హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Seizure: మూర్ఛతో బాధపడుతున్న వ్యక్తికి ఎలా సహాయం చేయాలి? ప్రథమ చికిత్స వివరాలు..

Seizure: మూర్ఛతో బాధపడుతున్న వ్యక్తికి ఎలా సహాయం చేయాలి? ప్రథమ చికిత్స వివరాలు..

Seizure: మూర్ఛతో బాధపడుతున్న వ్యక్తికి ఎలా సహాయం చేయాలి?

Seizure: మూర్ఛతో బాధపడుతున్న వ్యక్తికి ఎలా సహాయం చేయాలి?

Seizure: మూర్ఛ ఒక వ్యక్తి శరీరంలో అసంకల్పిత కదలికలకు దారి తీయవచ్చు. శరీర భాగాలు మెలికలు తిరుగుతాయి లేదా వణుకుతాయి. ఇలా రెండు నిమిషాల పాటు కొనసాగవచ్చు. లేదా బ్లాంక్‌గా చూస్తూ ఉండిపోతారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చాలా సందర్భాల్లో ప్రథమ చికిత్స అనేది ప్రాణాలను నిలుపుతుంది. వైద్య సహాయం అందేలోపు చేసే చిన్న సాయం రోగిని రక్షిస్తుంది. మూర్ఛ అనేది నాడీ సంబంధిత రుగ్మత, కణాలు(Cells) ద్వారా మెసేజెస్‌ పంపినప్పుడు మెదడు కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. ఎలక్ట్రిక్‌ యాక్టివిటీలో ఆకస్మిక మార్పు తరచుగా మూర్ఛకు దారితీస్తుంది. మూర్ఛ ఒక వ్యక్తి శరీరంలో అసంకల్పిత కదలికలకు దారి తీయవచ్చు. శరీర భాగాలు మెలికలు తిరుగుతాయి లేదా వణుకుతాయి. ఇలా రెండు నిమిషాల పాటు కొనసాగవచ్చు. లేదా బ్లాంక్‌గా చూస్తూ ఉండిపోతారు.

మూర్ఛ అనేది ప్రతిసారి అత్యవసర పరిస్థితులను క్రియేట్‌ చేయకపోయినా.. ఇది 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటే వైద్య నిపుణుల సహాయం అవసరం కావచ్చు. అందువల్ల మూర్ఛ రోగిని ప్రమాదం నుంచి దూరం చేయడానికి, వైద్య సహాయం అందే లోపు చేయాల్సిన ప్రథమ చికిత్సపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. దీని గురించి బెంగళూరు, ఆస్టర్ CMI హాస్పిటల్, న్యూరాలజీ & ఎపిలెప్టాలజీ- కన్సల్టెంట్ డాక్టర్ కేని రవీష్ రాజీవ్ అందిస్తున్న సూచనలు తెలుసుకుందాం.

Author: Dr. Keni Ravish Rajiv, Consultant - Neurology & Epileptology, Aster CMI Hospital, Bangalore

* మూర్ఛ ఉన్న వ్యక్తికి ఎలా సహాయం చేయాలి?

మూర్ఛ ఉన్న వ్యక్తికి ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా నిరోధించడానికి, ఈ కింది విధంగా సహాయం చేయవచ్చు.

- రోగి సరిగ్గా ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఓపెన్‌ ప్లేస్‌లో ఉంచాలి.

- మెడ చుట్టూ బిగుతుగా దుస్తులు ఉంటే వదులు చేయాలి, వ్యక్తికి సుఖంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

- వ్యక్తి సమీపంలో గాయాలు చేయగల గాజు, అద్దం లేదా ఫర్నిచర్ వంటి ఏవైనా పదునైన వస్తువులను తీసివేయాలి.

- మూర్చు ముగిసే వరకు వ్యక్తితో పాటు ఉండి, వారు తమను తాము బాధించుకోకుండా నిరోధించడానికి ఒక దిండు లేదా టవల్ ఉంచండి.

- మూర్ఛ సమయాన్ని ట్రాక్ చేయండి, వివరాలను డాక్టర్‌తో పంచుకోండి. సాధారణ మూర్ఛ 20 సెకన్ల నుంచి 2 నిమిషాల మధ్య ఉంటుంది.

- బాధితుడి కుటుంబ సభ్యులను సంప్రదించడానికి వ్యక్తి బ్యాగ్ లేదా వ్యాలెట్‌లో వివరాల కోసం చూడాలి.

- వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు అతని దవడల మధ్య ఏదీ ఉంచకండి, నీళ్లు కూడా తాగడానికి ఇవ్వకండి.

- బాధితుడి కదలికలు ఆగిపోయిన తర్వాత వ్యక్తిని ఒక వైపుకు తిప్పడం ద్వారా శ్వాస నాళాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ దశ చాలా క్లిష్టమైనది ఎందుకంటే మూర్ఛ సమయంలో రోగి నాలుక వెనుకకు కదులుతుంది, వారి శ్వాసను అడ్డుకుంటుంది. అందువల్ల వ్యక్తిని ఒక వైపుకు తిప్పిన తర్వాత, తప్పనిసరిగా వారి దవడ ఫార్వార్డ్‌ డైరెక్షన్‌లో ఉండేలా చూడండి. ఎందుకంటే ఇది శ్వాసను అందించడంలో సహాయపడుతుంది. మూర్ఛ తర్వాత వారి నోటి నుంచి ఏదైనా ఆహారం లేదా వాంతి ఉంటే బయటకు తీయాలి.

* వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

మూర్ఛ సంకేతాలు, లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రంగా ఉంటాయి. అయితే, ఈ లక్షణాలు కొన్ని నిమిషాల్లో తగ్గిపోతాయి. ఈ లక్షణాలు 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. రోగి రెండోసారి వెంటనే మూర్ఛకు గురైతే వైద్యలను సంప్రదించాలి. అదే విధంగా మూర్ఛ వచ్చిన తర్వాత వ్యక్తి స్పందించకపోయినా, మూర్ఛ తర్వాత రోగికి అధిక జ్వరం లేదా వేడి అలసట ఉంటే కూడా నిపుణుల పర్యవేక్షణ అవసరమని గుర్తించాలి. మధుమేహం లేదా గర్భిణులు ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులు మూర్ఛతో మరింత హాని ఉంటుంది. అలాంటి రోగిని గమనిస్తే, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

First published:

Tags: Health benefits, Health care, Health Tips

ఉత్తమ కథలు