Sesame Oil: నువ్వుల నూనెతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..? ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..!

నువ్వుల నూనెతో ప్రయోజనాలు

ప్రతి రోజూ ఆహారంలో నువ్వుల నూనెను (Sesame Oil) తీసుకోవడం ద్వారా ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) పొందవచ్చని ఆయుర్వేదం (Ayurveda) చెబుతోంది.

  • Share this:
మార్కెట్లో ఆవాలు (Mustard Oil), ఆలివ్ (Olive Oil), కొబ్బరి నూనె (Coconut Oil) ఇలా చాలా రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆయుర్వేదంలో (Ayurveda) నువ్వుల నూనె (Sesame Oil) ప్రాముఖ్యతను ఏ ఇతర నూనె కూడా భర్తీ చేయలేదు. చూడ్డానికి చాలా చిన్నగా కనిపించే నువ్వుల గింజల్లో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యం ఉంది. అందుకే శతాబ్ద కాలంగా ఆయుర్వేద మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు నిపుణులు. రకరకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగించే అన్ని ఆయుర్వేద మందులలో 40 శాతం నువ్వులే ఉంటాయి. బోలెడు ఔషధగుణాలు ఉన్న నువ్వుల గింజలను పౌడర్, పేస్ట్ లేదా నూనెల రూపంలో సాంప్రదాయ భారతీయ ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. మీరు కూడా మీ డైట్ లో నువ్వుల నూనెను యాడ్ చేసుకోవడం ద్వారా చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏవో చూద్దాం.

1. నువ్వుల నూనె పోషక విలువలు
నువ్వుల నూనెను నువ్వుల నుంచి తయారు చేస్తారు. ఈ తినదగిన నూనెను మన వంటకాల్లో కూడా వాడొచ్చు. దీనికి సహజంగానే మంచి రుచి ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి శుద్ధి చేయాల్సిన అవసరం ఉండదు. ఒక టీస్పూన్ నువ్వుల నూనెలో 120 క్యాలరీలు, 14 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మాత్రం 0 గ్రాములు ఉంటాయి.

ఇది చదవండి: చిన్నారుల్లో గురక ఎందుకు వస్తుంది..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!



2. యూవీ రేస్, కాలుష్యం, టాక్సిన్స్ నుంచి చర్మ కణాలకు రక్షణ
నువ్వుల నూనెతో మసాజ్ చేయడం ఆయుర్వేదంలో కీలకమైన వైద్య చికిత్సగా వస్తోంది. నువ్వుల నూనె చర్మం కణజాలాల్లోకి లోతుగా చొచ్చుకుపోతుంది. ఇది చర్మం దిగువ పొరను చేరుకుని.. చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. నూనెలో ఉండే విటమిన్ ఇ యూవీ కిరణాలు, కాలుష్యం, టాక్సిన్స్ నుంచి చర్మ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

ఇది చదవండి: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?


3. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది
నువ్వుల నూనె మీ శరీరంలో వేడిని పెంచుతుంది. అందుకే నువ్వుల నూనెతో చలికాలంలో మసాజ్ చేయడం ఉత్తమం. ఇది కండరాల నొప్పి, దగ్గు, జలుబు తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల మీ శరీరానికి కావాల్సిన వేడి దొరుకుతుంది. బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. మీ వాతాన్ని కూడా సమతుల్యం చేయగల సామర్థ్యం నువ్వుల నూనెకు ఉంది. అయితే, వేసవికాలంలో నువ్వుల నూనెను ఉపయోగించకూడదు.

ఇది చదవండి: మారుతున్న సీజన్.. ఈ సమయంలో ఫ్లూ వంటి వ్యాధులకు ఇలా చెక్ పెట్టొచ్చు..!


4. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
ఇతర నూనెలతో పోలిస్తే నువ్వుల నూనె శరీరంలో త్వరగా జీర్ణమవుతుంది. నువ్వుల నూనెలో పుష్కలంగా లభించే ఫైబర్ ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా నువ్వుల నూనె కీళ్ల వాపు, పంటినొప్పి, గీరుకుపోయిన గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

ఇది చదవండి: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?


5. ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం
నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్లనొప్పులకు సంబంధించిన వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎలుకలపై నిర్వహించిన అనేక అధ్యయనాలు నువ్వుల నూనె ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తాయని తేల్చాయి. ఈ నూనెను గాయమైన ప్రాంతంలో లేదా కాలిన గాయాలపై మర్దన చేస్తే.. గాయాలు మానుతాయి.

ఇది చదవండి: గుడ్లు తినడం ఒక కళ.. అది న్యూట్రిషనిస్టులు చెప్పే వేళ.. అదేంటో తెలుసుకోండి.



6. చక్కటి నిద్ర అందిస్తుంది
నిద్రలేమితో బాధపడేవారికి నువ్వుల నూనె మంచి ప్రయోజనాలు అందిస్తుంది. నుదుటిపై నువ్వుల నూనె చుక్కలతో 5 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల బాగా నిద్ర పడుతుంది.
Published by:Purna Chandra
First published: