• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH KNOW HOW TO AVOID TENSION REGARDING EXAMS HERE IS THE DETAILS AK GH

Exams Tension: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా ? ఇలా చేస్తే నో టెన్షన్

Exams Tension: పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా ? ఇలా చేస్తే నో టెన్షన్

ప్రతీకాత్మక చిత్రం

Exams Tension: పరీక్ష‌లు వ‌స్తున్నాయంటే అటు విద్యార్థుల్లోనే కాక‌ ఇటు త‌ల్లిదండ్రుల్లోనూ టెన్ష‌న్, ఆందోళ‌న‌లు (anxiety) మొద‌ల‌వుతాయి. 2020 లో క‌రోనా వైరస్ వ్యాప్తి వ‌ల్ల‌ విద్యార్థుల‌కు నిద్రలేని రాత్రులు లేవేమో గానీ, ఈ పరీక్షలు మాత్రం వారిలో మ‌రింత ఒత్తిడిని పెంచుతున్నాయి.

  • Share this:
మార్చి మొదలైందంటేనే పరీక్షల టెన్షన్ మొదలైపోతుంది. ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షలు మొదలైపోయాయి. ఇక సీనియర్ సెకండరీ బోర్డ్‌ ఎగ్జామ్స్-2021 (Board Exams-2021) ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి. ఆ వెంటనే పదో తరగతి పరీక్షలు కూడా వచ్చేస్తాయి. మ‌రోవైపు దేశవ్యాప్తంగా విద్యార్థులు (Students) ఈ ప‌రీక్ష‌ల్లో త‌మ స‌త్తా చూపించ‌డానికి రెడీ అవుతున్నారు. ప‌రీక్ష‌లు వ‌స్తున్నాయంటే అటు విద్యార్థుల్లోనే కాక‌ ఇటు త‌ల్లిదండ్రుల్లోనూ టెన్ష‌న్, ఆందోళ‌న‌లు (anxiety) మొద‌ల‌వుతాయి. 2020 లో క‌రోనా వైరస్ వ్యాప్తి వ‌ల్ల‌ విద్యార్థుల‌కు నిద్రలేని రాత్రులు లేవేమో గానీ, ఈ పరీక్షలు మాత్రం వారిలో మ‌రింత ఒత్తిడిని పెంచుతున్నాయి.

కోచింగ్ క్లాసులు, పాఠాల రివిజ‌న్ (Revision) వంటివి ఆన్ లైన్ ద్వారా జ‌ర‌గ‌డంతో పాటు సాధార‌ణంగా జ‌ర‌గాల్సిన పరీక్షల‌ ప్రక్రియలో క‌రోనా కార‌ణంగా వివిధ అంతరాయాలు ఏర్ప‌డ‌టం వ‌ల్ల‌ విద్యార్థుల్లో కొంత చికాకు లేక‌పోలేదు. అందుకే ఇలాంటి ప‌రిస్థితుల్లో విద్యార్థులు పాఠాల‌ను స్పీడ్‌గా రివిజ‌న్ చేసుకోవాలి. అలాగే త‌గినంత‌ విశ్రాంతి తీసుకోవాలి. తృప్తిగా తినాలి. ముఖ్యంగా హాయిగా నిద్ర‌పోవాలి. వీటితో పాటు పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో విద్యార్థులు ఈ చిట్కాలను పాటిస్తే ఒత్తిడి తగ్గుతుంది.

ప్ర‌శాంత‌మైన నిద్ర అవ‌స‌రం
ఈ పరిస్థితుల్లో పరీక్షలకు సిద్ధమవ్వడం అంత సులభం కాదు. దీని కోసం ఎక్కువ‌గా చ‌ద‌వాలి, రివిజ‌న్ చేసుకోవాలి. అయితే దీనికోసం నిద్ర లేకుండా పని చేయాల్సిన అవసరం లేదు. మ‌నం రీఛార్జ్ కావ‌డానికి రాత్రి నిద్ర చాలా ముఖ్యం. దీని వ‌ల్ల ఎగ్జామ్ ప్రిప‌రేష‌న్‌లో మైండ్ ఉత్సాహంగా ప‌నిచేస్తుంది. ప‌డ‌క ఎంత సౌక‌ర్యంగా ఉంటే నిద్ర అంత హాయిగా ఉంటుంది.

వ్యాయామం కోసం కొంత సమయం
బోర్డు పరీక్షల‌కు సిద్ధ‌ప‌డుతున్న‌ప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన రీడింగ్ టైమ్‌, సమగ్ర అభ్యాస పద్దతులు అవసరం. అయితే శారీరక వినోదానికి కూడా తగినంత సమయాన్ని కేటాయించడం కూడా చాలా ముఖ్యం. శారీరక, మానసిక ఆరోగ్యానికి మీకు నచ్చిన వ్యాయామం చేయవచ్చు. సైక్లింగ్, వాకింగ్ ఉత్తమ వ్యాయామాలు. వీటి వల్ల ప‌రీక్ష‌ల స‌మ‌యంలో క‌లిగే ఆందోళ‌న‌ నుండి పూర్తిగా ఉపశమనం పొందవ‌చ్చు. గుర్తుంచుకోండి. పరీక్షల వరకూ ఆనందంగా ఆడుతూ, పాడుతూ తిరిగి పరీక్షలు రాగానే అలా రాత్రి, పగలు కూర్చొని చదవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వ్యాయామం, మంచి ఆహారం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సులభమవుతుంది.

జంక్ ఫుడ్‌కి దూరంగా
ఈ కీలకమైన కాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల‌ గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌తో పాటు జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీనితో నిద్ర స‌రిగా ప‌ట్ట‌క‌పోవ‌డంతో పాటు ఏకాగ్రత స్థాయి తగ్గడానికి దారితీస్తుంది. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తినడం వ‌ల్ల పగలు చ‌దువుపై దృష్టి సారించ‌డానికి, రాత్రి సమయంలో మంచి నిద్రకు సహాయపడుతుందని వైద్యుల అభిప్రాయం. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినడం వ‌ల్ల చురుకుగా ఉండొచ్చు. ఇది మీకు అవ‌స‌ర‌మైన‌ శక్తినిస్తుంది.

సౌక‌ర్య‌వంత‌మైన సిట్టింగ్ త‌ప్ప‌నిస‌రి
మీ గదిలో తగినంత ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. అలాగే గాలి, వెలుతురు బాగా వచ్చే ద‌గ్గ‌ర కూర్చోవాలి. అలాగే ఎక్కువ సేపు కుర్చీపై కూర్చోవడం వ‌ల్ల కొన్నిసార్లు వెన్నెముకపై చాలా ఒత్తిడి వ‌స్తుంది. ఈ నొప్పి చ‌దువును డిస్ట‌ర్బ్ చేస్తుంది. కాబట్టి, ఒకే దగ్గర కూర్చోవడం కాకుండా కాసేపు కూర్చొని చదివితే కాసేపు అటు, ఇటు తిరుగుతూ చదువుకోవడం మంచిది. ఇది శారీరక ఒత్తిడిని త‌గ్గిస్తుంది. దీనితో ఎక్కువసేపు కూర్చున్నా అలసట ఉండ‌దు. ఇది మీకు వెన్నునొప్పి రాకుండా, ఎక్కువ‌సేపు కూర్చోవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.
First published:

అగ్ర కథనాలు