హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health : కీటో డైట్... ఆరోగ్యానికి మంచిదేనా?

Health : కీటో డైట్... ఆరోగ్యానికి మంచిదేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health : తెలుగు రాష్ట్రం ఏపీలో పుట్టి... దేశమంతా విస్తరించింది కీటో డైట్. వేగంగా బరువు తగ్గేందుకు ఇదే సరైన డైట్ అంటున్నారు దీన్ని ఫాలో అవుతున్నవారు.

  విదేశాల్లోనే కాదు... ఇప్పుడు ఇండియాలో కూడా బరువు తగ్గడం అన్నది పెద్ద సమస్యగా మారిపోతోంది చాలా మందికి. ఎన్నో రకాల టిప్స్ పాటించి, రకరకాల ట్రీట్‌మెంట్లు తీసుకుంటూ అప్పటికీ బరువు తగ్గని చాలా మంది... చివరకు కీటో డైట్ ఫాలో అవుతున్నారు. దాని వల్ల బరువైతే ఎంతో కొంత తగ్గుతున్నారు గానీ... అది సరైన డైట్ కాదన్న వాదన కూడా ఉంది. దాన్ని ఫాలో అయితే... శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ మంది కీటో డైట్ ఫాలో అవుతున్నయ్లు హెల్తిఫైమీ ఫిట్‌నెస్ యాప్ సర్వేలో తేలింది. సాధారణంగా ఇలాంటి డైట్లు రెండు రకాలు. మొదటిది రోజువారీ తినే ఆహారంపై కంట్రోల్. ఇందులో రోజూ 6 నుంచీ 8 గంటలు మాత్రమే ఆహారం తీసుకుంటారు. రెండోది 5:2 ఉపవాసం. వారంలో ఐదురోజులు మాత్రమే ఫుల్లుగా తిని... మిగతా రెండు రోజులూ కొద్ది మొత్తంలో మాత్రమే తింటారు. బాడీలో కొవ్వు కరిగిపోవాలనుకునేవారికి కీటో డైట్ సరైన ఆప్షన్ అంటున్నారు కొందరు.

  నిజానికి ఎపిలెప్సీ బాధితుల కోసం కీటోజెనిక్ డైట్‌ను తెచ్చారు. ఇప్పుడు ఇతర కండీషన్లకు కూడా దీన్ని వాడుతున్నారు. బరువు తగ్గడానికీ, పోలీసిస్టిక్ ఒవారియన్ డిసీజ్ (PCOD), మచ్చలు, ఇతర నరాల సంబంధిత సమస్యలకు విరుగుడుగా కీటో డైట్ ఫాలో అవుతున్నారు. కానీ కీటో డైట్‌ని ఎక్కువ కాలం ఫాలో అవ్వడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఎక్కువ పని గంటలు, నిద్రలేమి, ఎక్కువ సేపు మొబైల్ చూడటం ఇలాంటివి ఇండియాలో ఫిట్‌నెస్‌ను తగ్గిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 500 మందీ న్యూట్రీషనిస్ట్స్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

  ప్యాకేజ్డ్ ఫుడ్, ఫుడ్ డెలివరీ సర్వీసులు కూడా ప్రజలు బరువు పెరిగేలా చేస్తున్నాయని తెలిసింది. కీటో డైట్ ఫాలో అయ్యేవారు మాంసం, చేపలు, పాలు, గుడ్లు తీసుకోరు. ఆకులు, కూరగాయల రసాలే తీసుకుంటారు. ఐతే... దీని వల్ల పోషకాల లోపం తలెత్తుతుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రోటీన్స్, విటమిన్ B12 కొరత ఏర్పడుతుందంటున్నారు.

  సూపర్ ఫుడ్స్ విషయానికొస్తే... ఇండియన్స్ ఎక్కువగా గ్రీన్ టీ, సబ్జా గింజలు, పసుపును ఎక్కువగా వాడుతున్నట్లు సర్వేలో తేలింది. నెయ్యి, రాగి, క్వినోవా కూడా ఎక్కువగా వాడుతున్నారు. అలాగే క్యాబేజీ, గోధుమ గడ్డి, ఉసిరిని బరువు తగ్గేందుకు ఎక్కువ మంది వాడుతున్నారు. ఈ ఏడాది చాలా మంది రైస్, గోధుమల బదులు... బ్రౌన్ రైస్, క్వినోవా వంటివి ఆహారంగా తీసుకుంటున్నట్లు సర్వేలో తెలిసింది.

  ఇండియాలో 70 శాతం మంది ఉదయం 4 నుంచీ మధ్యాహ్నం 12 లోపు వర్కవుట్స్ చేస్తున్నారు. వీరిలో 40 శాతం మంది ఉదయం 4 నుంచీ 8 మధ్యే వర్కవుట్స్ పూర్తి చేస్తున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Health benefits, Health benifits, Weight loss

  ఉత్తమ కథలు