Santosh, News18, Warangal
నీరు అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ త్రాగునీటిలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో రకం త్రాగునీరుకి ఒక్కో ప్రత్యేకత ఉందని చెప్తుంటారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే నీరు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావట.. అవేంటో తెలుసుకుందాం. హెల్దీ ఈటింగ్ అన్న కాన్సెప్ట్ ఎంత పాతదో అంత కొత్తది. ఎప్పటికప్పుడు ఇందులో కూడికలూ తీసివేతలూ జరిగిపోతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇందులోకి కొత్తగా యాడ్ అయిన విషయం ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.
క్రానిక్ డిసీజెస్‌ని ప్రివెంట్ చేయడం, బాడీలోని పీహెచ్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడం, వయసు మీద పడకుండా చూడడం వంటివి ఈ ఆల్కలైన్ వాటర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ లో కొన్ని. ఆల్కలైన్ వాటర్ వల్ల బాడీలోని యాసిడ్ లెవెల్స్ న్యూట్రలైజ్ అవుతాయి. ఈ పని నార్మల్ వాటర్ చేయలేదు. అయితే, ఈ ఆల్కలైన్ వాటర్ మంచి చెడుల గురించి చాలా చర్చలే జరిగాయి. అసలీ ఆల్కలైన్ వాటర్ అంటే ఏమిటో తెలుసుకుందాం రండి.
ఆల్కలైన్ వాటర్ అంటే..?
ఆల్కలైన్ వాటర్ అంటే అయొనైజ్ చేసిన వాటర్. అంటే, వాటర్ యొక్క పీహెచ్ లెవెల్ ని పెంచడం. ఈ పీహెచ్ లెవెల్ అనేది ఒక సంఖ్య. ఈ సంఖ్య ఒక పదార్ధం ఎసిడిక్ పదార్ధమా, ఆల్కలైన్ పదార్ధమా అని సున్నా నుండి పద్నాలుగు వరకూ ఉన్న స్కేల్‌లో చెబుతుంది. అంటే, పీహెచ్ లెవెల్ ఒకటి అయితే అది ఎసిడిక్ పదార్ధమనీ, పదమూడైతే బాగా ఆల్కలైన్ పదార్ధమనీ తెలుస్తుంది. నార్మల్ వాటర్ పీహెచ్ లెవెల్ ఏడు. అదే ఆల్కలైన్ వాటర్ పీహెచ్ లెవెల్ ఎనిమిది గానీ, తొమ్మిది కానీ ఉంటుంది. అందుకే నార్మల్ వాటర్ ఎసిడిక్ కాదు, ఆల్కలైన్ కాదు, అది న్యూట్రల్.
ఈ ఆల్కలైన్ వాటర్ యాసిడ్ ని తగ్గిస్తుంది కాబట్టి ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారికి హెల్ప్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇలా యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేయడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుండి మనని కాపాడుకోగలుగుతాం. స్పెషల్ ఫిల్టర్స్, ఫాసెట్ ఎటాచ్ మెంట్స్, ఎడిటివ్స్ వంటి వాటి ద్వారా నార్మల్ వాటర్ ని ఆల్కలైన్ వాటర్ గా మార్చవచ్చు.
అయితే, శరీరంలో రకరకాల ద్రవాలు ఊరుతూ ఉంటాయి. ఇవి ఎసిడిక్ గా ఉంటాయి. కాబట్టి ఆల్కలైన్ వాటర్ వీటిని న్యూట్రలైజ్ చేస్తుంది. నిజానికి మన ఆహారం డెబ్భై శాతం ఆల్కలైన్ గా ముప్పై శాతం ఎసిడిక్ గా ఉండాలి. అప్పుడే అది లోపలికి వెళ్ళిన తరువాత శరీరం యొక్క పీహెచ్ లెవెల్ న్యూట్రల్ అయిపోతుంది. ఇలా పీహెచ్ లెవెల్స్ ని బాలెన్స్ చేయని ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు ఆల్కలైన్ వాటర్‌ని తీసుకోమని సజెస్ట్ చేస్తారు.చాలా మందికి నార్మల్ వాటరే మంచిది. అయితే, హైబీపీ, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఉన్న వారికి ఆల్కలైన్ వాటర్ హెల్ప్ చేస్తుందని అంటున్నారు. ఈ వాటర్ ఎంత మంచిదో, ఎందుకు మంచిదో, ఎవరికి మంచిదో తేల్చి చెప్పేంత సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరిగిందంటున్నారు. కానీ, ఈ బెనిఫిట్స్ ఉంటాయని మాత్రం ఆల్కలైన్ వాటర్ మంచిదని నమ్మేవాళ్ళు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Drinking water, Local News, Telangana, Warangal