Home /News /life-style /

HEALTH HERES HOW TO GET RID OF MOTHS EATING YOUR CLOTHES GH VB

Moths: మీ దుస్తులను తినే కీటకాలను ఇలా వదిలించుకోండి... అసలు ఇవి క్లాత్స్‌ను ఎందుకు తింటాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిన్న సైజులో ఉండే చిమ్మటలు (మాత్స్-Moths) దుస్తులను తినేస్తుంటాయి. వీటిని తరిమేయడం చాలా కష్టం. అందుకే ఖరీదైన దుస్తులను ఈ చిమ్మటల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియక చాలామంది తికమకపడుతుంటారు.

లాక్‌డౌన్ (Lockdown) లో చాలామంది ఇంటికే పరిమితమయ్యారు కాబట్టి వారు తమ వార్డ్‌రోబ్‌ (Wardrobe)ను చాలా రోజుల తరువాత ఓపెన్ చేసి ఉండవచ్చు. ఇలా వార్డ్‌రోబ్‌ని ఎక్కువ కాలం తెరవకపోతే ఇందులో సర్దిన దుస్తుల్లోకి చిన్న చిన్న పురుగులు చేరవచ్చు. ఇలాంటప్పుడు ఇష్టమైన దుస్తుల (clothes)పై అవి రంధ్రాలు చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఎప్పటికప్పుడు వార్డ్‌రోబ్‌ను పరిశుభ్రంగా ఉంచుకుంటే దుస్తులు తినే చిన్న కీటకాలు అందులోకి చేరవు. ముఖ్యంగా చిన్న సైజులో(Size) ఉండే చిమ్మటలు (మాత్స్-Moths) దుస్తులను తినేస్తుంటాయి. వీటిని తరిమేయడం చాలా కష్టం. అందుకే ఖరీదైన దుస్తులను ఈ చిమ్మటల నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియక చాలామంది తికమకపడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే వీటిని వార్డ్‌రోబ్‌(WardRobe)లో చేరకుండా జాగ్రత్త పడొచ్చు. మరి వీటిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

New Smartphone: రూ. 999లకే శామ్​సంగ్​ గెలాక్సీ 5జీ స్మార్ట్ ఫోన్.. ఇలా సొంతం చేసుకోండి..


నిజానికి దుస్తులకు రంధ్రాలు పెట్టే పురుగులను చిమ్మటలు/మాత్స్ అని అందరూ అనుకుంటుంటారు. కానీ దుస్తులను పాడుచేసేవి వాటి లార్వా (గొంగళి పురుగులు). ఈ లార్వా నుంచే చిమ్మటలు తయారవుతాయి. అందుకే చిమ్మటలను చంపేసినా వాటి లార్వా జంతు ఆధారిత వస్త్రాలను నాశనం చేస్తాయి. కాస్త నలుపుగా ఉండే బట్టలను ఇవి ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. ఈ చిమ్మటలు మీ విలువైన బట్టలు, నూలు వస్త్రాలను ఆహారంగా ఆరగించేస్తుంటాయి. అయితే డ్యామేజ్ అయిన వాటిని ఇంకా డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాలంటే డ్రై క్లీనింగ్ చేయాలి అంటున్నారు నిపుణులు. బాగా వేడి నీటితో బట్టలను వాష్ చేసి ఈ పురుగులకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఎండలో బట్టల్ని ఆరేయడం ద్వారా చిమ్మటల గుడ్లను, లార్వాలను చంపేయచ్చు.

Vitamin D: అధిక మోతాదులో విటమిన్ D తీసుకుంటుంన్నారా.. ఈ 5 సైడ్​ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి..


చీకటి ఎక్కువగా ఉండే వార్డ్‌రోబ్‌లో చిమ్మటలు, వాటి లార్వా ఎక్కువగా తిష్ట వేస్తాయి. అయితే మీ వార్డ్‌రోబ్‌లో వెలుతురు ఎప్పుడూ ఎక్కువగా ఉన్నట్లయితే ఇవి అందులోకి చేరవు. అలాగే వార్డ్‌రోబ్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. బాగా ఖరీదైన వస్త్రాలను ఎయిర్-టైట్ కవర్లలో స్టోర్ చేయడం మంచిది. ఇవన్నీ వర్కవుట్ కాకపోతే మాత్‌బాల్స్ అనే రసాయన పురుగుమందులు వాడితే సరిపోతుంది.

