Home /News /life-style /

HEALTH HOW TO PREVENT INFECTION FROM DOG BITE UMG GH

Dog Bite Treatment: వర్షాకాలం కుక్కలతో చాలా జాగ్రత్త..! కుక్క కరిస్తే వెంటనే ఇలా చేయండి

కుక్క కాటుకు ఇలా చేయండి

కుక్క కాటుకు ఇలా చేయండి

కుక్క కాటుకు గురైన వారిలో కొందరు సరైన చికిత్స (Treatment) పొందరు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది ప్రాణాలకే ప్రమాదం. కుక్క పళ్లు శరీరంలోకి చొచ్చుకుపోయినప్పుడు దాని చొంగ ద్వారా రేబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉంది.

భారతదేశంలో చాలా వీధి కుక్కలు ఉంటాయి. వీటిలో చాలావరకు మనుషులపై దాడి చేయవు కానీ కొన్ని కుక్కలు మాత్రం మీద పడి కరిచేస్తుంటాయి. ముఖ్యంగా వానాకాలం ప్రారంభంలో కుక్క కాటు కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కుక్క కాటుకు గురైన వారిలో కొందరు సరైన చికిత్స (Treatment) పొందరు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది ప్రాణాలకే ప్రమాదం. కుక్క పళ్లు శరీరంలోకి చొచ్చుకుపోయినప్పుడు దాని చొంగ ద్వారా రేబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉంది. కుక్కల్లో రేబిస్ వ్యాధి ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. కుక్క కరిచినప్పుడు, దాని లాలాజలం నుంచి బ్యాక్టీరియా గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే.. ఇన్ఫెక్షన్ (Dog Bite Infection) కూడా తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతరం కాకుండా, అసలు ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.

ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది ఎలా తెలుసుకోవాలి?
సాధారణంగా కుక్క కరిచినప్పుడు.. కరిచిన చోట శుభ్రమైన నీటితో బాగా కడుక్కోవడం ద్వారా బ్యాక్టీరియా అనేది శరీరం లోపలికి వెళ్లదు. ఇన్ఫెక్షన్ కూడా రాదు. ఆ బ్యాక్టీరియా శరీరం లోపలికి వెళ్తే మాత్రం ఇన్ఫెక్షన్ రావటం అనివార్యమవుతుంది. కుక్కకాటు ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంటే బాధితుడిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం.

ఇన్ఫెక్షన్ లక్షణాలు
కుక్క కరిచిన చోట తీవ్రమైన నొప్పి, వాపుతో పాటు గాయం చుట్టూ శరీరం ఎర్రగా మారుతుంది. ఈ గాయం నుంచి ఆగకుండా రక్తస్రావం అవుతుంది. చీము కూడా పడుతుంది. గాయం చుట్టూ తిమ్మిరి వచ్చినట్లు అనిపిస్తుంది. జ్వరం, తల తిరగడం, చెమట ఎక్కువగా పోయడం వంటి లక్షణాలన్నీ కుక్క కాటు వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తెలిపేవే. కాబట్టి కుక్క కరిచిన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.

కుక్క కాటుకు చికిత్స
కుక్క కరిచిన మరుక్షణమే.. ఇన్ఫెక్షన్ శరీరమంతటా వ్యాపించకుండా గాయాన్ని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలాగే కింద పేర్కొన్న కొన్ని సులభమైన చికిత్సా విధానాలను పాటించవచ్చు.

గాయాన్ని క్లీన్ చేసుకోవాలి
ఏదైనా సర్జరీ చేయించుకోవాలంటే... దానికంటే ముందు గాయాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కరిచిన చోటును ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది.

యాంటీబయాటిక్స్
కుక్క కరిచిన గాయం తీవ్రంగా లేకపోయినా, దాని పంటిగాట్ల వల్ల శరీరంలో లోతైనా గాయం ఏర్పడకపోయినా.. మీరు యాంటీబయాటిక్ క్రీమ్ రాసుకోవచ్చు. ఆపై గాయం చుట్టూ కట్టు కట్టవచ్చు.

టెటానస్ షాట్
కుక్క కాటుకు గురైన వారు ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ వద్ద చికిత్స చేయించుకోవచ్చు. డాక్టర్ మీకు అయిన గాయాన్ని పరిశీలించి సిరలు లేదా నరాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో నిర్ధారిస్తారు. గత ఐదేళ్లలో టెటానస్ టీకాను తీసుకోకపోతే దానిని డాక్టర్ రికమెండ్ కూడా చేయొచ్చు. బూస్టర్ టెటానస్ వ్యాక్సిన్‌ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఆటలు ఆడేటప్పుడు అయ్యే గాయాల వల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్ రాకుండా ఇది నిరోధిస్తుంది.

శస్త్రచికిత్స
కుక్క దాడిలో తీవ్రమైన గాయాలు అయితే.. ఆ గాయాల చుట్టూ కుట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. టీకాలు వేయని పెంపుడు కుక్క లేదా ఊర కుక్క కరిస్తే పోస్ట్ ఎక్స్‌పోజర్ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి.

కుక్క కాటుకు ఎలాంటి చికిత్స పొందకుండా అలసత్వం వహిస్తే.. గాయాలు క్యాప్నోసైటోఫాగా, సెప్సిస్ వంటి అనేక తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. వీటివల్ల కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటు, గ్యాంగ్రేన్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
Published by:Mahesh
First published:

Tags: Dog, Fungal Infections, Health, Pet dog

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు