Menopause Causes: 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా మెనోపాజ్‌ని ఎదుర్కొని తీరాల్సిందే. యుక్త వయసులో దరిచేరే పీరియడ్స్ 40 ఏళ్లు దాటగానే దూరమవుతాయి. అయితే... అదే సమయంలో ఎన్నో శారీరక సమస్యల్ని మహిళలు అధిగమించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.
సాధారణంగా మెనోపాజ్ సమయంలో.. మహిళలు వేడి ఆవిర్లు పుట్టడం, అధికంగా చెమటలు పట్టడం, నిద్రలేమి, ఛాతి తగ్గిపోవడం, జుట్టు రాలడం, లైంగిక వాంఛ లేకపోవడం, హార్ట్‌బీట్ పెరిగిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా మెనోపాజ్‌ని ఎదుర్కొని తీరాల్సిందే. యుక్త వయసులో దరిచేరే పీరియడ్స్ 40 ఏళ్లు దాటగానే దూరమవుతాయి. అయితే... అదే సమయంలో ఎన్నో శారీరక సమస్యల్ని మహిళలు అధిగమించాల్సి ఉంటుంది. హార్మోన్స్ లెవెల్స్ అస్తవ్యస్తంగా మారడంతో కొంతమందికి సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.
అప్పుడే యుక్తవయసుకి వచ్చే అమ్మాయిలు శరీరంలో వచ్చిన మార్పులని చూసి మురిసిపోతారు. అవి అలాగే కొనసాగి మాతృత్వానికి దారితీస్తాయి. అయితే... అవి ఊరికే జరగవు కదా.. వాటి వెనుక ఓ రహస్యముంది. అవే హార్మోన్స్. వాటి గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఈస్ట్రోజన్, ప్రొజెస్థిరాన్లు. ఇవి యుక్త వయసులో అమ్మాయిల్లో చేరి గిలిగింతలు పెట్టి... వయసు దాటిపోగానే... రిలాక్స్ అవుతుంటాయి. ఫలితంగా రుతక్రమం ఆగిపోతుంది. దాన్నే మోనోపాజ్ అంటారు. ఆ సమయంలో.. ఎన్నో శారీరక సమస్యలు మహిళలకు ఇబ్బందులు పెడతాయి. వాటిని అధిగమించాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి.
ప్రతీకాత్మక చిత్రం
* పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. * కాఫీ, టీ, మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. * వ్యాయామం చేయడం కూడా ఎంతో ముఖ్యం. * షుగర్ ఉంటే గనుక ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాలి. * బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. * ప్రతి ఆరునెలలకోసారి హెల్త్ చెకప్స్ తప్పనిసరి. * అధిక రక్తస్రావం, గుండె వేగంగా కొట్టుకోవడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుండటం వంటివి అవుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. * మీ సమస్యను బట్టి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. * యోని భాగం ఎక్కువగా పొడిగా అయ్యి ఇబ్బంది పెడుతుంటే ల్యూబ్రికెంట్స్ వాడాలి. దాంతో ప్రయోజనం లేకపోతే... వేజినాల్ ఈస్ట్రోజెన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. * ఈ సమయంలో సోయా పాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.