మీ పిల్లలు పండ్లు, కూరగాయలు తినడం లేదా ?.. అయితే ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

పిల్లల్లో ఆరోగ్యం, పోషకాహరం తీసుకోవడం అనే అంశంపై వారు పరిశోధన చేశారు. దీర్ఘ కాలిక లంచ్ బ్రేక్స్ వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు స్పష్టం చేశారు.

  • Share this:
చిన్నతనం నుంచే పిల్లలకు పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ పిల్లలు మాత్రం కూరగాయలు, పండ్ల కంటే చిరుతిళ్ల వైపే ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఫలితంగా వారికి సరైన పోషకాలు అందవు. అయితే లంచ్ సమయాన్ని పెంచడం వల్ల ఈ సమస్యను పరిష్కరించవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. ఎక్కువ సేపు లంచ్ టేబుల్ వద్ద ఉండటం వల్ల పిల్లలు పండ్లు, కూరగాయలు లాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు ఎంచుకుంటారని తాజా అధ్యయనంలో తేల్చారు. అమెరికా ఇల్లినాయిస్ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. పిల్లల్లో ఆరోగ్యం, పోషకాహరం తీసుకోవడం అనే అంశంపై వారు పరిశోధన చేశారు. దీర్ఘ కాలిక లంచ్ బ్రేక్స్ వల్ల అనుకున్న లక్ష్యాలను సాధించినట్లు స్పష్టం చేశారు.

* తినే సమయం తక్కువ ఉండటమే కారణం..
లంచ్ బ్రేక్ ను 10- 20 నిమిషాల్లో పూర్తి చేయడం సర్వసాధారణం. షెడ్యూల్ చేసిన లంచ్ సమయం ఎక్కువ ఉన్నప్పటికీ విద్యార్థులు తినే సమయం చాలా తక్కువని ఫుడ్ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మెలిసా ఫ్లా ప్రెస్కోట్ తెలిపారు. తినే సమయం తక్కువగా ఉండటం వల్ల చిన్నారుల తమ ఆహారంలో పండ్లు, కూరగాయలు చాలా తక్కువ తీసుకుంటారని ఆమె అన్నారు. పానీయాలు, డ్రింక్స్ కూడా తక్కువ మోతాదులోనే తీసుకుంటారని, అదే తినే సమయం ఎక్కువ ఉంటే పండ్లు, కూరగాయలు కూడా తీసుకునే అవకాశముంటుందని తెలిపారు.

* ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై పరిశోధన..
ఈ పరిశోధనను మెలిసా తన సహచరులతో కలిసి ఇల్లినాయిస్ వర్సిటీలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ లో నిర్వహించారు. ఈ క్యాంప్‌లో చేరిన ప్రైమరీ, మిడిల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ విద్యార్థులు లైన్ గుండా వెళ్లి వారి ఆహారాన్ని ఎంచుకునేలా ఏర్పాటు చేశారు. నేషనల్ స్కూల్ లంచ్ ప్రోగ్రాం మార్గదర్శకాల ప్రకారం ఈ భోజనం సిద్ధం చేశారు. ప్రతిరోజు స్వల్ప లేదా దీర్ఘకాలిక భోజన సమయాన్ని కేటాయించారు. రెండు సమయాలకు ఒకే విధమైన భోజన మెనూను రూపొందించారు.

పిల్లలకు భోజనం వడ్డించిన దగ్గర నుంచి వారు తినడం పూర్తయ్యే వరకు లంచ్ లో కూర్చొన్న సమయాన్ని పర్యవేక్షించారు. భోజనం తినేటప్పుడు వారి ప్రవర్తనను గమనించారు. లంచ్ పూర్తయిన తర్వాత ఆహారం రుచి, రూపం గురించి రెండు ప్రశ్నల సర్వేను నిర్వహించారు. ప్రతి చిన్నారి ఎంతమేరకు తిన్నారో సమగ్రంగా అంచనా వేశారు. కూరగాయల కంటే పండ్లు, అధికంగా వినియోగించినప్పటికీ దీర్ఘకాలిక భోజన సమయంలో ఈ రెండింటిని ఎక్కువగా తీసుకున్నారని మెలిసా స్పష్టం చేశారు. భోజన సమయం తక్కువగా ఉన్నప్పుడు కూరగాయలు, పండ్లు తీసుకోవడం గణనీయంగా తగ్గిందని ఆమె వివరించారు.
Published by:Kishore Akkaladevi
First published: