Home /News /life-style /

Five in the world: ఇప్పటి వరకు ప్రపంచంలో ఐదుగురికి మాత్రమే ఇలా జరిగింది.. అదేంటో తెలుసా..

Five in the world: ఇప్పటి వరకు ప్రపంచంలో ఐదుగురికి మాత్రమే ఇలా జరిగింది.. అదేంటో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Five in the world: సాధారణంగా అవయవ మార్పిడి అంటేనే ఎంతో అప్రమత్తంగా చేయాల్సిన సర్జరీ(Surgery) అని వైద్య నిపుణులు భావిస్తుంటారు. అలాంటిది మధ్యప్రదేశ్(Madhyapradesh) ఇండోర్(Indore) ఆసుపత్రిలో అరుదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అందేంటంటే..

ఇంకా చదవండి ...
సాధారణంగా అవయవ మార్పిడి అంటేనే ఎంతో అప్రమత్తంగా చేయాల్సిన సర్జరీ(Surgery) అని వైద్య నిపుణులు భావిస్తుంటారు. అలాంటిది మధ్యప్రదేశ్(Madhyapradesh) ఇండోర్(Indore) ఆసుపత్రిలో అరుదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. 59 ఏళ్ల ఓ వ్యక్తి అరుదైన సమస్యతో ఇండోర్‌లోని చోయిత్‌రాం ఆసుపత్రిలో చేరాడు. అతడి శరీరంలో కాలేయం, గుండె తప్పుడు దిశలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడు లివర్ సిర్రోసిస్ అనే కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో కాలేయ మార్పిడి చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆయన 26 ఏళ్ల కుమారుడు కాలేయాన్ని దానం ఇవ్వడంతో వైద్యులు ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. సిటస్ ఇన్వర్టస్‌ టోటాలిస్ (situs invertus totalis) అనే అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్న బాధితుడి కాలేయంలో సమస్య ఏర్పడింది. దీంతో దాత సహాయంతో శస్త్రచికిత్స నిర్వహించారు. ఇది చాలా అరుదైన లివర్ ట్రాన్స్ ప్లాంట్ అని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి సర్జరీ ఐదుగురికే జరిగిందని తెలిపారు.

Sexual Health: వయసు పెరిగాక మహిళల్లో శృంగార కోరికలు ఎందుకు తగ్గుతాయి..? పునరుత్తేజం పొందాలంటే ఏం చేయాలి..


ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చు..
సాధారణంగా మన శరీరంలో కాలేయం కుడివైపు ఉంటుంది. కానీ జన్యుపరమైన సమస్యల కారణంగా కొంతమందికి ఎడమ వైపు ఉంటుంది. ఈ కేసులోనూ అదే జరిగిందని చెబుతున్నారు చోయిత్‌రాం ఆసుపత్రిలోని ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ సురేశ్ శార్దా. నలుగురు వైద్యుల బృందం ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. ఇది చాలా సీరియస్ ఆపరేషన్ అని, సరైన సమయంలో సర్జరీ చేయకపోతే రోగి ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చని శార్దా వివరించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఐదుగురికి మాత్రమే ఇలాంటి సర్జరీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే దాతను డిశ్చార్జి చేశామని, త్వరలో అతని తండ్రి కూడా కోలుకుంటారని చెప్పారు.

Eating at Work Place: వర్క్ ఫ్రం హోం చేస్తూ.. వాటిని తింటున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే..


సిటస్ ఇన్వర్టస్‌ టోటాలిస్ అంటే ఏంటి?
సిటస్ ఇన్వర్టస్‌ టోటాలిస్ అంటే అంతర్గత అవయవాలు పూర్తిగా తిరగబడిన పరిస్థితి. ఈ అనారోగ్య పరిస్థితి 6 నుంచి 8 వేల జననాల్లో ఒకరికి వస్తుంది. ఇది కార్టజెనర్స్ సిండ్రోమ్ (పుట్టుకతో వచ్చేది) అని పిలిచే అరుదైన పరిస్థితి. పుట్టుకతో వచ్చే గుండె లోపాలు 5 నుంచి 10 శాతం మంది బాధితుల్లో ఉంటాయి. సిటస్ ఇన్వర్టస్‌ అనేది జన్యు పరమైన కారణాల వల్ల వస్తుందని యూఎస్ జెనెటిక్ అండ్ రేర్ డిసీజెస్ ఇన్ఫర్మేషన్ సెంటర్(GARD) స్పష్టం చేసింది. అంతేకాకుండా ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు ఈ వ్యాధికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. సాధారణ పరిస్థితుల్లో కార్టజెనర్ సిండ్రోమ్ లేదా ప్రైమరీ సిలియరీ డిస్కీనేసియా లాంటి లక్షణాలు ఉంటాయి.

JEE Advanced 2021: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..


సిటస్ ఇన్వర్టస్‌ రోగనిర్ధారణ ఫిజికల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. దీంతో పాటు ఛాతీ, ఉదర భాగాల్లో చేసే ఎలక్ట్రోకార్డియోగ్రఫీకి చెందిన రేడియాగ్రాఫిక్ ఇమేజింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ జన్యు పరీక్షల సమాచారాన్ని జెనెటింగ్ టెస్టింగ్ రిజిస్ట్రీ అందిస్తుంది. సిటస్ ఇన్వర్టస్‌‌కు చికిత్స అవసరం లేదు. అయితే ఇది వ్యక్తి పరిస్థితి, లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో గుండె లేదా శరీరంలో ఇతర భాగాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుత బాధితుడికి ఈ కారణం వల్లే సర్జరీ చేయాల్సి వచ్చింది.
Published by:Veera Babu
First published:

Tags: Surgery twit, Trending, Trending news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు