Murali Krishna, News18, Kurnool
ఇటీవల కాలంలో వివిధ ఆహారపు అలవాట్లు మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతున్నాయి. అందులో బయట దొరికే మసాలా ఫుడ్స్ వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తీవ్రతరం అవుతున్నాయి. ముఖ్యంగా యువత సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం బయట లభించే మసాలాఆహారానికి అలవాటు పడటం వాటిని సమయ అనుకూలత లేని సమయంలో తినడం వలన ఈ గ్యాస్ సమస్యలనేవి అధికంగా అవుతుంటాయని డాక్టర్లు తెలుపుతున్నారు. అయితే కడుపులో ఎలాంటి ఆహారం లేని సమయంలో గ్యాస్ ఫామ్ అయ్యి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయని తెలుపుతున్నారు. అందులో ముఖ్యంగా యువత ఎక్కడపడితే అక్కడ తినడమో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన ఇబ్బందులు వస్తాయని తెలుపుతున్నారు.మానసిక ఒత్తిడి ఏ రకంగా దారి తీస్తుందంటే ప్రముఖంగా చాలామంది ఉద్యోగరీత్యఒత్తిడికి లోనై.. సమయానికి తినక, గ్యాస్ట్రబుల్,అల్సర్ వస్తుందనితెలుపుతున్నారు.
గ్యాస్టిక్ ప్రాబ్లమ్ (Gastric Problem) వలన పెద్దగా భయపడాల్సిన పని లేదంటున్నారు డాక్టర్లు. అయితే ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుపుతున్నారు.. అందువల్ల గ్యాస్టిక్ సమస్య ఉన్నట్లు మీకు అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైనసమయంలో చికిత్స తీసుకుంటే.. ఈ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నుంచి బయటపడొచ్చని తెలుపుతున్నారు.
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లు
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది.మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల హార్ట్ బీట్ సరిగ్గా ఉండేందుకు సాయపడుతుంది. అలాగే చేపలు రెగ్యులర్ గా తింటే వీటిలో ఉండే ఫ్యాట్ యాసిడ్స్, ప్రొటీన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతాయంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Heart, Kurnool, Local News