Home /News /life-style /

HEALTH IF YOU WANT TO QUIT SMOKING THESE FIVE WAYS THAT WILL HELP YOU RESIST TOBACCO CRAVING UMG GH

Smoking Addiction: స్మోకింగ్ మానేయాలనుకున్నా సాధ్యం కావట్లేదా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ధూమపానం మానాలంటే.. ఈ ఐదు తప్పక పాటించండి.

ధూమపానం మానాలంటే.. ఈ ఐదు తప్పక పాటించండి.

సిగరెట్టు (cigarette), చుట్ట, బీడీలలో ఉండే నికోటిన్ (Nicotine).. స్మోకింగ్ చేసేవారి మనసును బాగా లాగేస్తుంది. అందుకే ఎంత కంట్రోల్ చేసుకున్నా మళ్లీ మళ్లీ పొగ తాగాలనే (Smoking) కోరిక పుడుతుంది. అయితే ఇలాంటి కోరికలను కళ్లెం వేసి ధూమపానాన్ని వదిలించేందుకు 5 సమర్థవంతమైన మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
పొగతాగడం లేదా స్మోకింగ్ అనేది ప్రాణాంతక వ్యసనం (Addiction) అనడంలో సందేహం లేదు. ఒక్కసారి అలవాటు పడితే ఈ దురలవాటు మానేయడం అసాధ్యం. చాలా మంది ప్రజలు సరదాగా స్మోకింగ్ (Smoking) మొదలెట్టి, ఆ తర్వాత తమకు తెలియకుండానే వ్యసనపరులుగా మారతారు. ఇలా బానిసలయ్యే వారిలో ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఆస్తమా.. ఇలా ఒకటేంటి ధూమపానం వల్ల వచ్చే అనేక అనారోగ్యాలు అనేకం. అయితే స్మోకింగ్ డేంజర్ అని తెలిసి, దానిని మానేయాలని (Quit Smoking) ఎంత ట్రై చేసినా... అది చాలా తక్కువ మందికే సాధ్యమవుతుంది. ఎందుకంటే సిగరెట్టు, చుట్ట, బీడీలలో ఉండే నికోటిన్ (Nicotine).. స్మోకింగ్ చేసేవారి మనసును బాగా లాగేస్తుంది. అందుకే ఎంత కంట్రోల్ చేసుకున్నా మళ్లీ మళ్లీ పొగ తాగాలనే కోరిక పుడుతుంది. అయితే ఇలాంటి కోరికలను కళ్లెం వేసి ధూమపానాన్ని వదిలించేందుకు 5 సమర్థవంతమైన మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మోకింగ్ మానేయాలని దృఢంగా నిర్ణయించుకోవాలి
స్మోకింగ్ మానేయాలనే దృఢనిశ్చయం ప్రతి స్మోకర్‌కు చాలా అవసరం. ఎందుకంటే బలమైన సంకల్పం ఉంటేనే ఈ అలవాటును అధిగమించడం సాధ్యపడుతుంది. అలానే దీన్ని వదిలించుకునేందుకు ఏదైనా మంచి కారణం వెతుక్కోవడం మంచిది. సిగరెట్స్‌ తాగితే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదకరమని భావించడం ద్వారా దీనికి ఫుల్‌స్టాఫ్ చెప్పాలనే తపన మీలో పెరుగుతుంది. ఇంకా ఏదైనా మంచి కారణం కోసం ఈ వ్యసనం నుంచి బయట పడవచ్చు.

ఇదీ చదవండి: బెల్లాన్ని ఇలా వాడితే.. మలబద్ధకం, ఊబకాయం సహా ఈ సమస్యలన్నీ ఫసక్


నికోటిన్‌ విత్‌డ్రా సింప్టమ్స్‌కు ఇలా చెక్ పెట్టాలి!
తాగడం అలవాటు ఉన్న వారి శరీరం నికోటిన్‌కు అలవాటు పడుతుంది. అందుకే అకస్మాత్తుగా నికోటిన్‌ తీసుకోవడం మానేస్తే తలనొప్పి వంటి లక్షణాలు వేధించే ప్రమాదం ఉంది. కాబట్టి, నికోటిన్ గమ్స్ వంటి నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీని ఫాలో అవడం మంచిది.

ఇదీ చదవండి: ఆసనాలు ఆరోగ్యానికి రక్షణ కవచాలు.. ఏ ఆసనం ఎలానో చూద్దామా..!


ప్రియమైన వారితో మీ నిర్ణయం గురించి చెప్పాలి
ప్రియమైన వారందరి ముందు మీరు ధూమపానాన్ని మీ ఆరోగ్యం, భవిష్యత్తు కోసమే మానేస్తున్నామని చెప్పాలి. ప్రామిస్ కూడా చేయాలి. ఇలా చెప్పడం వల్ల వారి ముందు పొగ తాగాలని మీకు అనిపించదు. ఒకవేళ అనిపించినా వారు మిమ్మల్ని ధూమపానం తాగొద్దని కన్విన్స్ చేస్తారు. అవసరమైతే ఈ విషయంలో మీకు సపోర్టివ్‌గా ఉంటారు. లేదంటే మీరు డీ-అడిక్షన్ థెరపీ సెంటర్లలో చేరవచ్చు.

ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటున్నారా..? అయితే బ్లాక్ కాఫీ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి


షుగర్-లెస్ చూయింగ్ గమ్స్‌ నమలాలి
ప్రతి భోజనం తర్వాత ధూమపానం చేసే అలవాటు ఉన్నవారైతే, సిగరెట్‌కు బదులు చూయింగ్ గమ్‌లు నమలడం అలవాటు చేసుకోవాలి. చూయింగ్ గమ్‌లు పొగాకు కోరికలను అణచి వేయడంలో సహాయపడతాయి. లేదా పచ్చి క్యారెట్లు, నట్స్ తినడం వల్ల పొగాకు కోరికను కంట్రోల్ చేసుకోవచ్చు.వర్కౌట్స్‌ చేయాలి
వర్కౌట్స్‌ లేదా ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల స్మోకింగ్ చేయాలనే కోరికలు తగ్గుతాయి. అలాగే వ్యాయామాల వల్ల స్మోకింగ్ కారణంగా వచ్చే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ధూమపానం నుంచి మీ ధ్యాసను మరల్చడానికి వ్యాయామం ఉత్తమంగా నిలుస్తుంది. వాకింగ్, జాగింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేసిన చక్కటి ప్రయోజనాలు అందుకోవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Health, Health benefits, Health care, Smoking habbit

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు