హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Healthiest Tea: ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన టీ ఇదే.. దీని గురించి మీకు తెలియని కొన్ని విషయాలు..

Healthiest Tea: ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన టీ ఇదే.. దీని గురించి మీకు తెలియని కొన్ని విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీ లేదా చాయ్​తో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. రోజూ పొద్దున్నే టీ తాగనిదే డే స్టార్ట్​ అవ్వదు చాలా మందికి. ఇది మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని అంతా భావిస్తారు. టీ దక్షిణాది రాష్ట్రాల్లో తరచుగా చాయ్ అని పిలుస్తారు.

టీ(Tea) లేదా చాయ్​తో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. రోజూ పొద్దున్నే టీ తాగనిదే డే స్టార్ట్​ అవ్వదు చాలా మందికి. ఇది మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని అంతా భావిస్తారు. టీ దక్షిణాది రాష్ట్రాల్లో తరచుగా చాయ్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలో(India) ఒక ప్రసిద్ధ పానీయంగా పేరొందింది. ఒక కప్పు టీతో(Tea) ఎంతో ఒత్తిడి దూరమవుతుంది. అయితే, టీలో అనేక రకాలున్నాయి. ఒక్కో టీ రకానికి ఒక్కో రకంగా తయారు చేస్తారు. మీరు ఒక కప్పు టీతో ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ను(Fitness) కూడా కోరుకుంటే.. లావెండర్ మిల్క్ టీతోనే అది సాధ్యమవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన టీ అని ఆరోగ్య నిపుణులు ఎన్నో పరిశోధనల అనంతరం తేల్చి చెప్పారు. కాబట్టి, మంచి ఆరోగ్యానికి ఈ కెఫిన్ రహిత కషాయాన్ని ట్రై చేయండి.

ఆరోగ్యంతో పాటు ఫిట్​నెస్​ ప్రయోజనాలు..

లావెండర్​ మిల్క్​ టీ తయారీలో సుగంధం, లావెండర్​ ఆకులను వాడతారు. ఇది సువాసను ఇవ్వడమే కాకుండా అమోఘమైన రుచిని అందిస్తుంది. లావెండర్ మిల్క్ టీ సువాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. అంగుస్టిఫోలియా మొక్క నుండి సేకరించిన ఎండిన లావెండర్ పూల రేకులను పాలలో కలిపడం ద్వారా ఈ రుచికమైన టీని తయారు చేస్తారు. సహజంగా లావెండర్​ ఆకులను తల, మెదడు వ్యాధులకు అద్భుతమైన నివారణగా వాడతారు. అంతేకాదు, పురాతన మందుల తయారీ, చికిత్స నివారణకు యాంటిడిప్రెసెంట్‌గా ఉపయోగిస్తారు. అందుకే, ఇది ఆరోగ్యకమైన పానీయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Coffee: డైలీ ఎన్ని కప్పుల కాఫీ తాగాలో మీకు తెలుసా..? అంతక మించి తాగితే ప్రమాదకరమా..? తెలుసుకోండి..


ఈ సువాసన వెదజల్లే లావెండర్​ మిల్క్​ టీ మిశ్రమం తక్షణమే మీ ఇంద్రియాలను మేల్కొల్పుతుంది. మీ శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది. ఎండిన లావెండర్‌ ఆకులలో ఉండే ప్రోటీన్ మీ శరీరానికి బలాన్ని చేకూర్చుతుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రపోయే ముందు లావెండర్​ మిల్క్​ టీని సేవించడం ద్వారా సహజమైన ఉపశమనకారిగా పని చేస్తుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజం చేయడంలో సహాయపడుతుంది. లావెండర్​​ ఆకుల్లో ఉన్న పోషకాల గురించి తెలుసుకుందాం.

సినోల్

ఇది ఊపిరితిత్తుల నుండి శ్లేష్మం తొలగించడంలో సహాయపడే యాంటీమైక్రోబయల్.

టానిన్

ఇది శరీరంలోని ఇన్​ఫ్లమేటరీ ప్రక్రియలను తగ్గిస్తుంది. శ్వాసకోశ శ్లేష్మ పొరపై పూతలని నయం చేస్తుంది.

సిట్రల్

ఇది కంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి సహాయపడుతుంది.

ఉర్సోలిక్ యాసిడ్

ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. నేచురల్​ పేస్‌మేకర్‌గా పనిచేస్తుంది. అథెరోస్క్లెరోసిస్ నివారణలో సహాయపడుతుంది. క్యాన్సర్ కణాలపై పోరాటంలో శరీరానికి సహాయపడుతుంది.

Astrology: ఈ 5 రాశుల వాళ్లు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.. వీరితో స్నేహం చేస్తే ఆనందం మీవెంటే..!


వాలెరిక్ యాసిడ్

ఇది పెద్దప్రేగు పనితీరును మెరుగుపరుస్తుంది.

లావెండర్ మిల్క్ టీ తయారీ విధానం

వేడి నీటి గిన్నెలో, లావెండర్ పువ్వులను 5 నిమిషాల పాటు నానబెట్టండి.

ఆ తర్వాత దాన్ని వేడి చేయండి. అయితే, దీన్ని పొంగిపోనివ్వవద్దు

తర్వాత, టీ బాస్కెట్‌ని ఉపయోగించి, లావెండర్‌ను ఫిల్టర్ చేసి, మగ్‌లో వడకట్టండి. దీనిలో వేడి చేసిన పాలను పోయండి. ఈ మిశ్రమంలో స్వీటెనర్ వేసి కలపండి. అంతే, లావెండర్ మిల్క్​​ టీని ఆస్వాదించండి.

First published:

Tags: Health benifits, Lifestyle, Tea

ఉత్తమ కథలు