Home /News /life-style /

HEALTH IS THERE ANY LINK BETWEEN CANCER AND OBESITY HERE WHAT THE SCIENTISTS OBSERVATION AK GH

Anti Obesity Day 2021: ఊబకాయానికి క్యాన్సర్‌తో సంబంధం ఉందా ? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్యాన్సర్‌తో చనిపోయే ప్రతీ ఆరుగురు మగవారిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. క్యాన్సర్‌తో మరణించే ప్రతీ ఏడుగురు మహిళల్లో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారు. దీన్నిబట్టి ఊబకాయులు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని స్పష్టమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో స్థూలకాయం (Obesity) ఒకటి. ఈ అనారోగ్య సమస్య గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడానికి యేటా నవంబర్ 26న ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో యాంటీ ఒబేసిటీ డే (Anti Obesity Day) జరుపుకుంటారు. భారతదేశంలో కూడా ఏడాదికేడాది చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. ఈ తరుణంలో ఊబకాయానికి, క్యాన్సర్‌కి మధ్య ఉన్న లింక్ ఏంటి? అధిక బరువు వల్ల ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి? వంటి విషయాలు తెలుసుకుందాం.

వయసు పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో క్యాన్సర్ ముప్పు అధికమవుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే యవ్వన ప్రాయంలో ఊబకాయంతో బాధపడే యువతీయువకులు పెద్దవారైనప్పుడు క్యాన్సర్ బారిన పడే ముప్పు మరింత ఎక్కువట. ఈ విషయాన్ని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నొక్కి వక్కాణించింది. క్యాన్సర్‌తో చనిపోయే ప్రతీ ఆరుగురు మగవారిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. క్యాన్సర్‌తో మరణించే ప్రతీ ఏడుగురు మహిళల్లో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారు. దీన్నిబట్టి ఊబకాయులు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని స్పష్టమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

భారతదేశంలో దాదాపు ఆరు రకాల క్యాన్సర్‌లు ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. ఈ ఆరు రకాల క్యాన్సర్‌ కేసులు 50 ఏళ్లలోపు వ్యక్తులలో నెమ్మదిగా పెరుగుతున్నాయి. పెద్దపేగు లేదా మలద్వార క్యాన్సర్‌, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, పిత్తాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ (ఎండోమెట్రియల్ క్యాన్సర్), మల్టిపుల్ మైలోమా అనే ఆరు రకాల క్యాన్సర్‌లకు, ఊబకాయానికి మధ్య లింక్ ఉంది. అయితే వ్యాధి ముదిరే వరకు ఇవి యుక్తవయసు వారిలో ఎక్కువగా బయటపడవని డాక్టర్లు చెబుతున్నారు.

* ఊబకాయానికి, క్యాన్సర్‌కి మధ్య ఉన్న లింక్ ఏంటి?
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేది ఒకే శరీర భాగానికి పరిమితం కాదు. చలనశీలత లక్షణాలు గల కొవ్వు ఇతర భాగాల్లో పేరుకుపోయే ప్రమాదం ఉంది. అప్పుడా కొవ్వు సరిగా పనిచేయని లేదా వ్యర్థమైన కొవ్వుగా మారుతుంది. ఆ తర్వాత అది వాచిపోయిన శరీరంగా లేదా గడ్డగా ఏర్పడుతుంది. అదే గడ్డ(inflammation) క్యాన్సర్ వ్యాధికి దారి తీసే ప్రమాదం ఉంది. ఊబకాయంతో సంబంధం ఉన్న అనేక క్యాన్సర్లు కొవ్వు బాగా పేరుకుపోయిన అవయవాల్లోనే అభివృద్ధి చెందాయి. ఇంకా చెప్పాలంటే, అధికంగా పేరుకుపోయిన కొవ్వు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపించగలదు.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

మందగించిన కొవ్వు కణజాలం కలిగి ఉన్న వ్యక్తుల్లో ఇన్సులిన్, ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల స్థాయిలు పూర్తి భిన్నంగా మారిపోతుంటాయి. ఈ మార్పులు డీఎన్ఏని దెబ్బతీస్తాయి. ఇవే మార్పులు మల్టిపుల్ మైలోమా వంటి రక్త క్యాన్సర్‌లతో సహా అనేక క్యాన్సర్‌ వ్యాధులకు దారితీస్తాయి. అయితే మూడింట ఒక వంతు సాధారణ క్యాన్సర్లను నివారించవచ్చు. ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. అధిక బరువు ఉన్న యువతీ యువకులు బరువు తగ్గడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Cancer, Obesity

తదుపరి వార్తలు