జికా వైరస్ అంటే ఏంటీ? ఎలా వ్యాపిస్తుంది?

జికా వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈడిస్ ఈజిప్టై రకం దోమకాటు ద్వారా జికా వైరస్ సోకుతుంది. జికా సోకిన వ్యక్తి మరొకరితో లైంగిక చర్యలో పాల్గొంటే వారికీ ఈ వైరస్ సోకుతుంది. గర్భిణీలకు ఈ వైరస్ సోకితే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. లేదా నెలలు నిండకుండానే ప్రసవించడం, మృత శిశువుకు జన్మనివ్వడం లాంటివి జరగొచ్చు.

news18-telugu
Updated: August 14, 2019, 6:16 PM IST
జికా వైరస్ అంటే ఏంటీ? ఎలా వ్యాపిస్తుంది?
ప్రతీకాత్మక చిత్రం..
news18-telugu
Updated: August 14, 2019, 6:16 PM IST
జికా వైరస్... మళ్లీ వార్తల్లోకి వచ్చిన భయంకరమైన వ్యాధి ఇది. కొంతకాలంగా రాజస్తాన్‌లో జికా వైరస్ కలకలం రేపుతూనే ఉంది. 150కి పైగా కేసులు నమోదయ్యాయి. అటు మధ్యప్రదేశ్‌లో ఇద్దరు జికా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా 84 మంది ఆస్పత్రి పాలయ్యారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ మాత్రమే కాదు... ఇతర రాష్ట్రాల్లోనూ జికా వైరస్ జాడలు బయటపడుతున్నాయి. అసలేంటి ఈ జికా వైరస్? ఎక్కడ పుట్టింది? ఇండియాకు ఎలా పాకింది? ఈ వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలేంటీ? జికా వైరస్ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? తెలుసుకోండి.

జికా వైరస్ అంటే ఏంటీ?
జికా వైరస్... చాలాకాలంగా ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకర వైరస్ ఇది. డెంగీ, చికున్ గున్యా, ఎల్లో ఫీవర్ లాంటి వ్యాధులను కలిగించే వైరస్ జాతికి చెందినదే జికా. 1947లో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. తొలిసారి ఉగాండాలోని జికా అడవుల్లో సంచరించే కోతుల్లో ఈ వైరస్‌ని కనుగొన్నారు. ఆ అడవి పేరుతోనే జికా వైరస్‌గా పిలుస్తున్నారు. ఆ తర్వాత ఈ వైరస్ దోమలకు వ్యాపించింది. ఉగాండా నుంచి ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈస్ట్ ఆఫ్రికాలో యెల్లో ఫీవర్‌పై అధ్యయనం చేస్తుండగా ఈ వైరస్ జాడలు బయటపడ్డాయి. 1952లో జికా వైరస్ అని పేరుపెట్టారు. ఈ వైరస్‌కు జికా అని పేరు పెట్టడానికి కారణం.... అది జికా అడవుల్లో పుట్టడమే. ఆ తర్వాత ఆఫ్రికా నుంచి ఆసియాకు పాకింది ఈ భయంకరమైన వైరస్. 2014లో పసిఫిక్ మహాసముద్రం నుంచి ఫ్రెంచ్ పోలినేషియాకు విస్తరించింది. 2015లో మెక్సికో, సెంట్రల్ అమెరికాలో వైరస్ కనిపించాయి. ఈ వైరస్ బ్రెజిల్‌తో పాటు దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో విస్తరించిన వైరస్ ఇది. ఇప్పటి వరకు 80 దేశాల్లో వైరస్ కలకలం రేపింది.

జికా వైరస్ అంటే ఏంటీ? ఎలా వ్యాపిస్తుంది?, History of Zika virus: Everything that you should know about it…
ప్రతీకాత్మక చిత్రం
జికా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
జికా వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈడిస్ ఈజిప్టై రకం దోమకాటు ద్వారా జికా వైరస్ సోకుతుంది. జికా సోకిన వ్యక్తి మరొకరితో లైంగిక చర్యలో పాల్గొంటే వారికీ ఈ వైరస్ సోకుతుంది. గర్భిణీలకు ఈ వైరస్ సోకితే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. లేదా నెలలు నిండకుండానే ప్రసవించడం, మృత శిశువుకు జన్మనివ్వడం లాంటివి జరగొచ్చు. ఒకవేళ బిడ్డ పుట్టినా శిశువు తల, మెదడు చిన్నగా ఉంటుంది. దీన్నే మైక్రోసెఫలీ అని పిలుస్తుంటారు. అందుకే పుట్టబోయే పిల్లల్ని ఈ వైరస్ బారి నుంచి కాపాడేందుకు 2015లో బ్రెజిల్‌లో పిల్లల్ని కనడం ఆపాలని నిపుణులు సూచించారంటే జికా ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... గర్భిణీలు కూడా ప్రయాణాలు మానుకోవాలని చెప్పారు.

జికా వైరస్ అంటే ఏంటీ? ఎలా వ్యాపిస్తుంది?, History of Zika virus: Everything that you should know about it…
ప్రతీకాత్మక చిత్రం
Loading...
జికా వైరస్ లక్షణాలేంటీ?
జికా వైరస్ సోకిన వ్యక్తులకు జ్వరం వస్తుంది. కళ్లు ఎరుపెక్కడం, శరీరంపై దద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు, వాంతులు, ఆయాసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మొదట్లో డెంగ్యూ, చికున్‌గున్యా లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత రక్తపరీక్షల ద్వారా జికా వైరస్‌ని నిర్థారిస్తారు. సాధారణంగా జికా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుంచి 7 రోజుల్లో తగ్గుతుందంటారు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోవడం మంచిది. తగ్గుముఖం పడుతుందని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉంది. రక్తం, మూత్రం, ఉమ్మిని పరీక్షించి జికా వైరస్‌ని నిర్థారించొచ్చు. ఇప్పటివరకు ఈ వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. అయితే ప్యారాసిటమోల్(ఏసిటమైనోఫెన్) ద్వారా కొంతవరకు వైరస్‌ను అడ్డుకోవచ్చు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డెంగ్యూ, చికున్ గున్యా సోకినవారికీ జికా వైరస్ సోకే ప్రమాదం ఉంది.
అందుకే డెంగ్యూ, చికున్ గున్యా బాధితులు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లో దోమలు తిరగకుండా చూసుకోవాలి.
ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.
దోమలు కుట్టకుండా మంచాలకు జాలి ఏర్పాటు చేసుకోవాలి.
శరీరమంతా కప్పి ఉంచే దుస్తుల్ని వేసుకోవాలి.
లక్షణాలు కనిపించగానే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స ప్రారంభించాలి.
జికా వైరస్ సోకినవాళ్లతో లైంగిక చర్యల్లో పాల్గొనకూడదు.

ఇవి కూడా చదవండి:

Video: డయాబెటిస్ రావొద్దా? ఇలా చేయండి!

కీటో డైట్‍‌తో డయాబెటిస్ ముప్పు!

హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్ గురించి ఈ విషయాలు తెలుసా?

హెల్త్ ఇన్సూరెన్స్: ఈ 20 అంశాలు గుర్తుంచుకోండి!
First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...