దుస్తులను తినే కీటకాల విషయానికొస్తే ఇదొక అసాధారణ జీవశాస్త్రాన్ని ప్రతిబింబిస్తుందని నిపుణులు చెబుతుంటారు. వాస్తవానికి గ్రీకు, రోమన్ సాహిత్యంలో బట్టల చిమ్మటల గురించి ప్రస్తావించారు. దీన్నిబట్టి మానవులు వేల సంవత్సరాలుగా బట్టల చిమ్మటల వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. బూడిద వర్ణంలో ఉండే ఈ బట్టల చిమ్మటపురుగులు... చిమ్మటల (టినీడే-Tineidae) పురాతన వంశంలో ఒక భాగం. ఈ బట్టల పురుగులు టినీడే జాతి నుంచి కొన్ని వింత లక్షణాలు పొందాయి. ఈ లక్షణాల వల్లే కొన్ని జాతులు తెగుళ్లుగా కూడా మారాయి. ఆస్ట్రేలియాలో వెబ్బింగ్ క్లాత్స్ చిమ్మట (టినోలా బిస్సెల్లియెల్లా) కేస్ మేకింగ్ బట్టల చిమ్మట (టినియా పెల్లియోనెల్లా) అనేవి అత్యంత ప్రసిద్ధి చెందిన బట్టల చిమ్మట జాతులు. ఈ సాధారణ పేర్లు గొంగళి పురుగుల వల్ల తయారైన పట్టు రూపాన్ని ఆశ్రయంగా సూచిస్తాయి. పెరిగి పెద్దయిన బట్టల చిమ్మట పరిమాణం 4 మిమీ - 9 మిమీ వరకు ఉంటుంది. అంటే దీని సైజు బియ్యం గింజ పరిమాణంలో ఉంటుంది. లార్వా పెద్ద చిమ్మటలుగా మారిన తర్వాత అవి మళ్లీ ఏ ఆహారం తినవు.

How to Become Rich: ధనవంతులు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..


అసౌకర్య ఆహారం..
దుస్తులను తినే చిమ్మటపురుగు పరిణామాత్మక మూలం అనేది చాలా కాలం క్రితమే ఇతర చిమ్మటల నుంచి 98% వేరేయ్యింది. అందుకే ఈ కీటకాలు ఇతర చిమ్మటలకు భిన్నంగా ఆహారటలవాట్లను కలిగి ఉంటాయి. చాలా టైనీడ్ జాతులు సాధారణ గొంగళి పురుగుల లాగా సజీవ మొక్కలను తినవు. ఇవి కుళ్లిన చెక్క, శిలీంధ్రాలు, లైకెన్లు, డెట్రిటస్, గుహలలోని బ్యాట్ పూలను కూడా తింటాయి. కొన్ని జాతులు సహజసిద్ధమైన దుస్తులలో కనిపించే కెరాటిన్ (ఒక రకమైన ప్రొటీన్)ని కూడా తింటాయి. ఇవి ఉన్ని, సిల్క్ వంటి జంతువుల నుంచి సేకరించిన వస్తువులను మెల్లగా తినడానికి ఇష్టపడతారు. అలాగే వార్డ్‌రోబ్‌లోని సింథటిక్స్ లేదా మిశ్రమ ఫైబర్‌లు కూడా ఇవి తినేస్తాయి. బట్టల చిమ్మట లార్వా సింథటిక్, బ్లెండెడ్ ఫైబర్‌లను తింటాయి. ముఖ్యంగా చెమట లేదా ఆహారంతో తడిసినవి దుస్తులను ఇవి తినేస్తాయి.
Published by:Veera Babu
First published:

Tags: Life Style

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు