DASH డైట్.. బరువు తగ్గేందుకు సరికొత్త విధానం.. ఇవి తీసుకోవాలి

ప్రతీకాత్మక చిత్రం

Dash Diet: అసలు డైట్ అంటేనే ప్రణాళికా బద్దంగా ఆహారం తీసుకోవడం. ఇటీవల కాలంలో DASH డైట్ బాగా ప్రాచుర్యం పొందింది. మరీ ఈ డైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • Share this:
ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం ఏళ్ల తరబడి మనకోసం ఎన్నో ఆహార విధానాలు అందుబాటులోకి వచ్చాయి.. వస్తున్నాయి కూడా.. ఆట్కిన్స్ డైట్, మెడిటేరియన్ డైట్, కీటోజైనిక్ డైట్, శాకాహారుల డైట్, రా ఫుడ్ డైట్ అంటూ వేల రకాల డైట్స్ ప్లాన్స్ ఉన్నాయి. అంతేకాకుండా వీటిని కొంత మంది బరువు తగ్గడం కోసం ఎంచుకుంటే.. మరికొంత మంది బరువు పెరగడం కోసం అవలంభిస్తున్నారు. అసలు డైట్ అంటేనే ప్రణాళికా బద్దంగా ఆహారం తీసుకోవడం. ఇటీవల కాలంలో DASH డైట్ బాగా ప్రాచుర్యం పొందింది. మరీ ఈ డైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డ్యాష్ డైట్ అంటే..
DASH డైట్ అంటే 'డైటరీ అప్రోచేస్ టూ స్టాప్ హైపర్ టెన్షన్'. అంటే అధిక రక్తపోటును నివారించే ఆహారాన్ని తీసుకోవడం అన్నమాట. అమెరికన్ నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇనిస్టిట్యూట్ ప్రకారం గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే డ్యాష్ డైట్ ఉత్తమమని తేల్చారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలకిచ్చే ర్యాంకింగ్స్ లో ఇది అగ్రస్థానంలో నిలిచింది. సహజంగా అనారోగ్యకరమైన కొవ్వులు, తక్కువ షుగర్లు ఉండే ఆహారాన్ని తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం డ్యాష్ డైట్ ను మొదట 1996లో అమెరికన్ హార్ట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. అనంతరం 1997లో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించారు.

అధ్యయనంలో ఏం తేలిందంటే..
రక్తపోటును తగ్గించడంలో డ్యాష్ ట్రయల్ కింద 456 మందికి వివిధ ఆహారాలకు కేటాయించారు పరిశోధకులు. రక్తపోటు తగ్గాలంటే పోషకాలతో ఉండే విభిన్నమైన ఆహారాలను తీసుకోవడం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు భావించారు. ముఖ్యంగా లిమిటెడ్ డైట్ లో వీటిని కనుగొన్నారు.

ఈ మూడు డైట్స్ ను పరీక్షించారు..
-కంట్రోల్ డైట్ లేదా స్టాండార్డ్ అమెరికన్ డైట్.
- పండ్లు, కూరగాయలతో తీసుకునే ఆహారం కంట్రోల్ డైట్ కింద వస్తుంది. కానీ ఇందులో ఎక్కువ పండ్లు, కూరగాయలతో పాటు కొద్దిగా స్నాక్స్, స్వీట్లు కూడా ఉంటాయి.
- కాంబినేషన్ డైట్.. పండ్లు, కూరగాయలు, నట్స్, తక్కువ కొవ్వు ఉండే పాల పదార్థాలు ఇందులో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో సంతృప్తికర కొవ్వులు, కొవ్వులు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి.
పైన పేర్కొన్న మూడింటిలో చివరి రెండు ఆహారాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. పొటాషియం, మ్యాగ్నీషియం, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్ లాంటివి బీపీని తగ్గిస్తాయి. ఈ మూడు డైట్స్ లో 3 వేల మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. ఇది అమెరికన్లకు సిఫార్సు చేసిన ఆహార మార్గదర్శకాల కంటే ఎక్కువ. కానీ సగటు అమెరికన్లు తీసుకునే సోడియం కంటే ఇది తక్కువ.
-బరువులో మార్పులు లేకపోయినప్పటికీ కాంబినేషన్ డైట్ కంటే మిగిలిన రెండు ఆహారాలు రక్తపోటును తగ్గించాయి. బీపీ ఉన్నవారిలో ఎక్కువ తగ్గుదల కనిపించింది. రక్తపోటు మొదటి దశలో ఉన్నవారు మెడికేషన్ తీసుకున్నా.. కాంబినేషన్ డైట్ ను పాటించినా ఒకే రకమైన ఫలితం ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది.
-ఈ అధ్యయనం ఫలితాలు 2010లో అమెరికన్ల కోసం సిఫార్సు చేసిన ఆహార మార్గదర్శకాలకు శాస్త్రీయ ఆధారాన్ని అందించాయి. సౌకర్యవంతమైన, సమతుల్యంగా తినే ప్రణాళికను విస్తృతంగా పరిశీలించారు. ఇది మెరుగైన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుందని తేల్చారు.

డ్యాష్ సిఫార్సులు..
-కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పొటాషియం, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
- కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, చేపలు, చికెన్, నట్స్ కూరగాయలు తీసుకుంటే మంచిది.
- అధిక సంతృప్తికర కొవ్వులు ఉండే ఫ్యాటీ మీట్స్, పూర్తిగా కొవ్వుగా ఉండే పాల ఉత్పత్తులు, కొబ్బరి, వేరుశనగ నూనెలు మితంగా తీసుకోవాలి.
- చక్కెర తక్కువగా ఉండే పానీయాలు, మిఠాయిలను తీసుకోవాలి.
- ప్రోటీన్ లేదా అసంతృప్తి కొవ్వుల కోసం రోజువారీ కార్బోహైడ్రేట్లను 10 శాతం ఉండేలా మార్చుకోవాలి.
- మీపై బరువు ఆధారంగా లేదా మీ శరీరంలో కొవ్వు ఎక్కడెక్కడ ఉంటుందో గుర్తించి మీ వైద్యుడిని సంప్రదించి తగ్గేంచేందుకు కృషి చేయాలి. ఇందుకోసం డ్యాష్ డైట్ ను ఎంచుకోవచ్చు. రోజుకు మీ బరువును బట్టి 1200, 1400, 1600, 2000, 2600, 3100 కేలరీలు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

డ్యాష్ డైట్ తో బరువు తగ్గేందుకు చిట్కాలు..
- రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం.
- ఆల్కహాల్ కు దూరంగా ఉండటం లేదా పరిమితం చేయండి.
- కూరగాయలను విరివిగా వాడండి.
- రెడీ టూ ఈట్ లేదా క్యాన్డ్ ఫుడ్ కి దూరంగా ఉండండి.
- మీరు నిల్వచేసిన పదార్థాలను తీసుకుంటే పైన లేబుల్లో సోడియం తక్కువ ఉందో లేదో గమనించండి.
- ఏదైనా కాయ లేదా పండును ఆహారంలో భాగంగా తీసుకోండి. లేదా స్నాక్స్ గా తీసుకోండి.
- డెజర్ట్ గా తక్కువ కొవ్వు ఉండే పెరుగును తాజా పండ్లతో తీసుకోండి.
- జ్యూస్ తీసుకోవాలనుకుంటే చక్కెర లేకుండా తీసుకోండి.
First published: