని ఉపయోగించి పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా స్నానం చేయించండి. ఇది పేలు, ఫ్లీ సమస్యను నివారించేందుకు సహాయపడుతుంది.

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ప్లాన్ మారిందా ?.. చివరి నిమిషంలో కొత్త ప్రతిపాదన

Blood Improving Food: శరీరంలో రక్తం తక్కువగా ఉందా ?.. వీటిని తింటే చాలు..

నడక కోసం పెంపుడు జంతువులను బయటకు తీసుకువెళుతున్నప్పుడు, దోమ కాటుకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే, నీరు ఎక్కువగా ఉండే తడి ప్రాంతాల్లో జంతువులను తిప్పకండి. అలాగే, గడ్డి మీద ఎక్కువగా నడిపించకండి. ఇది జంతువల్లో టిక్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది.

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. అందుకే, క్రమం తప్పకుండా జంతువులకు వస్త్రధారణ చేయించండి. అంతేకాదు, గోళ్ల క్లిప్పింగ్, రెగ్యులర్ డెంటల్ చెక్ అప్స్​కు తీసుకెళ్లండి.

వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు వస్తుంటాయి. అందుకే, కొన్ని పెంపుడు జంతువులు చలితో వణుకుతుంటాయి. అటువంటి జంతువులను వెటర్నరీ డాక్టర్​ దగ్గరకు తీసుకెళ్లండి. వెటర్నరీ డాక్టర్​ సలహాలను పాటించండి.
Published by:Kishore Akkaladevi
First published: