• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • HEALTH HOW TO GET RIDE OF PAIN IN MENSTRUAL PERIOD HERE AMAZING TIPS WITH PENCIL SK GH

Pencil Hack: నెలసరి నొప్పిని మాయం చేసే అద్భుతమైన చిట్కా.. కేవలం పెన్సిల్‌ ఉంటే చాలు

Pencil Hack: నెలసరి నొప్పిని మాయం చేసే అద్భుతమైన చిట్కా.. కేవలం పెన్సిల్‌ ఉంటే చాలు

ప్రతీకాత్మక చిత్రం

వెనుకవైపు ఎరేజర్‌ ఉన్న పెన్సిల్‌ తీసుకొని చెవి దగ్గర మసాజ్‌ చేయాలి. అలా చేయడం వల్ల పీరియడ్‌ పెయిన్‌ తగ్గడం ఆమె గమనించిందట. ఒక నిమిషం పాటు ఇలా మసాజ్‌ చేస్తే మంచి ఫలితం ఉందని చెబుతోంది.

  • Share this:
నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేసుకోవడానికి మహిళలు వివిధ పద్ధతులను అనుసరిస్తారు. ప్రతి నెలా ఉండే ఈ నొప్పుల నివారణకు కొత్త చిట్కాను కనుగొంది లెసియామాక్‌ అనే మహిళ. ఈ వివరాలను వీడియో తీసి టిక్‌ టాక్‌లో అప్‌లోడ్‌ చేసింది. దీంతో ఆమె చెప్పిన చిట్కా, ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. సాధారణంగా పీరియడ్‌ పెయిన్‌ను తగ్గించుకోవడానికి కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, బంతిలా ముడుచుకొని నిద్రపోవడం, వేడి నీటి బాటిల్‌ను హత్తుకొని నిద్రపోవడం, పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకోవడం, పొట్టకు తడిచిన క్లాత్‌ చుట్టుకోవడం.. వంటివి చేస్తుంటారు. అయితే ఇంత కష్టపడకుండా చిన్న పెన్సిల్‌తో నొప్పిని జయించొచ్చు అనేది తాజా వీడియో సారాంశం. ఈ చిట్కాను ఎలా ప్రయత్నించాలో చేసి చూపించింది ఆ మహిళ.

లెసియామాక్‌ తన టిక్‌ టాక్‌ వీడియోలో చూపించిన ప్రకారం... వెనుకవైపు ఎరేజర్‌ ఉన్న పెన్సిల్‌ తీసుకొని చెవి దగ్గర మసాజ్‌ చేయాలి. అలా చేయడం వల్ల పీరియడ్‌ పెయిన్‌ తగ్గడం ఆమె గమనించిందట. ఒక నిమిషం పాటు ఇలా మసాజ్‌ చేస్తే మంచి ఫలితం ఉందని ఆమె చెబుతోంది. అలానే రెండో చెవికి కూడా మసాజ్‌ చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తోందని చెబుతోంది. అయితే నిజంగానే నొప్పి తగ్గుతుందా అనే అనుమానాలు చాలామందికి కలగవచ్చు. కానీ ఆమె చెప్పింది నిజమే అని వీడియోకు చాలామంది కామెంట్లు పెడుతున్నారు. లెసియామాక్‌ పెన్సిల్ చిట్కా వీడియోను ఇప్పటి వరకు 15 లక్షల మందికి పైగా చూశారు.

కామెంట్స్‌లో కొన్నింటిని పరిశీలిస్తే... ‘గతంలో పీరియడ్‌ టైమ్‌లో నొప్పిని తగ్గించడానికి మందులు వేసుకునేదాన్ని. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది’ అని ఒకరు రాశారు. ‘నొప్పి నివారణకు ఇన్నాళ్లూ నేను మెడిటేషన్‌ చేసేదాన్ని.. ఇప్పుడు ఆ అవసరం లేదు’ అని మరొకరు రాశారు. అయితే లెసియామాక్‌ చెప్పిన విధానం ఆక్యుపంక్చర్‌ తరహాదేనని దాని మీద అవగాహన ఉన్నవాళ్లు అంటున్నారు. చెవి దగ్గర ఉండే నరాలకు శరీరంలో వివిధ భాగాలతో సంబంధం ఉంటుందని, అందుకే అక్కడ మసాజ్‌ చేస్తే నొప్పి తగ్గుతుందేమో అని అంటున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు