• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH INTERESTING FACTS ABOUT USAGE OF COFFEE WHICH RELATED TO YOUR GENES AK GH

Coffee: కాఫీపై మనసు లాగేస్తోందా ? ఇందుకు అసలు కారణం వేరే ఉందనే విషయం తెలుసా..

Coffee: కాఫీపై మనసు లాగేస్తోందా ? ఇందుకు అసలు కారణం వేరే ఉందనే విషయం తెలుసా..

ఫ్రతీకాత్మక చిత్రం

గుండె ఆరోగ్యంపై కాఫీ వినియోగం ప్రభావాన్ని పరిశోధకులు గుర్తించారు. జన్యువులు మనం తాగే కాఫీ మొత్తాన్ని చురుకుగా నియంత్రిస్తాయని వెల్లడించారు.

  • Share this:
భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో కాఫీని వివిధ రంగులు, రుచుల్లో తయారు చేస్తారు. దీంట్లో ఉండే కెఫిన్ కారణంగా కాఫీకి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. కాఫీ తాగేవారు కేవలం రుచి కోసమే చూస్తారనేది పూర్తిగా నిజం కాదు. దీనిపై ఏర్పడే ఇష్టానికి మన జన్యువులు కూడా కారణం కావచ్చని తాజా పరిశోధన చెబుతోంది. దీంతో పాటు కాఫీ.. మన ఆరోగ్యానికి సూచిక కావచ్చని వెల్లడించింది. మనుషుల గుండె ఆరోగ్యాన్ని కాఫీ ప్రభావితం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ రిసెర్చర్లు చేసిన ఈ అధ్యయనాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించారు. గుండె ఆరోగ్యంపై కాఫీ వినియోగం ప్రభావాన్ని పరిశోధకులు గుర్తించారు. జన్యువులు మనం తాగే కాఫీ మొత్తాన్ని చురుకుగా నియంత్రిస్తాయని వెల్లడించారు.

ఈ పరిశోధనకు అవసరమైన డేటాను యూకే బయోబ్యాంక్ నుంచి సేకరించారు. మొత్తం 3,90,435 మంది వ్యక్తుల సాధారణ కాఫీ వినియోగాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. తరువాత వీరందరిలో సాధారణ రక్తపోటు స్థాయిలతో పాటు హృదయ స్పందన రేటులను (హార్ట్ రేట్) పోల్చారు. వీరిలో అధిక రక్తపోటు, ఆంజినా లేదా అరిథ్మియా వంటి రుగ్మతలు ఉన్నవారిని వేరుచేశారు. ఇతరులతో పోల్చినప్పుడు.. వీరంతా డీకాఫిన్ చేసిన కాఫీని తక్కువగా తీసుకుంటున్నారని, కొంతమంది అసలు కాఫీకి దూరంగా ఉంటున్నారని గుర్తించారు. అంటే అనారోగ్యాల ప్రభావం ఉన్నవారు సహజంగానే కాఫీకి దూరంగా ఉంటున్నారు. దీన్ని బట్టి కాఫీ వినియోగం మన జన్యువులపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు ప్రధాన పరిశోధకురాలు, ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ ప్రెసిషన్ హెల్త్ డైరెక్టర్ ఎలినా హిప్పోనెన్.

ప్రజలు తమ రక్తపోటు ఆధారంగా సురక్షితమైన కెఫిన్ స్థాయిలను గుర్తించగలరని అధ్యయనంలో కనుగొన్నారు. ప్రొటెక్టివ్ జెనెటిక్ మెకానిజం ద్వారా ఇది సాధ్యమవుతుందని పరిశోధకులు తెలిపారు. చాలా తక్కువ మొత్తంలో కాఫీ తాగే వారితో పోలిస్తే, ఎక్కువగా కాఫీ తాగే వ్యక్తి కెఫిన్‌ను ఎక్కువగా తట్టుకోగలడు. ఇదే సందర్భంలో డీ కెఫినేటెడ్ డ్రింక్స్ తీసుకునేవారు, కాఫీ తాగనివారు కెఫిన్ వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకోలేరు. అధిక రక్తపోటు వంటి సమస్యలకు దూరంగా ఉండేందుకు వీరు సహజంగానే కాఫీకి దూరంగా ఉంటారు. కాఫీపై ఇష్టం, అయిష్టాలను మన శరీరమే ఏర్పరుస్తుంది. అంటే.. గుండె ఆరోగ్యం ఆధారంగా కాఫీ వినియోగాన్ని మన జన్యువులు నిర్దేశిస్తాయని ఎలినా హిప్పోనెన్ తెలిపారు.
First published:

అగ్ర కథనాలు