Home /News /life-style /

HEALTH KNOW THE DIFFERENCE BETWEEN DRY SCALP AND DANDRUFF TO STRUCTURE AN EFFECTIVE HAIRCARE APPROACH SSR GH

Dry scalp & Dandruff: మీకు చుండ్రు ఉందా? లేక తల పొడిబారిందా? తేడా ఇలా తెలుసుకొని సమస్యను తగ్గించుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అందమైన జుట్టు కోసం కూడా శ్రమపడాల్సి ఉంటుంది. చర్మం లాగే జుట్టుకు కూడా చాలా సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. జుట్టు రాలడం, తెల్లబడడం, పొడిబారడం, చుండ్రు, పేలు వంటివెన్నో జుట్టు అందంగా కనిపించకుండా చేస్తుంటాయి. ఇందులో జుట్టు పొడిబారడం, చుండ్రు రెండు దాదాపు ఒకేలా కనిపిస్తాయి.

ఇంకా చదవండి ...
మనం ఎంత అందంగా ఉన్నా.. తలపై ఉన్న జుట్టు అందంగా లేకపోతే సగం అందం పోతుంది. అందమైన తలకట్టు ముఖానికి చక్కటి కళను తెచ్చిపెడుతుంది. అందమైన మెరిసే జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందమైన జుట్టు కోసం కూడా శ్రమపడాల్సి ఉంటుంది. చర్మం లాగే జుట్టుకు కూడా చాలా సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. జుట్టు రాలడం, తెల్లబడడం, పొడిబారడం, చుండ్రు, పేలు వంటివెన్నో జుట్టు అందంగా కనిపించకుండా చేస్తుంటాయి. ఇందులో జుట్టు పొడిబారడం, చుండ్రు రెండు దాదాపు ఒకేలా కనిపిస్తాయి. అందుకే చాలామంది మాడు పొడిబారి పొట్టు లేస్తుంటే దాన్ని చుండ్రు అనుకొని యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతుంటారు. అయితే సమస్య గురించి తెలుసుకొని దానికి తగినట్లుగా చికిత్స చేయించుకుంటే అది తొందరగా తగ్గుతుంది. అందుకే పొడిబారడం, చుండ్రుకు మధ్య తేడాలు, వాటిని తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకుందాం.

కుదుళ్లు పొడిబారడం
తలలో తగినంత తేమ లేకపోవడం వల్ల జుట్టుతో పాటు కుదుళ్లు, మాడు కూడా పొడిబారిపోతాయి. తలలోని మాయిశ్చర్ తగ్గడం వల్ల జుట్టు ఎక్కువగా రాలడం తో పాటు మాడు పై ఉన్న చర్మం కూడా పొట్టులా మారి చుండ్రులా రాలుతూ ఉంటుంది. చిన్న, సన్నని, పొడిబారిపోయిన చర్మం రాలిపడుతుంటే దాన్ని చుండ్రు అనుకోకండి. అది మాడు పొడిబారడానికి సంకేతం. మీకు శరీరంలోని ఇతర భాగాల్లోనూ పొడి చర్మం ఉంటే తల పొడిబారకుండా ముందు నుంచే జాగ్రత్త వహించాలి. ఇలాంటి వారు ఎలాంటి చిట్కాలు పాటించవచ్చంటే..

- మాడుపై కలబంద గుజ్జును (తాజాది లేదా ప్యాక్డ్ ) అప్లై చేసుకోవాలి. అప్పుడే చెట్టు నుంచి కోసి ఉపయోగించే కలబందను బాగా కడిగి ఉపయోగించడం మర్చిపోవద్దు.

- బేకింగ్ సోడా, ఆలివ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని కనీసం వారానికోసారి తలకు అప్లై చేసుకోవాలి. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకొని కలిపి తలకు పట్టించి ఐదు నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయవచ్చు.

- జొజొబా నూనె మంచి కండిషన్ గా ఉపయోగపడుతుంది. దీన్ని షాంపూలో కలిపి ఉపయోగించవచ్చు.

- బాగా పండిన అరటిపండును గుజ్జు చేసి అందులో కొబ్బరి లేదా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి అరగంట ఆగి తలస్నానం చేయాలి.

- యాపిల్ సైడర్ వెనిగర్ కూడా పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం యాపిల్ సిడర్ వెనిగర్ ఒక స్పూన్, నీళ్లు రెండు స్పూన్లు చొప్పున తీసుకొని తలస్నానం చేయడానికి ఐదు నిమిషాల పాటు తలకు పట్టించి ఆ తర్వాత తలస్నానం చేయవచ్చు.

చుండ్రు
చర్మం పొలుసుల్లా రాలిపోవడం డాండ్రఫ్ కి దారి తీస్తుంది. ఇందులో పెద్ద పెద్ద పొలుసులతో పాటు తలలో జిడ్డుదనం, దురద వంటివి ఎక్కువగా ఉంటాయి. తలలో ఎక్కువ మొత్తంలో నూనె విడుదల కావడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. దీంతో పాటు చర్మ సమస్య లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా చుండ్రు రావచ్చు. చుండ్రును తగ్గించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉపయోగించవచ్చంటే..

- టీ ట్రీ ఆయిల్ ని ఏదైనా నూనెలో కలిపి మాడుకు అప్లై చేసుకోవాలి. ఇది చుండ్రును తగ్గిస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

- కనీసం వారానికోసారైనా సరే కొబ్బరి నూనెతో తలకు మర్దనా చేసుకొని అరగంట పాటు అలా ఉంచుకోవాలి.

- ఒత్తిడి వల్ల కూడా చుండ్రు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకునేందుకు వీలైనంతగా ప్రయత్నించాలి.

- ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో తగ్గినా చుండ్రు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చేపలు, నట్స్, చియా గింజలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి.

- ప్రొబయోటిక్స్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా చుండ్రు తగ్గుతుంది. ఇందుకోసం పెరుగు, మజ్జిగ వంటి వాటితో పాటు కిమ్చీ, టెంపే లాంటివి కూడా తీసుకోవడం మంచిది.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Hair fall, Hair Loss, HOME REMEDIES

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు