• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH KNOW THE BENEFITS OF HEALTH APPS FOR DIABETIC PATIENTS AK GH

Health Apps: షుగర్ పేషెంట్లకు వరంలా మారిన హెల్త్ యాప్స్.. ఎలాగో తెలిస్తే మీరు వాడతారు

Health Apps: షుగర్ పేషెంట్లకు వరంలా మారిన హెల్త్ యాప్స్.. ఎలాగో తెలిస్తే మీరు వాడతారు

ఫ్రతీకాత్మక చిత్రం

మొబైల్ హెల్త్​ యాప్స్​ను నేటి తరం యువత స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇవి సెన్సార్లు, క్లౌడ్-బేస్డ్ కంప్యూటింగ్ సిస్టమ్స్​ ద్వారా ఆయా వ్యక్తుల హెల్త్​ డేటాను సేకరిస్తాయి.

  • Share this:
టెక్నాలజీ విస్తరణతో అరచేతిలోనే అన్నీ తెలుసుకునే సౌలభ్యం ఏర్పడింది. ముఖ్యంగా కాలు బయటపెట్టుకుండా ఇంటి నుంచే పనులు చక్కబెట్టుకునే అవకాశం కలుగుతోంది. ఇది వరకు మన ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం హాస్పిటల్​కు వెళ్లి చెక్ చేయించుకోవాల్సి వచ్చేది. అంతేకాక, ఆయా రిపోర్ట్స్ రావడానికి రోజులకొద్ది వేచి చూసే ధోరణి కనిపించేది. కానీ టెక్నాలజీ విస్తరణ ఇప్పుడా ఇబ్బందులకు చెక్ పెట్టింది. మార్కెట్​లో కొత్తగా వస్తున్న హెల్త్ యాప్స్​తో ఇప్పడు మనం క్షణాల్లో అన్నీ తెలుసుకునే సౌలభ్యం ఏర్పడింది. ఈ హెల్త్ యాప్స్​ను టీనేజీ, యువతరం విపరీతంగా వినియోగిస్తున్నారు. వీటి ద్వారా తమ ఫిట్​నెస్​, బరువు, నిద్ర, రుతుచక్రం వంటి వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే, ఈ ఫిట్​నెస్​ యాప్స్​ డయాబెటిస్​ రోగులకు కూడా ఉపయోగపడుతున్నాయని, వారికి వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. టెక్నాలజీ అభివృద్ధి, ఇప్పుడు ఆరోగ్య సంరక్షణకు కూడా మార్గం చూపిస్తుందని, హెల్త్​ యాప్స్​తో చాలా మంది వారి ఆరోగ్య స్థితిగతులు, రోగ నిర్ధారణ వంటి వాటిని సులభంగా ట్రాక్​ చేయగలుగుతున్నారని అధ్యయనం స్పష్టం చేసింది.

మొత్తం 1,070 మంది డయాబెటిస్​ రోగులపై మూడు నెలల పాటు ఈ అధ్యయనం కొనసాగింది. వీరిలో కొంతమంది మొబైల్​ హెల్త్​ యాప్ ఉపయోగించగా, మరికొంత మంది ఉపయోగించలేదు. ఆయితే, ఆసక్తికరంగా మొబైల్​ హెల్త్ యాప్స్ ఉపయోగించని వారితో పోలిస్తే​ ఉపయోగించే డయాబెటిక్​ రోగులు మెరుగైన ఆరోగ్య ఫలితాలను కలిగి ఉన్నారని అధ్యయనంలో తేలింది. అంతేకాక, వీటిని ఉపయోగించే డయాబెటిస్ రోగులు త్వరగా కోలుకున్నారని, వారి వైద్య ఖర్చులు కూడా తగ్గించుకున్నారని అధ్యయనం తేల్చి చెప్పింది. హెల్త్​ యాప్స్​ ద్వారా క్షణాల్లో ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యాన్ని ట్రాక్​ చేయగలిగే అవకాశం ఉండమే వైద్య ఖర్చులు తగ్గడానికి ప్రధాన కారణమని అధ్యయనవేత్తలు తెలిపారు. కాగా, ఈ అధ్యయన ఫలితాలు మేనేజ్​మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ రీసెర్చ్ సెంటర్ పబ్లికేషన్​కు చెందిన MIS క్వార్టర్లీ అనే జర్నల్​లో ప్రచురించబడ్డాయి.

49 బిలియన్​ డాలర్లకు mHealth మార్కెట్..
కాగా, ఈ అధ్యయనాన్ని కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం (CMU), న్యూయార్క్ విశ్వవిద్యాలయం (NYU) పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. ఫలితాలపై అధ్యయనవేత్త బీబీ లి మాట్లాడుతూ ‘‘ప్రజలు తమ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా వారి జీవనశైలిని మార్చుకుంటారు. తద్వారా, వారు త్వరగా డయాబెటిస్​ వంటి రోగాల నుంచి బయటపడగలరు.’’ అని అన్నారు. కాగా, ప్రస్తుతం ఆయన CMU హీన్జ్ కళాశాలలో ఇన్ఫర్మేషన్​ సిస్టమ్స్​, మేనేజ్​మెంట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్నారు. మొబైల్ హెల్త్​ యాప్స్​ను నేటి తరం యువత స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇవి సెన్సార్లు, క్లౌడ్-బేస్డ్ కంప్యూటింగ్ సిస్టమ్స్​ ద్వారా ఆయా వ్యక్తుల హెల్త్​ డేటాను సేకరిస్తాయి. ఇటీవలి కాలంలో వీటి డౌన్​లోడ్స్​ పెరగడంతో 2020 చివరి నాటికి ప్రపంచ mHealth మార్కెట్ విలువ 49 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
First published:

అగ్ర కథనాలు