ఛాటింగ్‌లో ఎమోజీలు వాడుతున్నారా.. మీరు శృంగార ప్రియులే సుమా..

Sex Education | ఛాటింగ్ చేసే వారిలో ఎక్కువగా ఎమోజీలు వాడుతూ.. హావభావాలను ప్రదర్శించేవాళ్లు సెక్స్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారట.. పడక గదిలో తమ ప్రతాపాన్ని చూపుతారట.

news18-telugu
Updated: August 21, 2019, 3:24 PM IST
ఛాటింగ్‌లో ఎమోజీలు వాడుతున్నారా.. మీరు శృంగార ప్రియులే సుమా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెక్స్ చేయడం ఒక కళ.. భాగస్వామికి అనుభూతులు పంచుతూ, వారి హావభావాలను పీక్ స్టేజీకి తీసుకెళ్తూ శృంగారంలో ఓలలాడిస్తే పొందే ఆనందం అనంతమైనది.. అంతటి కళా నైపుణ్యం కొందరికే ఉంటుంది. ఇంకొందరు కూడా ఎక్కువగా సెక్స్ చేస్తూ ఆనందం పొందుతున్నారట. వారెవరో కాదు.. ఛాటింగ్‌లో ఎక్కువ ఎమోజీలు వాడే వారు. ఛాటింగ్ చేసే వారిలో ఎక్కువగా ఎమోజీలు వాడుతూ.. హావభావాలను ప్రదర్శించేవాళ్లు సెక్స్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారట.. పడక గదిలో తమ ప్రతాపాన్ని చూపుతారట. అమెరికాలోని కిన్‌సే ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దాదాపు 5వేల మందిపై పరిశోధనలు చేయగా.. ఎమోజీలు వాడుతూ ఛాటింగ్ చేసిన వాళ్లు డేటింగ్, సెక్స్ ఎక్కువగా చేశారట.

అంతేకాదు.. ఎమోజీలు బంధాన్ని మరింత పటిష్ఠం చేయడంతో కీలక పాత్ర పోషించాయని, 86 శాతం మంది దీన్ని ఒప్పుకున్నారని పరిశోధకులు వెల్లడించారు. రొమాంటిక్‌గా, సెక్సువల్ రిలేషన్‌షిప్‌లో రఫ్ఫాడించేస్తారని వివరించారు. అయితే, ఎమోజీలు వాడితేనే సెక్స్ బాగా చేస్తారని చెప్పడం లేదని, బంధం బలపడుతుందని భావించడం లేదని.. కేవలం వాటిని వాడిన వ్యక్తులు సెక్స్‌ బాగా చేస్తారని చెప్తున్నామని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు