Sitting All Day: గంటలకొద్దీ కదలకుండా కూర్చుంటున్నారా ? చాలా చాలా డేంజర్

ప్రతీకాత్మక చిత్రం

కంప్యూటర్ ముందు కూర్చుని గంటలతరబడి పనిచేయటం.. లేదా గంటలకొద్దీ డ్రైవ్ చేయడం వంటిని దీర్ఘకాలంలో ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

  • Share this:
గంటలకొద్దీ కదలకుండా కూర్చోవడం వల్ల అధిక రక్తపోటు తలెత్తే ప్రమాదం ఉందని.. గుండె సంబంధిత వ్యాధుల బారినపడి ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని చెబితే మీరు నమ్ముతారా..? కానీ కేవలం కూర్చోవడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో వైద్యుల మాటల్లో తెలుసుకుంటే మీరే షాక్ అవుతారు. చాలామంది ప్రజలు కూర్చోవడం వల్ల ఏమవుతుందిలే అనే భావనతో ఎక్కువసేపు కూర్చుంటారు కానీ చివరికి తీవ్ర అనారోగ్యం పాలవుతుంటారు. కంప్యూటర్ ముందు కూర్చుని గంటలతరబడి పనిచేయటం.. లేదా గంటలకొద్దీ డ్రైవ్ చేయడం వంటిని దీర్ఘకాలంలో ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా కదలకుండా కూర్చోవడానికి,అనారోగ్య సమస్యలకుమధ్య సంబంధం ఉందని పరిశోధనలు కూడా తేల్చాయి.

నిల్చోవడం, నడవడం వంటి చర్యలతో పోల్చితే కూర్చోవడం వల్ల చాలా తక్కువ శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల ఊబకాయం రావటం, రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అయితే 'ఫోర్టిస్ హాస్పిటల్ కల్యాణ్' లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గా వ్యవహరిస్తున్న డా.వివేక్ మహాజన్ మాట్లాడుతూ.. ఎక్కువ సేపు కూర్చోవడానికి, అనారోగ్య సమస్యలకు దారితీసే కారకాలకు మధ్య ఎటువంటి లింక్ ఉందో తెలుసుకోవడానికి పలు అధ్యయనాలు జరిగాయని.. ఆ అధ్యయనాలలో ఎవరైతే కదలకుండా రోజుకు 8 గంటలకు పైగా కూర్చున్నారో వారి ప్రాణాలకు అధికంగా ముప్పు ఉన్నట్టు తేలిందని చెప్పుకొచ్చారు.

ధూమపానం, ఊబకాయం వల్ల ఎలాంటి ప్రాణాంతకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో రోజుకు 8 గంటల పాటు కూర్చోవడం వల్ల కూడా అలాంటి అనారోగ్య సమస్యలే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని అధ్యయనాల్లో తేలినట్టు తెలిపారు. పగటివేళల్లో తక్కువగా కూర్చోవడం, పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడవచ్చని ఆయన తెలిపారు. కరోనా కారణంగా చాలామంది వర్క్ ఫ్రొంహోమ్ ఉద్యోగాలు చేస్తున్నారని.. వారందరూ కూడా ఎక్కువ సమయం కూర్చోకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు.

డా.వివేక్ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి వివరించారు. అవేంటో ఒకసారి చూద్దాం!

1. కాలు, పిరుదు కండరాలు: ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాలు, పిరుదు కండరాలు శక్తి హీనంగా తయారవుతాయి. నడవడానికి, స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడే ఈ పెద్ద కండరాలు బలహీనంగా తయారైతే.. వ్యాయామాల చేసినా.. కిందపడినా తీవ్రమైన గాయాలవుతాయి.

2. గుండె జబ్బులు, గుండెపోటుకు దారితీసే జీవక్రియ సమస్యలు: రోజులో ఎక్కువ సార్లు కండరాలను కదిలించడం వల్ల శరీరంలోని కొవ్వులు, చక్కెరలు సంపూర్ణంగా జీర్ణమవుతాయి. ఒకవేళ మనం రోజంతా కూర్చున్నట్లయితే, జీర్ణక్రియ వ్యవస్థ బలహీనపడి శరీరంలో కొవ్వులు, చక్కెరలు కరగక అలాగే స్టోర్ అవుతాయి.

3.క్యాన్సర్: గంటల కొద్దీ కూర్చోవడం వల్ల ఊపిరితిత్తులు, గర్భాశయం, పెద్దప్రేగు క్యాన్సర్లతో సహా మరికొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

4. జీవక్రియ సిండ్రోమ్: గంటలకొద్దీ కూర్చోవడం వల్ల తొడ కండరాలు కుచించుకుపోయి జాయింట్ పెయిన్ వస్తుంది. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కఠినమైన ఎక్సర్సైజ్ చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. జీవక్రియ సిండ్రోమ్ వ్యాధి కూడా వస్తుంది.

రోజంతా యాక్టివ్ ఉండటం వల్ల పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు దరిచేరవు. కూర్చొని పనులు చేసేవారు 30 నిమిషాలకొకసారి నిల్చోని అటు ఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. నిలబడి వర్క్ చేసినా.. ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. టీవీ చూస్తున్నప్పుడు లేదా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా నడవటం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.
Published by:Kishore Akkaladevi
First published: