హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Risk Of Diabetes: డయాబెటిస్ ముప్పు పెరగడానికి కారణం ఏంటో తెలిసింది..! పరిశోధనలో పలు ఆసక్తికర వివరాలు వెల్లడి..

Risk Of Diabetes: డయాబెటిస్ ముప్పు పెరగడానికి కారణం ఏంటో తెలిసింది..! పరిశోధనలో పలు ఆసక్తికర వివరాలు వెల్లడి..

ప్రతీకాత్మక చిత్రం (Image Credit:Getty)

ప్రతీకాత్మక చిత్రం (Image Credit:Getty)

ఇండియన్స్‌లో డయాబెటిస్ (Diabetes) ఎక్కువగా కనిపించడానికి కారణాలను గుర్తించారు ఐఐటీ మద్రాసు (IIT Madras) పరిశోధకులు. సంస్థ పరిశోధన బృందం నేతృత్వంలోని ఇంటెర్నేషనల్ రిసెర్చ్ టీమ్ ఈ వివరాలను వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. లైఫ్‌స్టైల్ డిజీస్ అయిన షుగర్‌కు ఎదుర్కొనే పద్ధతులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్స్‌లో డయాబెటిస్ (Diabetes) ఎక్కువగా కనిపించడానికి కారణాలను గుర్తించారు ఐఐటీ మద్రాసు (IIT Madras) పరిశోధకులు. సంస్థ పరిశోధన బృందం నేతృత్వంలోని ఇంటెర్నేషనల్ రిసెర్చ్ టీమ్ ఈ వివరాలను వెల్లడించింది. ఇండియన్స్, దక్షిణ ఆసియా దేశాల ప్రజల్లో డయాబెటిస్, హార్ట్ ఎటాక్, హైపర్ టెన్షన్ ముప్పు ఎక్కువగా ఉండటానికి కారణమైన జన్యువు/ ప్రోటీన్‌ను వారు కనిపెట్టారు. 15 శాతం ఇండియన్స్(Indians), దక్షిణ ఆసియా (south asia) దేశాల ప్రజల్లో ఈ ప్రోటీన్ ఉందని చెప్పారు. ఈ ప్రోటీన్ రకం ఉన్న వాళ్ళలో 1.5 రెట్లు ఎక్కువగా హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటిస్, కరోనరి ఆర్టెరీ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Coronavirus: డెల్టా, ఒమిక్రాన్ మధ్య ప్రధాన తేడాలేంటి..? ఏ లక్షణాలుంటే ఏ వేరియంట్​ సోకినట్లు.. తెలుసుకోండి..


అమెరికన్ డయాబెటిస్ అసోషియేషన్‌కు చెందిన ఆన్‌లైన్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. ఇండియన్స్, దక్షిణ ఆసియా దేశాల ప్రజల్లో ఈ ప్రోటీన్ ఉండటం వల్ల మెటబాలిక్ డిసీజెస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని వివరించారు. ఈ రిసెర్చ్ టీమ్ లో ఐ‌ఐ‌టీ మద్రాసుకు చెందిన బయో టెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ నితీష్ ఆర్ మహాపాత్ర, స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ నుంచి భూపత్, జ్యోతి మెహతా, మరి కొంత మంది ఉన్నారు.

దీనిపై మహాపాత్ర మాట్లాడుతూ.. “ దక్షిణ ఆసియా ప్రజలకు మెటబాలిక్(metabolic), కార్డియోవాస్కులర్(cardiovascular) డిసీజెస్ ముప్పు ఎక్కువగా ఉంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, జన్యువుల రకాలే అందుకు కారణం. ఈ జన్యురకాలు ఎలా వ్యాధుల ముప్పు పెంచుతున్నాయనే విషయాలపై ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. మా టీమ్ మెటబాలిక్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కి మూలమైన ప్రోటీన్ ను గుర్తించింది.” అన్నారు.

జన్యువులు శరీరంలో చివరి వరకు ఒకేలా ఉంటాయని, అయితే ఈ పరిశోధన ద్వారా ముందుగానే వ్యాధిని గుర్తించి మెరుగైన ఫలితాలను సాధించవచ్చని రీసెర్చర్లు చెప్పారు. దీనికి సంబంధించి ఇకపై జరిగే పరిశోధనలకు ఈ వివరాలు ఉపయోగపడతాయని, మెడిసిన్ తయారీలోను కీలకం అవుతుందన్నారు. పూర్వీకుల్లో మెటబాలిక్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉండి ఉంటే ఆ కుటుంబ సభ్యులు అప్రమత్తం అయి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చని, ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స పొందవచ్చని మహాపాత్ర చెప్పారు.

క్రోమోగ్రైన్ ఏ (CHGA) అనే ప్రోటీన్‌లో పంకీస్ట్రెయిన్ అనేది చిన్న (పెప్టైడ్) అనేది చిన్న భాగం. ఇది క్షీరధాలు, మనుషుల్లో ఉంటుంది. ఫిజియోలాజికల్ చర్యలపై ప్రభావం చూపుతుందని, ఇన్సులిన్ విడుదల చేయడంలో ఇది కీలకమని ఐ‌ఐ‌టీ మద్రాసు పేర్కొంది. రక్తంలో గ్లూకోజ్, సల్ఫనైల్యూరియా అనే యాసిడ్ స్థాయిల ఆధారంగా ఇన్సులిన్ ను నియంత్రిస్తుందని వివరించింది.

Statue of Equality: ఫిబ్రవరి 5న ‘స్టాట్యూ ఆఫ్​ ఈక్వాలిటీ’ ఆవిష్కరణ.. ఈ విగ్రహం గురించి 10 విషయాలు మీ కోసం..


పరిశోధకులు ముందుగా జన్యువు మార్పులు, మెటబాలిక్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ తీవ్రతను తెలుసుకోవడానికి దాదాపు 400ల మంది ఇండియన్స్ ను పరిశీలించారు. ఈ మార్పులకు ప్లాస్మా గ్లూకోస్ లెవల్స్ తో సంబంధం ఉందని గుర్తించారు. తర్వాత దశలో దాదాపు 4300 మంది ఉత్తర, దక్షిణ భారతీయులను పరిశీలించామని చెప్పారు. వైల్డ్ టైప్ పెప్టైడ్ కంటే ఎక్కువగా వేరియంట్ పెప్టైడ్ పని చేయడానికి గల కారణాలు తెలుసుకోవడానికి, వాటి చర్యలను పరిశీలించడానికి కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్, కంప్యూటేషనల్ మోడలింగ్ స్టడీస్ అధ్యయనం చేశామని అన్నారు. వీటి ద్వారా 297ser రకం జన్యువు ఉన్న వాళ్ళలో వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.

First published:

Tags: Diabetes, Medical Research

ఉత్తమ కథలు