Parenting: పిల్లల మానసిక ఎదుగుదలను పెంపొందించే అద్భుత సూత్రాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం(Image Courtesy: Shutterstock)

తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక ఎదుగుదల విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. 'మేము ఏదైనా సాధించగల సమర్థులం' అని పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగేలా తల్లితండ్రులు వారిని ట్రైన్ చేయాలి.

  • Share this:
పిల్లల్లో మానసిక ఎదుగుదల పెంపొందించడానికి వారిలో కొండంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం నింపాలి. తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక ఎదుగుదల విషయంలో శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. 'మేము ఏదైనా సాధించగల సమర్థులం' అని పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగేలా తల్లితండ్రులు వారిని ట్రైన్ చేయాలి. నిరుత్సాహపడుతున్న పిల్లలకు పాజిటివ్ మాటలు చెప్పి కొండంత ఆత్మ విశ్వాసాన్ని నింపాలి. ఈ పాజిటివ్ మాటలనే ఆంగ్లంలో పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు. ఇలాంటి వివరాలతో ఒక బుక్ రాశారు ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త అమృత అశ్వని.

పిల్లల కోసం రాసిన "A to Z అఫర్మేషన్ & వెల్నెస్ బుక్ ఫర్ కిడ్స్"ను తాజాగా విడుదల చేశారు అమృత అశ్వని. ఏడాది వయసున్న తన కుమారుడి ద్వారా ప్రేరణ పొందిన అమృత.. ఈ కిడ్స్ బుక్ రాశారు. అయితే పిల్లలకు పాజిటివ్ సెల్ఫ్-టాక్ అలవాటు అయ్యేలా ట్రైన్ చేయాలని ఆమె చెబుతున్నారు. పిల్లల మానసిక వికాసం పెంపొందించేందుకు ఆమె మరిన్ని విషయాలు చెప్పారు. అవేంటో చూద్దాం.

1. ఆత్మవిశ్వాసం నింపాలి:
తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా ప్రోత్సహించాలి. ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేయాలి. అలాగే ప్రేమను పంచాలి. అంతేకాకుండా, పిల్లలు తమకు తాము ప్రేమించుకునేలా చేయాలి. దీనినే సెల్ఫ్-లవ్ అంటారు. ఈ లక్షణం ఉన్నవారు భవిష్యత్తులో పరాజయాలకు కుంగిపోకుండా.. తమ లక్ష్యం వైపు ప్రయాణం సాగిస్తారు.

2. పిల్లల ప్రవర్తన:
పిల్లల ప్రవర్తన అనేది.. వారు పెరిగే వాతావరణాన్ని బట్టి ఉంటుంది. మంచి కుటుంబ వాతావరణంలో పెరిగిన పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. చిన్నతనంలో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా వారి ప్రవర్తన మారుతుంది. అయితే వారికి తరచూ మంచి మాటలు చెప్పడం ద్వారా వారిని మంచి మార్గంలో నడిపించవచ్చు. అలాగే వారి ఆత్మవిశ్వాసం పెంపొందించవచ్చు.

3. చెడు ప్రభావం నుంచి కాపాడాలి:
బయట ప్రపంచంలో చోటుచేసుకునే సంఘటనల వల్ల పిల్లలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ ఇంటి వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మాటలు చెప్పి వారిలో కాన్ఫిడెన్స్ నింపవచ్చు. "నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు" అని బయట వ్యక్తులు చెబుతూ మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. అటువంటి సందర్భాల్లో పాజిటివ్ అఫర్మేషన్స్ బాగా ఉపయోగపడతాయి.

4. సానుకూల దృక్పథం:
జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్న పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. అంతా మంచే జరుగుతుందన్న విశ్వాసంతో వారు ఒత్తిడిని సులభంగా తట్టుకుంటారు. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ లేదా సానుకూల దృక్పథం.. పిల్లల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది. ఇవి మానసిక ఎదుగుదలకు ఎంతో సహాయపడతాయి. అలాగే, నెగిటివ్ ఆలోచనలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దోహదపడతాయి.

5. పవర్ అఫ్ పాజిటివిటీ:
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో పిల్లలపై ఎక్కువ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే, పిల్లల్లో తరచూ పాజిటివిటీని నింపాలి. అలాగే పిల్లల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించాలి.
Published by:Sumanth Kanukula
First published: