Health : తలనొప్పి వేధిస్తోందా... ఈ చిట్కాలు పాటించండి...

తలనొప్పి రాగానే... టకీమని టాబ్లెట్స్ వేసుకోవడం చాలామందికి అలవాటు. కానీ దీని వలన ఉపయోగం లేకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 11:33 AM IST
Health : తలనొప్పి వేధిస్తోందా... ఈ చిట్కాలు పాటించండి...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 11:33 AM IST
జలుబు, దగ్గు, తలనొప్పి... ఇవి మనలో చాలా మందిని వేధించే రెగ్యులర్ సమస్యలు. జలుబు, దగ్గు వంటివి వేడిచేసినప్పుడు వస్తుంటాయి. తలనొప్పి మాత్రం సరిగా నిద్రపోకపోయినా, ధ్వని కాలుష్యం ఎక్కువైనా, అనారోగ్యం వచ్చినా... ఒంట్లో నలతగా ఉన్నా... వచ్చే సంకేతాలుంటాయి. తలనొప్పి రాగానే.. టకీమని టాబ్లెట్స్ వేసుకోవడం చాలామందికి అలవాటు. కానీ దాని వలన ఉపయోగం తాత్కాలికమే. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. శరీరానికి మందులు అలవాటు చేస్తే... భవిష్యత్తులో చిన్న చిన్న రోగాలే... మందులకు లొంగకుండా పెద్దవయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కింద ఇచ్చిన చిట్కాల‌ను పాటిస్తే త‌ల‌నొప్పిని  సులభంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని దానిలో కొంచెం నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమం తాగడం వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.

* ఆవు పాలు వేడి చేసి తాగితే తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పి తరచూ వేధిస్తుంటే భోజనంలో నెయ్యి వేసుకొని తింటే ఫలితం ఉంటుంది.

* ధనియాలు, చక్కెర, నీళ్లు కలిపి తాగినా తలనొప్పి తగ్గుతుంది. జలుబు వల్ల వచ్చిన తలనొప్పయితే ఈ వంటింటి చిట్కా చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది.



* తలకు కొబ్బరి నూనెతో 10, 15 నిమిషాల పాటు మర్దనా  చేసుకున్నా తలనొప్పి తగ్గిపోతుంది.

* కుర్చీలో కూర్చొని పాదాలను వేడి నీళ్లు నింపిన బకెట్‌లో ఉంచాలి. నిద్రకు ముందు ఇలా కనీసం పావుగంట పాటు చెయ్యడం వలన దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ వల్ల వచ్చిన తలనొప్పి తగ్గిపోతుంది.

* కొత్తి మీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే తలనొప్పి తేలికగా తగ్గిపోతుంది. నీళ్లల్లో కొత్తిమీర, జీలకర్ర, అల్లం వేసి మరిగించి దాన్ని వడపోసి తాగాలి.
Loading...
* తలనొప్పి వల్ల బాధ పడుతుంటే వెన్న, చాక్లెట్లు, మాంసాహారం వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

* క్యాబేజీ, కాలీఫ్లవర్, మెంతి కూర, ఇతర ఆకు కూరల్లాంటి పచ్చటి, ఆకు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తలనొప్పి రాకూడదనుకుంటే బయటదొరికే జంక్ ఫుడ్‌ తీసుకోవడం మానెయ్యాలి.
First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...