Home /News /life-style /

HEALTH KNOW THE FACTS ABOUT COOKING OIL THAT YOU USE DAILY AK GH

Cooking oil: వంట నూనె గురించి ఈ విషయాలు తెలుసా.. లేదంటే జబ్బులు తప్పవు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వంట నూనెల్లో అన్నింటికంటే శ్రేష్ఠమైనది ఏది? అసలు వంట నూనెలు కొనేప్పుడు కేవలం ధరలు మాత్రమే చూడాలా లేక మరి ఇతర అంశాలను కూడా పరిగణలో?

వంట నూనెల్లో అన్నింటికంటే శ్రేష్ఠమైనది ఏది? అసలు వంట నూనెలు కొనేప్పుడు కేవలం ధరలు మాత్రమే చూడాలా లేక మరి ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలా అన్నది సామాన్యులకు తరచూ వచ్చే అనుమానం. ఇది కొలెస్ట్రాల్ తక్కువ.. ఇది గుండెకు మంచిది అన్న ప్రకటనలు చూసి నూనె కొని, వండుకుని తింటే సరిపోదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అసలు నూనె అంటేనే కొవ్వు అని అర్థం. ఫ్యాట్ కు లిక్విడ్ రూపమే నూనె. కాకపోతే కొవ్వులు రూం టెంపరేచర్ ఉన్నప్పుడు అవి నూనెల్లా కనిపిస్తాయి. ఇది అర్థమైతే చాలు మిగతా విషయాలన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయి. గింజలు, చేపలు, అవకాడో, ఆలివ్స్ వంటివాటి నుంచి నూనెలు లభిస్తాయి. కొన్ని నూనెలను మనం తరచూ తీసుకోవటంతో ఆరోగ్యం వస్తుంది. వంట నూనెల్లో ఉండాల్సినవి ఏమిటి, ఎటువంటి నూనెలకు మనం దూరంగా ఉండాలన్న విషయాలు డైటీషియన్లు చక్కగా చెబుతారు. ఇక ఆరోగ్యకరమైన వంట నూనె అనడానికి అసలు నిర్వచనం అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న నూనె. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న వంట నూనెలను తింటే అనారోగ్యం పాలవుతాం. అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ లో మోనోసాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటివి గుండెకు చాలా మంచిది. ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్ లో పుష్కలంగా లభిస్తాయి. అంటే సోయా, ఆలివ్, నువ్వులు, పల్లీ వంటి నూనెల్లో అన్నమాట. సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న నూనెలకు దూరంగా ఉండమని చెప్పటానికి ప్రధాన కారణం గుండె జబ్బులకు ఇవి దారితీస్తాయి. ఉదాహరణకు వెన్న, ఫుల్ ఫ్యాట్ డైరీ ఉత్పత్తుల్లో ఇవి అధికంగా ఉంటాయి.

పొగలు కక్కరాదు..
కేవలం ఏ నూనె మంచిది అని తెలుసుకోవటంతోనే పని అయిపోదు.. అసలు ఈ నూనెలను ఎంతసేపు వేడిచేశాక ఉపయోగించవచ్చన్నది అసలు పాయింట్. నూనె విపరీతంగా పొగలు కక్కేలా మరిగిపోయాక మనం వాటిని ఉపయోగించటం అస్సలు ఆరోగ్యకరం కాదు దీనికి కారణం నూనెలోని పోషకాలు నాశనం అవుతూనే ఆ నూనె ఫ్రీ రాడికల్స్ ను విడుదల చేస్తుంది. నూనె పదార్థాలు తిన్నప్పుడు మనం అనారోగ్యం పాలవ్వడానికి మూలకారణం ఇదే. హాట్ చిప్స్ షాప్స్ లో తయారయ్యే చిరుతిండి అస్సలు మంచిది కాదని చెప్పేందుకు కూడా కారణం ఇదే.

రోజుకు ఎంత నూనె తినచ్చు?
మరి రోజుకు ఎంత నూనె తినవచ్చంటే అది మన ఆరోగ్యం, మన వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. రోజూ 3-7 టేబుల్ స్పూన్ల నూనె ఆరోగ్యానికి మంచిది. 2-3 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు రోజుకు 3 టేబుల్ స్పూన్ల నూనె తినటం ఆరోగ్యకరం. అదే 4-8 ఏళ్ల పిల్లలకు 4 టేబుల్ స్పూన్ల నూనె సరిపోతుంది. 9-13 ఏళ్ల మధ్య వయసుకున్న పిల్లలకు 5 టేబుల్ స్పూన్ల నూనె సరియైన పరిమాణం. 14-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు 5 టేబుల్ స్పూన్ల నూనె, 19-30 ఏళ్ల మధ్యవయసు వారికి 6 టేబుల్ స్పూన్ల నూనె సరిపోతుంది ఇదే వయసు పురుషులకు మాత్రం 7 టేబుల్ స్పూన్ల వరకు మంచిది. 51+ వయసున్న మహిళలు 5 టేబుల్ స్పూన్లకు మించి నూనె రోజూ తీసుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలకు, స్త్రీలతో పోల్చితే పురుషులకు ఒక టేబుల్ స్పూన్ నూనె ఎక్కువ ఉపయోగించటం మంచిదని డైటీషియన్లు వివరిస్తున్నారు. మీకు తెలుసా? అన్ సాచురేటెడ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదైనా ఈ నూనెలో ఒక టేబుల్ స్పూన్ కు కనీసం 120 క్యాలరీలుంటాయి. కాబట్టి వీటిని ఓ క్రమబద్ధంగా తినటం ముఖ్యం. హైడ్రోజనరేటెడ్ ఆయిల్స్, పామ్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, కొబ్బరి నూనెను వంట నూనెలుగా ఉపయోగించకపోవటం మంచిది.

ఆలివ్ ఆయిల్..
ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆలివ్ ఆయిల్ లో ఎక్కువ. లో-డెన్సిటీ లైపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, క్రానిక్ డిసీజెస్ ను అదుపులో ఉంచేలా ఇది పనిచేస్తుంది. ఎన్నో రకాల ఆలివ్ ఆయిల్ మార్కెట్లో ఉన్నప్పటికీ కోల్డ్ ప్రెస్డ్, 100శాతం ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నే ఎంచుకోండి. ఇది రిఫైన్డ్ కాదు, పైగా బాగా పండిన ఆలివ్స్ నుంచి ఈ నూనెను ఎక్కువ వేడి చేయకుండా, కెమికల్స్ ను ఎక్కువ ఉపయోగించకుండా తయారు చేస్తారు కనుక ఇది మంచిది. గ్రిల్లింగ్, ఫ్రైయింగ్ కు ఇది పెద్దగా పనికిరాదు కానీ సలాడ్స్ డ్రెస్సింగ్ వంటి వాటికి చక్కగా పనికివస్తుంది.

ఆవ నూనె..
దీన్ని ఇంగ్లీష్ లో కనోలా ఆయిల్ అంటారు. బ్రకోలీ, కాలీఫ్లవర్ జాతికి చెందినదే ఆవ మొక్క. హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఈ నూనె ఒక్క టేబుల్ స్పూన్ తీసుకుంటే అందులో 8 గ్రాముల మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి, లివర్ ఫ్యాట్, స్ట్రోక్ రాకుండా ఇది కాపాడుతుంది. సమోసా వంటి డీప్ ఫ్రైలు చేసేందుకు, కూరగాయలు, మాంసం వేయించేందుకు ఇది బెస్ట్ ఆయిల్.

అవకాడో నూనె..
బీపీని తగ్గించే శక్తి గల మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ లో భాగమైన ఒలేయిక్ యాసిడ్ అవకాడో నూనెలో చాలా ఎక్కువ. బుర్ర చురుగ్గా ఉండేలా, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడటంలో చక్కని పాత్ర పోషించే ఈ నూనెను కోల్డ్ ప్రెస్డ్ గానే తయారుచేస్తారు. ఏ, డీ, ఈ, కే విటమిన్లు ఇందులో అత్యధికంగా ఉంటాయి. వేపుడులు, గ్రిల్స్ చేసేందుకు ఈ నూనె బాగుంటుంది.

నువ్వుల నూనె..
మోనోసాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న నూనె నువ్వుల నూనె. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు అధికంగా ఉండటం వల్ల ఈ నూనెతో చేసిన వంటలు తింటే చాలా రోగాలు తగ్గుముఖం పడతాయి. నువ్వుల నూనెతో చేసిన వంటలు రుచిగా ఉంటాయి. ఘుమఘుమలాడుతాయి, ఫిష్, చికెన్ మారినేషన్ ఈ నూనెతో చేస్తే భలేగా ఉంటాయి, సలాడ్ల రుచిని మరింత పెంచేలా ఈ నూనె ఉంటుంది.

సోయాబీన్ ఆయిల్
మార్కెట్లో ఎక్కువగా లభిస్తున్న సోయా ఆయిల్ లో విటమిన్ కే ఎక్కువ, దీంతో ఎముకలు చాలా బలంగా మారతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. కనుక ఈ నూనెను వంటలు చేసేందుకు ఉపయోగిస్తే కొలెస్ట్రాల్ స్థాయి బాగా తగ్గుతుంది. బేకింగ్, ఫ్రైయింగ్, కూరలు చేసేందుకు ఇది బాగుంటుంది.

సన్ ఫ్లవర్ ఆయిల్
కుసుమల నుంచి తయారయ్యే ఈ నూనెలో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ, మోనోసాచురేటెడ్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ కనుక గుండెకు మంచిది. వీటిలో ఉన్న యాసిడ్లు బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, కీళ్లకు బాగా పనిచేస్తుంది. ఈ నూనెతో బార్బిక్యూలు, ఫ్రైడ్ ఐటెమ్స్ చేస్తే కమ్మగా ఉంటాయి.

ఫ్లాక్స్ సీడ్ ఆయిల్..
అవిశెల నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉంటాయి కనుక శాకాహారులకు ఇది మరింత అవసరం. కానీ ఇది సలాడ్ల డ్రెస్సింగ్ వంటి వెరైటీలకే బాగుంటుంది. స్మూతీల్లో కూడా ఈ నూనెను చేర్చుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.

వేరుశెనగ నూనె..
విటమిన్ ఈ, మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-6 యాసిడ్లు ఎక్కువగా ఉన్నది వేరుశెనగ నూనె. మంచి కంటి చూపు, ఇమ్యూనిటీ, బ్లడ్ ఫ్లో వృద్ధి చెందేందుకు ఈ నూనె సహకరిస్తుంది. గానుగ నుంచి తీసిన పల్లీ నూనె చాలా మంచిది, ఇందులో పోషకాలు చాలా ఎక్కువ. పల్లీ నూనె వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. ఫ్రైయింగ్ చేసేందుకు ఇది చాలా బాగుంటుంది కనుక అన్ని రకాల పిండి వంటలు, నిలువ పచ్చళ్లు పల్లీ నూనెతో మరింత టేస్టీగా మారతాయి.
First published:

Tags: Health, Health benefits, Mustard oil, Oil prices

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు